Search This Blog

Thursday 8 February 2018

Andhras are not fools....

ముందు రెవెన్యూ లోటు గురించి మాట్లాడుకొందాం. ఆనాడు అనగా విభజన జరిగిన సంవత్సరంలో కాగ్  లెక్కవేసి ,రెవెన్యూ లోటు 16000కోట్లుగా తేల్చింది . తర్వాత 14 వ ఆర్ధిక సంఘం లెక్కవేసి రెవెన్యూ లోటు సుమారు 9000కోట్లు అని చెప్పారు.
అమరావతికి నిధులు ప్రతి ఏటా కనీసం 10000కోట్లు ఇవ్వవలసి ఉంది . కానీ దాని ఊసు  లేకుండా 5బడ్జెట్ లు కానిచ్ఛేసి ,ఇంకా ఎదురు చూడమంటున్నారు.
పోలవరం తదితర ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు నిధులు సకాలంలో ఇవ్వడం లేదు. ఇచ్చినా అరకొర గా విదిలిస్తున్నారు.
ఇ ఏ పి ప్రాజెక్ట్ లకు కాలు అడ్డమువేసి కాలయాపన చేస్తున్నారు. హడ్కో,నాబార్డ్ ద్వారా నిధులు ఇచ్చే అవకాశమున్నా లేనిపోని సాకులు చెబుతున్నారు.
ఇప్పటివరకు పేపర్ ప్రకటనలకే పరిమితమైన జాతీయ స్థాయి సంస్థలకు ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కనీసం ఆఖరి బడ్జెట్ లో నూ  నిధులు కేటాయించలేదు.
మిత్రపక్షంగా ఉంటున్నా ,ఏనాడూ మాకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. నాలుగు ఏళ్ళు సహనంతో ఎదురు చూసినా ,మాకు నిరాశ మిగిల్చారు. బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నపుడు మిత్రపక్షాలనుండి ఇన్ పుట్స్ తీసుకోవాలన్న ఇంగితం కూడా లేదు.
చట్టప్రకారం ఆంధ్రాని  ప్రత్యేకరాష్ట్రంగా చూడవలసి ఉన్నా , కనీసం, ఇతర  రాష్ట్రాలకు మామూలు గా  నిధులు ఇస్తున్నట్లుగా,  ఇవ్వడానికి  కూడా నానా యాగీ చేస్తున్నారు. ఎన్నిసార్లు మీ దగ్గర పడిగాపులు కాయాలి ? ఎన్ని ఫైల్స్ మీకు పంపాలి? ఎన్ని యూసర్ బిల్స్ పంపాలి?
విభజన లో 9,10 షెడ్యూల్ లోని ఆస్తుల పంపకాలనూ మీరు పూర్తి చేయలేదు.
మేమేమీ బిచ్చమ్ అడగడం లేదు. న్యాయము , చట్టం ప్రకారం మాకు రావలసియున్న వాటినే డిమాండ్ చేస్తున్నాం.
భౌగోళిక ప్రాతిపదికన ఆస్తులు, జనాభా ప్రాతిపదికన అప్పులు, వినియోగం ప్రాతిపదికన విద్యుత్‌, జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల పింఛన్లు విభజించి న్యాయం చేస్తానన్న  కేంద్రం ఇంతవరకు ఆ పనిపూర్తి చేయలేదు. ఉభయరాష్ట్రాలకు ఒక్క గవర్నర్ ని పెట్టారు. ఎపుడైనా ఎంతవరకు పని అయింది అని గవర్నర్ ని  ఆరా తీశారా? 

ప్లానింగ్ కమిషన్ అనేది స్వతంత్ర ఆర్ధిక సంస్థ . ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించాలో నిర్ణయించే అటానమస్  అధికారం ఉన్న  ఆ సంస్థను రద్దు చేసి , నిధులను రాష్ట్రాలకు పంచే అధికారాన్ని కేంద్రం తన చేతిలోకి తీసుకొని, తనకిష్టమైన రాష్ట్రాలకు అదీ ఎలక్షన్ లు జరిగే ముందు ఎలాపడితే ఆలా నిధులు గుమ్మరిస్తే మిగతా రాష్ట్రాలు ఎలా బతకాలి?  కేంద్రాన్ని కాదనే రాష్ట్రాలకు మొండి చేయి చూపెడుతుంది. ఇది అప్రజాస్వామిక మైన చర్య. 

ఊకదంపుడు ఉపన్యాసాలు మొదట్లో బాగున్నాయని జనం నమ్మి మోడీకి అధికారం ఇచ్చారు. పాలనలో కొన్ని మంచి సంస్కరణలు తెచారు గానీ,అమలు చేయడంలో దారుణంగా విఫలం అయ్యారు. స్వచ్ఛ గంగ,స్వచ్ఛభారత్  లాంటి విఫల పధకాలు ఎన్నో ప్రవేశపెట్టినా, కొన్ని మంచి వినూత్నమైన చర్యలు చేపట్టారు. అందుకే మీ పై నమ్మకంతో సహనంతో ఎదురు చూశాం . 
విద్యుత్పాదన , పల్లెలకు విద్యుత్ సౌకర్యం, పాలనలో  సంస్కరణలు, అందరికీ వంటగాస్, కేంద్ర సంక్షేమ పథకాలలో  ఆధార్ ని ఉపయోగించి అవినీతిని అరికట్ట డం , పాలనలో కుంభకోణాలు లేకుండా విజయం సాధించారని చెప్పవచ్చు. 
 డెమో, డిజిటల్ లావాదేవీలు,గోల్డ్ మోనిటైజేషన్ , బినామీ నియంత్రణ, రియల్ ఎస్టేట్ నియంత్రణ,  జి. ఎస్. టి  గురించి  ప్రజలలో ఇంకా బాగా అవగాహన పెంచి మరింత పకడ్బందీగా అమలుచేయవచ్చు . డెమో కి ముందుగానే బాంక్ లను మరింతగా సిద్ధం చేసి   సాంకేతికతను ఉపయోగించి .మానిటర్ చేయడానికి అనువుగా చేయవచ్చు. ఇవన్నీ క్షమించగల పొరపాట్లే!    
కానీ ప్రజలందరినీ కేవలం ఓటర్లు గా చూడటం అనేది మరీ ముదిరిపోయిన రాజకీయ అధికార కాంక్షకు గుర్తు. 

తెలుగు దేశం పుట్టిందే  కాంగ్రెస్ వారి చేతిలో పతనమైన తెలుగు ఆత్మగౌరవం రక్షణకోసమని  మోడీ లోక్ సభలో  చెప్పారు . అలంటి కాంగ్రెస్ తో ఎవ్వరూ జతకట్టకూడదు... ముఖ్యంగా తెలుగుదేశంపార్టీవాళ్ళు కాంగ్రెస్ తో జతకట్టకూడదని మోడీ అభిప్రాయం. 
 TDP పార్లమెంట్ సభ్యులు  చేస్తున్న ఆందోళనకు మద్దతు నిస్తున్న కాంగ్రెస్ వారిని చూసి కడుపు మంటతో మోడీ అన్నమాటలా అవి? లేక   ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని  కాపాడిన అభిమాన నాయకుడిని మెచ్చుకొని,  ఆంద్ర సెంటి మెంట్ ని రాజేసి ఆంధ్రుల మనస్సును గెలుచుకో వాలన్న యుక్తా ? 
కేసులతో సతమవ్వుతూ, తనకాళ్లకింద బానిసలా పడిఉండే  జగన్  తో అంటకాగడానికి మానసికంగా సిద్ధమైన అమిత్ షా &మోడీ మాటలు ఆంధ్రులే కాదు,రాబోయే ఎన్నికలలో ఎవ్వరూ నమ్మేపరిస్థితి లేదు. 
ఒకటిమాత్రం నిజం, గల్లా జయదేవ్ చెప్పినట్లు , మోడీ కపటపు మాటలు నమ్మడానికి  ఇపుడు...  ఆంధ్రులు  ఫూల్స్ కాదు. 




Wednesday 7 February 2018

కోసూరు క్షత్రియులు - క్షత్రియ చరిత్ర. -1వ భాగం

కోసూరులో (కృష్ణాజిల్లా)  క్షత్రియ కుటుంబాలు ఉన్నాయని ఇంతకు  మునుపు చెప్పుకొన్నాం. వీరికి, గోదావరి క్షత్రియులకు తేడా ఉందని  కొన్ని అపోహలున్నాయి. బ్రాహ్మణులలో ఎన్ని శాఖలున్నాయో క్షత్రియులలో కూడా అన్ని శాఖలున్నాయి. ఆ శాఖలకు మరోపేరే వంశం.  ఆంధ్రాలో నాలుగు వంశాలున్నా , సూర్య,చంద్ర వంశం వారి మధ్యనే ఎక్కువగా వివాహ సంబంధాలు జరుగుతున్నాయి.ఉత్తరభారతం నుండి వలసలు మొదలై ,కృష్ణా ,గోదావరీ నదీ తీరాల వెంబడి వారి జీవనం సాగింది .

నిజానికి వేదకాలంలో కులాలు అనే చీలికలు లేవు. కేవలం 4  వర్ణాలు ,అదీ స్వభావాన్ని,వృత్తిప్రవృత్తులను బట్టి నిర్ణయించే వారే తప్ప,పుట్టుకను బట్టి నిర్ణయించే వ్యవస్థలెదు.

మరాఠా క్షత్రియులలో  లో 96 శాఖలున్నాయి . అలాగే  రాజస్థాన్ రాజపుట్ లు  ,హర్యానా లో జాట్ లు, ఉత్తరప్రదేశ్ లో ఠాకూర్ లు,  ఇంకా అనేకరాష్ట్రాలలో భిన్న మైన పేర్లతో క్షత్రియులున్నారు.తమిళనాడులో అరసు ,ఒడయార్ లు, నాయకర్ లు, కర్ణాటకలో బంటూ లు , కేరళలో మలబార్  నాయర్ లు, ఉత్తరప్రదేశ్ లో ఖేత్రీ లు, ఒరిస్సాలో ఖండైట్  లు , బెంగాల్ లో పోలియా మరియు ఆగూరియా లు  క్షత్రియులుగా ఉన్నారు.

నిజానికి క్షత్రియులంటే ఎవరు? 
ఈ ప్రశ్నకు జవాబు చాలాకష్టం . సమాజపరంగా ,ఆర్ధిక స్థితిగతుల పరంగా  మానవసమూహాలను  వర్గాలుగా విడదీసి చూస్తున్న కాలమిది. క్షత్రియ అనే పదము వేదకాలములో వృత్తి-ప్రవ్రుత్తి లను బట్టి , రాజన్యులకు,వీరులకు ,రక్షణచేసి శాంతిని స్థాపన చేసేవారికి ఇచ్చిన నామం. తర్వాత ఇతిహాస పురాణకాలంలో వృత్తి-ప్రవ్రుత్తి లకు సంబంధం లేకుండా , పుట్టుకను అనుసరించి తరతరాలుగా  క్షత్రియుల వంశం అనే పేరు వాడుకలోకి వచ్చింది. తర్వాత కాలంలో వంశ మూలపురుషుడు, కొలిచే దైవం,ఆచారసాంప్రదాయాలను బట్టి  క్షత్రియ వర్గంలోనే  4 వంశాలు.. . సూర్య-చంద్ర-అగ్ని-నాగ వంశాలు మొదలయ్యాయి.  కుల గురువు ని అనుసరించి గోత్రం,  ఋషిప్రవర , మూలపురుషులను అనుసరించి రాజప్రవర  వాడుకలోకి వచ్చాయి. 
 క్షత్రియ'అనేపదం వీరత్వం,ధీరత్వం,శూరత్వానికి చిహ్నంగా వాడుకలోకి వచ్చింది. మనదేశంలోని భిన్న సామ్రాజ్యాలను  క్షత్రియులు మాత్రమే స్థాపించి పాలన చేయలేదు. ఇతర వర్ణాలవారు కూడా పాలన చేశారు. ఉదాహరణకు కణ్వ సామ్రాజ్యం బ్రాహ్మణ వర్ణం వారు స్థాపన చేసి పాలించారు. శాతవాహనులు కూడా క్షత్రియవర్ణానికి చెందినవారు కాదని కొందరు చరిత్రకారుల భావన. అలాగే క్షహ రాటులు మధ్య ఆసియా నుండి వచ్చి ఇక్కడనే స్థిరపడి శక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే కుషాణులనే వాళ్ళు పశ్చిమ రష్యా ప్రాంతం నుండి వచ్చి పాలించారు. వారిలో కనిష్కుడు మంచి రాజుగా  పేరు పొందాడు.   
గుప్తులు క్షత్రియ వర్ణానికి చెందినవారు కాదు. 

 క్రీస్తుపూర్వం 2000 ఏళ్ల కాలాన్ని ఇతిహాస,పురాణ కాల మంటారు. ఆ కాలంలో  రాజన్యులకు,రాజగురువులకు మధ్యన సంఘర్షణ వలన బ్రాహ్మణులు ,క్షత్రియులనే వర్గాల మధ్య  వైషమ్యం పెచ్చు మీరుతా ఉండేది. కాలక్రమంలో  బ్రాహ్మణులు (రాజగురువులు) వేదాలకు వక్రభాష్యాలు చెప్పు కొంటూ ఎవరికీ తోచిన విధంగా వారు వాఖ్యానాలు ప్రచారం చేస్తూ యజ్ఞయాగాలకు  విపరీతార్ధాలు తీస్తూ దానాలు,బలులు ప్రోత్సహిస్తూ ఒక విధంగా
వ్యవసాయ,పాడిపంట ల ఉత్పత్తి ని వారే దోచేస్తూ ఉండేవారు. రాజన్యులు ( క్షత్రియులు ) ఇది గమనించి తిరుగుబాటు చేస్తూ ఉండేవాళ్లు. ఆలా మొదలైన వారే జైన మహావీరుడు,బౌద్ధ సిద్ధార్థుడు.  వీరిద్దరూ రాజన్యులే.
వేదానికి విపరీతార్ధాలను  వాఖ్యానిస్తూ బ్రాహ్మణ మతం ఎప్పుడైతే ప్రజలను భయపెట్టి ,ప్రలోభపెట్టి మతంగా మారి పీడించడం మొదలుపెట్టిందో అపుడే భిన్న ఆలోచనా ధారలతో జైన,బౌద్ధ మతాల రూపంలో సమాజంలో తిరుగుబాటు మొదలైంది.

ఇతిహాస పురాణకాలంలో సంస్కృత భాష స్థానంలో ప్రాకృతం,బ్రహ్మి ,పాళీ ,దేవనాగరి బయల్దేరడానికి కూడా ఒక కారణం ఉంది. బ్రాహ్మణ మతం వారి సంస్కృత భాషను పక్కనపెట్టి వారికీ వ్యతిరేకమైన భావజాలాన్ని వ్యాపితం చేయాలంటే జనం మాట్లాడే యాసలో భాష తేలికగా ఉండాలనే ఉద్దేశ్యంతో వివిధ భాషలు పరివ్యాపితం చెందాయి.

మధ్య ఆసియా అనగా నేటి ఇరాన్,ఇరాక్, సిరియా,టర్కీ ప్రాంతం,అలాగే నేటి ఆఫ్ఘనిస్థాన్, సియస్దాన్ , పాకిస్థాన్ ప్రాంతాలు, అలాగే అజర్ బైజాన్, కజకిస్థాన్, మొదలైన పశ్చిమ రష్యా ప్రాంతం,పశ్చిమ చైనా ,మంగోలు ప్రాంతాలన్నీ భరత ఖండంలో కలిసిఉండేవి. రకరకాల జాతులు,కొందరు మొరటుగా,జిప్సీ  జీవితం గడిపేవాళ్లు,మరికొందరు మైదానప్రాంతాలవాళ్ళు కొంచెం నాజూకుగా ఉండేవాళ్ళు ... ఇలా  భిన్న జాతులన్నింటినీ మ్లేచ్చు లనే వాళ్ళు ఇండియాలోఉన్న బ్రాహ్మణులు . కానీ కాలం గడిచిన కొద్దీ ఈ మ్లేచ్చులన బడే జాతులు  ప్రస్తుతం  నార్త్ ఇండియా  గా చెప్పుకొంటున్న  ప్రాంతాలపై  దాడులు చేస్తూ కొంతకాలానికి  ఇక్కడనే ఉండిపోయి కొత్త రాజ్యాలు స్థాపన చేసుకొని స్థానిక ప్రజలతో  కలిసిపోయి వారి ఆచారాలు పాటిస్తూ వివాహాలు చేసుకొంటూ
కలిసిపోయారు. కొన్ని సార్లు గ్రీకులు,రోమన్లు కూడా సముద్రాన్ని దాటి టర్కీ మీదుగా ఉత్తరభారతం పై దండయాత్రలు చేసి వారూ ఇక్కడనే ఉండిపోయారు.

ఈ విధంగా భిన్నజాతులు ... వారినే ఇండో-పార్దియన్ లు , ఇండో-సిథియన్ లు (శకులు )  , ఇండో-బాక్ట్రియన్ లు , ఇండో-గ్రీకులు , ఇండో-మంగోలియన్ లు  (కుషాణులు), భిన్న భాషలు,యాసలు,భిన్న శరీర ఆకృతులు,ముఖ కవళికలు,భిన్న భావజాలం తో   ఉత్తరభారతం పై కి తోసుకు వచ్చినా, మెజారిటీ జాతులన్నీ స్థానికంగా ఉన్న ఆచారసాంప్రదాయాలను  ఆచరిస్తూ వారూ క్షత్రియులలెక్క ఈ భారత సమాజంలో చెలామణీ అయ్యారు. ఎందుకంటే వారు శారీరకంగా బలవంతులు, మొరటువారు. యుద్ధవిద్యలలో నిష్ణాతులు. స్థానికంగా ఉన్న బ్రాహ్మణులను ఎదిరిస్తూ ఉన్న స్థానిక క్షత్రియులకు వీరు తోడవ్వడంతో ముఖ్యంగా క్షత్రియ మతాలైన బౌద్ధ,జైన మతాలకు బాగా  ఊపొచ్చింది. అలాగని అందరూ క్షత్రియులుగా మారారని చెప్పలేం.  కొంతమంది నాజూకు వాళ్ళు  తెలివి ఎక్కువగా ఉన్నవాళ్లు బ్రాహ్మణు  వర్గంలో కలిసిపోయారు. మరికొందరు వారుచేసే పనిని బట్టి,  సూద్రులుగా ,వైస్యులుగా చెలామణీ అయ్యారు.
ఇలా  గత 4000 ఏళ్లుగా ఉత్తరభారత మరియు మధ్య భారత ప్రాంతం భిన్న జాతుల కలగూర గంపగా మారిపోయింది. జన్యు పరీక్షలలో కూడా తేలింది ఇది.
దీనిని బట్టి మనం అర్ధం చేసుకో వలసింది ఏమిటి?
 శుంగ వంశస్తులు, కణ్వ వంశం, శాతవాహనులు,మౌర్యులు,గుప్తులు , రాజులు ,వర్మలు, చాళుక్యులు, చోళులు , ఇక్ష్వాకులు , తదితర క్షత్రియ వర్గం వారు ,... వీరందరూ  ఉత్తర,మధ్యభారత ములో  స్థానికంగా ఉన్న క్షత్రియ వంశాలకు చెందిన వాళ్ళే తప్ప మధ్య ఆసియా నుండి వచ్చిన మ్లేచ్చులు కాదు.  కానీ, పల్లవులు,రాజపుత్రులు , జాట్ లు ,ఠాకూర్ లు ,   పైన చెప్పుకొన్న మధ్యఆసియా కి చెందిన భిన్న జాతుల నుండి వ్యాప్తి చెందిన వారే!
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, స్థానిక క్షత్రియులైనా , మధ్యఆసియా , పశ్చిమ రష్య  నుండి వలస వచ్చి  క్షత్రియులుగా చెలామణీ ఐనవారైనా అందరూ కూడా మన భారతీయ ఆచారసాంప్రదాయాలను, హిందూ బ్రాహ్మణ మతమో లేక జైన బౌధ్ధమతాన్నో అనుసరించి భారతీయతకు వన్నెలు అద్దినవారే!
సూర్య,చంద్ర,అగ్ని,నాగ  వంశాలనేవి ఆయా మూలజాతుల ఆచార సంప్రదాయాలను బట్టి అనూచానంగా వచ్చినవే!

మనిషి భిన్నరకాలుగా ఆలోచిస్తాడు. అందుకే భిన్నంగా కనిపిస్తాడు. ఆలోచన'అనేది లేకుంటే మనుషులందరూ ఒక్కటే'!
శరీరనిర్మాణం ,ముఖకవళికలనేవి ప్రాంతాన్ని బట్టి,ఆహారాన్ని ,వాతావరణ స్థితులను బట్టి భిన్నరకాలుగా పరిణామం చెందుతూ ఉంటాయి. చెబితే ఆశ్చర్యపోతారు. నేటి బ్రిటిష్ వారి మూలపురుషుడు తెల్లవాడుకాదు, నల్లవాడే!అంతేకాదు, మానసిక నిర్మాణం అనగా  ఎక్కువ శాతం ఆలోచనలు కూడా వంశ పారంపర్యంగా  వస్తాయి. అందుకే,ఒకే  వంశంలో ని  మానవులలో శరీర,మానసిక నిర్మాణం లో పోలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమాజంలో జీవించాలంటే మంచి బలమైన దేహనిర్మాణం,  స్థిరమైన భావాలూ,ఆలోచనలు  ఉన్న సంతానం అవసరం. దీని కోసం వంశము,గోత్రము అనేవి వ్యాప్తి చేశారు .ఇది సాధ్యపడాలంటే పటిష్టమైన  వివాహ వ్యవస్థ ఉండాలని దానిని ఆచరించారు.    ఈ విషయం, మన జన్యు పరోశోధనలలో ముఖ్యంగా "Y" క్రోమోజోమ్
యెక్క సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి గోత్రం,వివాహ వ్యవస్థ అత్యవసరం అని తేలింది .


క్రీస్తు శకం మొదటి వేయి సంవత్సరాలలో  అనగా క్రీస్తుశకం 1 నుండి 10 వ శతాబ్దం వరకు , మధ్యప్రదేశ్క్ష,రాజస్థాన్,మహారాష్ట్ర   ప్రదేశాలనుండి క్షత్రియ కుటుంబాలు  దక్షిణా పదానికి వలస వచ్చి నెమ్మదిగా రాజ్యాలు స్థాపించుకొన్నాయి. ఆలా వచ్చిన వాళ్లలో పెద్దరాజ్యాన్ని స్థాపన చేసింది శాతవాహనులు.
పల్లవులు,చాళుక్యులు,పరిచేది , చోళులు ,ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు,కాకతీయులు   ఆ తర్వాత దక్షిణా పదాన్ని శాసించారు. వీరందరూ జన్మత : క్షత్రియులని చెప్పలేము. రాజ్యం వీరభోజ్యం . వీరులకే రాజ్యం దక్కుతుంది.  తెలివైన మంత్రాంగం, ప్రజా పాలన సరిగా ఉంటె  ఆ రాజ వంశం నిలబడు తుంది .

 నిజానికి వేద కాలంలో జన్మనిబట్టి వర్ణం నిర్ణయించే ఆచారం లేదు. కేవలం గుణాలను, వృత్తి ప్రవ్రుత్తి లను ఆధారం చేసుకొని వర్ణ నిర్ణయం జరిగేది. కానీ క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళక్రితం నుండే ఈ ఆచారం మంటగలిసిపోయి కేవలం జన్మను బట్టి వర్ణ నిర్ణయం జరిగేది.  క్రమేణా వర్ణాలు కులాలుగా మారడం అనేది క్రీస్తుశకం 15 వ శతాబ్దం తర్వాతనే అని చరిత్రకారులు చెప్పారు. ఇందులో వాస్తవమెంతో ఇంకా నిర్ణయించ వలసిఉంది .

11 వ శతాబ్దం నుండి మొదలైన గజనీ, మొగలాయీలు , తురుష్కుల దండయాత్రల వలన క్షత్రియ వంశాలు చిన్నాభిన్నమైపోయాయి .కకావికలమైపోయి దేశం నాలుగు చెరగులా వలసలు పోయారు.విదేశీ మూకల నిర్దాక్షిణ్యమైన అణచి వేత తర్వాత , మందుగుండు సామాను వచ్చి పడటంతో కత్తి కటారు యుద్ధవిద్యలకు  ఆదరణ,అవసరం తీరిపోయింది. అలాగే క్షత్రియ పాలకుల వంశాలు కూడా ప్రాణభయంతో చెట్టుకొక్కరు,పుట్టకొక్కరు లా చెల్లా చెదురై పోయారు. కేవలం 50 వంశాలు నిలదిక్కుకొని సంస్థానాలను ఏలుకొంటూ ఉన్న స్థితిలో మాజీప్రధాని  ఇందిరా గాంధీ  ఒక్క పెన్ను పోటుతో వాటన్నింటినీ రద్దు చేసి బిచ్చ గాళ్ళ లెక్క మార్చేసింది.

నిజానికి  ఎవరైతే సమాజంలో  ఘర్షణలను తగ్గించి శాంతిని స్థాపన చేస్తారో వారే క్షత్రియులు . ఇది ఒక రాచ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అబ్బే  లక్షణం కాదు. ఆంధ్ర క్షత్రియులని తొట్టతొలుత చెప్పు కొనే వారిలో ప్రప్రథమ వంశం శాతవాహన వంశం . ఈ వంశం వాళ్ళు మౌర్యులతర్వాత సుమారు 300 ఏళ్ళు,నేటి తెలంగాణ,ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాలను పాలించారు.

గౌతమీ పుత్ర శాతకర్ణి,  నేటి గుజరాత్,సౌరాష్ట్ర ప్రాంతాన్ని పాలించే శక రాజు  క్షత్రప మారాజు ని ఓడించడంతో , శక వంశం నెమ్మదిగా కనుమరుగైపోయింది . కానీ ఆ శకులే , క్షత్రపులని, క్షహరాటులని ,క్షత్రియులని వ్యవహరించడం క్రమేణా జరిగింది.
కాబట్టి రాజ్యాలు పాలించేవారే క్షత్రియులు కానక్కరలేదు. గత 2000 ఏళ్లలో వివిధ వర్ణాలు రాజులుగా,చక్రవర్తులుగా పాలించారు.  కానీ సైనికులుగా, దళపతులుగా, చమూ పతులుగా ఎక్కువ శాతం క్షత్రియ వర్ణం వారు ఉండేవాళ్లు.
సూద్రులలో ఎన్ని శాఖలున్నాయో,అలాగే క్షత్రియులలో కూడా ఎన్నో శాఖలున్నాయ్. అవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. క్షత్రియ ధర్మాన్ని ,సంప్రదాయాన్ని పాటిస్తూ శాంతిని నెలకొల్పే ఏ మనిషైనా క్షత్రియుడే!

చర్మం రంగు,ముఖ కవళికలు , మనస్తత్వం అనేవి ఒక గుంపులో ఒకే రకంగా దగ్గర పోలికలతో  ఉంటాయి.
ఒకే రకమైన పక్షులు,పశువులు గుంపులుగా జీవిస్తాయి. మరి మనిషికి తెలివి,వాక్కు , హృదయచైతన్యం ఉన్నాయి. మరి మనిషి కూడా పశు పక్ష్యాదులు లాగ బతకవలసిందేనా?

( తర్వాత  2 వ భాగం  ). 


మట్టికొట్టి పోయిన మోడీ - Modi's Betrayal.

మామూలుగా అయితే , కేంద్రపాయిజిత  ప్రాజెక్ట్ లకు కేంద్రం 60% ఉచిత నిధులు, రాష్ట్రాలకు  ఇస్తుంది. కానీ ప్రత్యేక సాయం అందించవలసిన రాష్ట్రాలకు 90% ఉచిత నిధులు ఇస్తుంది.
విదేశీ సాయంతో (EAP) చేపట్టె  ప్రాజెక్ట్ లకు విదేశీ బ్యాంకులు ఋణాలిస్తాయి . ఈ ఋణాలు అంతతేలికగా రావు. విదేశీ బాంక్ లు, కేంద్రాన్ని  కౌంటర్ గారంటే అడుగుతాయి. ఇవన్నీ జరగడానికి చాల సమయం పడుతుంది.

కేంద్రపాయిజిత పథకాలకు  మాత్రమేకాదు విదేశీ సాయంతో (EAP) చేపట్టె  ప్రాజెక్ట్ లకు కూడా 90% ఉచిత నిధులు రాష్ట్రానికి  ఇవ్వాలని చంద్రబాబు కోరిన మీదట,కేంద్రం 2016లో ఒప్పుకొంది. సరే అని, చంద్రబాబు 18000కోట్ల విలువైన ,13 ప్రాజెక్ట్ లు ( విదేశీ సాయంతో (EAP) చేపట్టె  ప్రాజెక్ట్ లు )  తెచ్చుకొని ఫైల్ ని కేంద్రానికి పంపారు. కానీ ,కేంద్రం కొర్రీ లపై కొర్రీ లు వేస్తూ కాలయాపన చేయడంతో ఇప్పటికే 4 ఏళ్ళు గడిచి పోయాయి.

 ప్రత్యేకప్యాకేజి  వెసులుబాటు మనరాష్ట్రానికి కేవలం 5ఏళ్ళు మాత్రమే ఇచ్చింది కేంద్రం. అనగా 2020 తో గడువు పూర్తై పోతుంది. అంటే, ఇంకా 2 ఏళ్ళు మాత్రమే సమయముంది. అందుకే చంద్రబాబు కనీసం నాబార్డ్ ద్వారా రుణాలిప్పించమని కేంద్రాన్ని అడిగాడు.
ఆలా నాబార్డ్ ద్వారా ఇస్తే  రాష్ట్ర ద్రవ్యలోటు పెరిగిపోయి, రాష్ట్రం రుణాలుపొందే సామర్ధ్యం తగ్గిపోతుందని జైట్లీ అంటున్నారు. అనగా , ప్రపంచ బాంక్ నుండి ఋణాలు పొందితే రుణ సామర్ధ్యం తగ్గ దని జైట్లీ గారి అభిప్రాయమా?
ప్లానింగ్ కమిషన్ అని కొంతకాలం,,నీతిఆయోగ్ అని కొంతకాలం, అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కావాలని కొంతకాలం, ప్రాజెక్ట్ లో క్లారిటీ రావాలని కొంతకాలం , DPR  పంపలేదని కొంతకాలం,  పుణ్యకాలం గడిపేసింది కేంద్రం.
 హోదా బదులు ప్యాకేజి ఇస్తున్నట్లు  అటు ప్రకటించి , ఇటు ఆ ప్యాకేజి  ప్రయోజనాలకు గండికొట్టాలనే కుతంత్రం చేస్తుందని సాక్షాత్ ఆంద్ర అధికారులే వాపోతున్నారంటే, మోడీ రాజకేయం ఇలా ఉంటుందా?అని ప్రజలు విస్తుపోతున్నారు.
రాజకీయప్రయోజనం లేనిదే మోడీ&కో పైసా విదిల్చరు .
 రాష్ట్రం మట్టికొట్టుకు పోవాలనే,...  అమరావతి శంకుస్థాపన కి  విచ్చేసి కాస్త మట్టి కొట్టి వెళ్లాడు  మహానుభావుడు.

Tuesday 6 February 2018

Chandrababu Vs Modi

పార్లమెంట్ సాక్షిగా మోడీ -చంద్రబాబు సంవాదం .

ఆంద్ర ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తుంది ? తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఉభయ సభలలో దేనికోసం  ధర్నా చేస్తున్నారు?  

Andhra Pradesh State Reorganisation, 2014 లోఏమైతే ఉన్నాయో వాటన్నింటికి సరిపడా నిధులు వెంటనే మంజూరు చేయాలి . ఇప్పటికే 4ఏళ్ళు గడిచిపోయింది. మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి,మీమీద (కేంద్రప్రభుత్వం) పై నమ్మకంతో ఇన్నేళ్లు ఓపికపట్టాం . బడ్జెట్ తయారు చేస్తున్నపుడు మావైపు నుండి ఏమికావాలో సాక్షాత్ ప్రధానికి వివరించాం . అయినా బడ్జెట్ లో ఆంద్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీ కరణ చట్టం లో ని ఏవిషయాన్నీ మీరు పట్టించుకోలేదు. నిధుల  కేటాయింపు లేదు . రైల్వే జోన్ ఊసు లేదు. నిధులను  విదేశీ బ్యాంకు లనుండి తీసుకోమని ఓ పక్క చెబుతున్నా, వాటికీ అనుమతులు ఇవ్వడంలో కేంద్రం కాలయాపన చేస్తూ ఏదో ఒకరకంగా ఆ బ్యాంకుల నుండి అప్పు రాకుండా చేస్తుంది . రెవెన్యూ లోటు ఎపుడో 2015లోనే ఇవ్వాలి. ఇంతవరకు పూర్తిగా ఇవ్వలేదు. ఇంకెప్పుడు ఇస్తారు? దానికి బడ్జెట్లో కేటాయింపులు చూపించలేదు.  గట్టిగ అడిగితె బడ్జెట్ లో చూపకుండానే ఇచ్చే అవకాశం ఉందని బుకాయిస్తారు. ఆంధ్రా ఏవైనా అడిగితె నిబంధనలు,గాడిదగుడ్డ ని  చెబుతారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వేలకోట్లు గుమ్మరించడానికి మీకు నిబంధనలు అడ్డురావు. 

Actually To make best use of special package, the AP government has decided to pose more infrastructure projects for foreign funding. 
AP government  has been mulling to pose some of the projects  of Rs 65,000 crore worth Amaravati infrastructure projects to foreign banks which are offering loans at the interest rate of 1.5 per cent per annum. As the Centre will bear 90 per cent of the loan, the state government need not bother for the repayment.
చంద్రబాబు గారు ఎన్నో కలల తో ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం, పోలవరం కోసం,  కేంద్రాన్ని బతిమాలుకొంటూ,విదేశాలు పట్టితిరుగుతూ  కష్టపడు తుంటే అడ్డుపుల్లలు వేయడం, బిల్లులు సరిగా చూపలేదని వంకలు పెట్టడం, రాజకీయలబ్ధికోసం జగన్ చేసే  ఆరోపణలను  నమ్ముడం , జగన్&కో కి ఇంటర్వ్యూలు ఇవ్వడం , బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం,  పైపెచ్చు సొంత BJP పార్టీ వారితోనే తిట్టించడం ఇవన్నీ చేస్తున్నా చంద్రబాబు సహనంతో ఉంటూ కేంద్రంద్వారా వచ్చే అరకొర సాయం కూడా కష్టమై పోతుందనే భయంతో ఓపికపడతంటే  BJP వాళ్లకి అలుసుగా ఉంది"... ఇదీ మెజారిటీ  తెలుగుప్రజల అభిప్రాయం . 

The following is the excerpt from the central govt's announcement of "special package" to A.P. state in september-2016.

The Centre agreed to give Rs 7,336 crore to compensate revenue loss for 2015-16 and 2016-17 financial years.As part of special financial package, the Centre agreed to provide 30 per cent extra funding in all CAP (centrally aided projects) and EAP (externally aided projects) schemes from 2015 to 2020.
Money raised under EAP will have lower interest rates and also moratorium in the name of tax holiday starting from three to seven years. This will give the state government a major relief as the repayment starts only after 7 years.
the benefit would be coming in the CAP and EAP projects. As per the projections, for 2017-18, the state would get 4,139 crore, for 2018 19 it would be Rs 4,760 crore, for 2019-20 it will be Rs 5,475 crore and for 2020-21 Rs 6,296 crore. To make most of the CAP and EAP , the state government has proposed a 15 per cent annual increase in the funding to beat the inflation. As part of the package, the Centre agreed to bear the foreign exchange fluctuation on the foreign loans which is likely to benefit to the tune of about Rs 2,000 crore.
Under the special package, AP has been exempted from paying for foreign exchange fluctuations. 
AP has already submitted Rs 42,000 crore worth EAP schemes of which nearly Rs 28,000 crore worth project have been received in-principle clearance from the Centre.The major advantage for the state is that the funding under EAP and CAP would not come under the FRBM rules. Right now, The state is not in a position to raise additional loans from foreign financial institutions as the loan raising limit was fixed at 3 per cent of Gross State Domestic Product. The special package has resolved the issue in AP state's favour,"

  1. ప్రత్యేక సాయం కింద, రాష్ట్రానికి సుమారు 16500కోట్లను ,ఈ 5 ఏళ్లలో(2015-20) నాబార్డ్ ద్వారా  గ్రాంట్ (90%) రూపంలో ఇస్తే త్వరత్వరగా అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది . అంతేకాదు, FRBM పరిమితులను కూడా అతిక్రమించకుండా సాయపడుతుంది"అని చంద్రబాబు జైట్లీకి సూచించారు. 
  2. రెవెన్యూ లోటును త్వరగా భర్తీ చేయమని అడుగుతున్నారు. 3900 కోట్లు ఇచ్చారు. కానీ మాలెక్కల ప్రకారం ఇంకా 12500 కోట్లు ఇవ్వవలసిఉంది. కానీ కేంద్రం కేవలం 7500కోట్లు మాత్రమే ఇస్తామంటూ చెప్పి అదీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇది కూడా ఎపుడో 2015లోనే ఇవ్వవలసిఉంది. 
  3. రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలి.  
  4. అమరావతి నిర్మాణానికి నిధులివ్వాలి. 
  5.  నిధులను సకాలంలోఇచ్చి పోలవరం,హంద్రీనీవా తదితర సాగునీటి ప్రాజెక్ట్ లను ఇప్పటికే పూర్తి చేయవలసిఉంది. ఇంతవరకు అరకొరగానే ఇస్తున్నారు. 4 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకెప్పుడు ఇస్తారు?
  6. జాతీయ  సంస్థల నిర్మాణానికి నిధులను సరిగ్గా ఇచ్చి ఉంటె ఈ  పాటికి నిర్మాణాలు పూర్తై ఉండేవి . ఇప్పటికీ ప్రహరీ గోడలు కూడా కట్టలేదు . రాష్ట్రం ఇప్పటికే 15000 కోట్ల భూములను వాటికీ కేటాయించి ఉంది. 

కానీ కేంద్రం ఏమంటుంది ? నేడు -6-2-2018 రాజ్య సభ,లోక్ సభల్లో జైట్లీ ఏమని చెప్పాడు?

  1. నాబార్డ్ ద్వారా గ్రాంట్ రూపంలో నిధులిస్తే,రాష్ట్రానికి ద్రవ్యలోటు ఎక్కువై, రాష్ట్రానికి  అప్పులు తీసుకొనే అర్హత కోల్పోతుంది . అందుకే ,విదేశీ సంస్థలనుండి అప్పు తీసుకొండి . ఆ అప్పులో 90% కేంద్రమే చెల్లిస్తుంది"  అని జైట్లీ అంటున్నారు. 
  2. నిజానికి, ఆర్థికశాఖ నిబంధనల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు ఎలా ఇవ్వాలో వివరంగా లేదు. అయినా, ఆంధ్రాకి చట్టం ప్రకారం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాం . ఇప్పటికే 3900కోట్లు ఇచ్చాము. మిగతాది కూడా ఇవ్వడానికి ఆర్ధిక శాఖ కు పురమాయించాను. 
మిగతా ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పలేక పార్లమెంట్లో  నీళ్లు నమలడం మనం చూశాం .
సరిగ్గా ఎన్నికలకు ముందు , ప్రత్యేక హోదా లేదా   రైల్వే జోన్ ప్రకటిద్దామని మోడీ ఎత్తు గడ లా
కనబడుతుంది.   ? ! ఎన్నికలకు ముందో,తర్వాతో జగన్ ని గుప్పెట్లో పెట్టుకోవచ్చనే ఎత్తుగడలో మోడీ ఉన్నాడనడానికి ఇప్పటి పరిస్థితులే సాక్ష్యాలు. గెలిస్తే మళ్ళీ  పాటనాటకానికి తెరలేపుతారు. 

Monday 5 February 2018

Andhra Pradesh State Reorganisation, 2014

 చట్టప్రకారం చేయవలసిన పనులు కూడా చేయడం లేదు మోడీ ప్రభుత్వం అని ఆంధ్రుల ఆరోపణ. ఈ చట్టంలో ఏముందో ఒక్కసారి పరిశీలిద్దాం...
  • ఆదాయము,ఆస్తుల పంపకం : జనాభా నిష్పత్తిని ఆధారం చేసుకొని పంపకాలు చేయాలి. పంపకాలలో గొడవలొస్తే కాగ్ సహకారంతో పరిష్కరించి ఉత్తర్వుల ద్వారా  పరిష్కరించాలి తప్ప ఆలస్యం చేయకూడదు. ఏడాదిలోపే ఈ పంపకాలు పూర్తి చేయాలి. 
  • పోలీసువ్యవస్థ : గ్రే హౌండ్ మరియు ఆక్టోపస్ లాంటి శిక్షణా సంస్థలను 3ఏళ్లలో ఆంధ్రాలో స్థాపించాలి. 
  • Center must give Helping hand to A.P. state. సాయం : 
  1. తొట్టతొలి సంవత్సరంలో (2014-15)  ఉన్న లోటుబడ్జెట్ కి  సరిపడా నిధులివ్వాలి.  
  2. అలాగే కేంద్రం గ్రాంట్ రూపంలో ప్రతి ఏటా  సాయం అందించాలి. 
  3. పరిశ్రమలను ఆకర్షించడానికి అవసరమైన సాయాన్ని  అందించే రీతిలో కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని  ప్రత్యేకంగా చూడాలి. (special package). 
  4. మౌలిక సదుపాయాలను ఏర్పాటు  చేయాలి . విద్యా /  వైద్య / సాంకేతిక /  పరిశోధనా సంస్థలను 5ఏళ్లలో ఏర్పాటు చేయాలి . 
  5. రోడ్ ,రైల్ ,ఎయిర్ నెట్వర్క్  ని బాగా విస్తరించాలి. అంతేకాదు దుగరాజపట్నం ఓడరేవు, కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి. మూడుప్రధాన నగరాలలో మెట్రో సదుపాయం ఇవ్వాలి. వీటన్నింటికీ సరిపడా నిధులను కేంద్రం 5ఏళ్లలో అందివ్వాలి. 
  6. పోలవరం జాతీయప్రాజెక్ట్ గా ప్రకటించి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతిచ్చిన    హంద్రీ నీవా లాంటి మిగతా సాగునీటి ప్రాజెక్ట్ లన్నీ కేంద్రమే పూర్తి సాయం ఇవ్వాలి.   
పరిశీలించి చూడండి . ఇప్పటికే 4 ఏళ్ళు అయిపోయింది.  పైన ఉన్న చట్టంలోని ఏ విషయాన్ని కూడా మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు. కేవలం డ్రామా ఆడుతూ కాలం వృధా చేశారు . మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప,స్పెషల్ గా ఏమీ సాయం ఇవ్వడం లేదు. పైపెచ్చు ఎక్కడ ఎలక్షన్ లు ఉంటే ఆ రాష్ట్రానికి వేల కోట్లు గుమ్మరిస్తూ, తానూ ఒక సాదా రాజకీయనాయకుడి మాదిరి ప్రవర్తిస్తున్నారు. 
ఇలా  ఏడిపిస్తున్నారనే ,  వివిధ కేంద్ర పథకాలనుండి కొద్దికొద్దిగా నిధులను పోలవరానికి,ఇతర సాగునీటి ప్రాజెక్ట్ లకు మల్లించి తన తిప్పలు తాను పడుతుంది ఆంద్ర ప్రభుత్వం. 
కేంద్రంలోని మోడీ &కో , ఇంకా మాయమాటలతో మోసం చేదాం అని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. 
అఖిల పార్టీ మీటింగ్ పెట్టి గొడవలు చేస్తేనే కేంద్రం దారికొస్తుంది. 
సమయం మించిపోతుంది.. 
సరైన నిర్ణయం సరైన సమయంలో ఆచరణలో పెట్టాలి చంద్రబాబు. 

మోడీ పనికిమాలిన చాణక్యం - Modi's jumla

BJP వాళ్ళు ఇచ్చామని అంటారు.  
 ఏదో కొద్దిగా విదిల్చారు,ఇవ్వవలసింది చాలాఉంది,సమయం మించిపోతుంది అని  TDP వాళ్లంటారు. 
కానీ  ఆంధ్రులందరు ముక్తకంఠంతో ఒకటే మాట చెబుతున్నారు.   "మోడీ నమ్మించి ముంచేశాడు. ... "
మామూలుగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా కూడా ఇవ్వడం లేదు . పన్నులో రాష్ట్ర వాటా గా  ఇవ్వవలసిన నిధులను కూడా తొక్కి పట్టి నెమ్మదిగా ఇస్తున్నాడు. 
నిజానికి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకృత చట్టంలోని హామీ లన్నీ కూడా ఈ పాటికి పూర్తి  చేయకపోయినా కనీసం పట్టా లెక్కించాలి.  అదేమీ చేయడం లేదు . 
  • అడిగినవాటికి, ఇచ్చిన వాటికి పొంతన లేదని ఆంద్ర ప్రజలు,తెలుగుదేశం పార్టీవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విభజన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ఆర్థిక లోటు రూ.16,500 కోట్లు అయితే, కేంద్రం రూ.7,500 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించిందని, అందులోను ఇంకా రూ.3,382 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. 
  • పోలవరంకు ఏపీ రూ.7,.431 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు రూ.4,323 కోట్లు. 
  • నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఏపీ అడిగింది రూ.11వేల కోట్లు అయితే మంజూరు చేసింది రూ.2500 కోట్లు, అందులో విడుదల చేసింది రూ.1500 కోట్లు.
  • చట్టం ప్రకారం, సుమారు 15 జాతీయ విద్యా సంస్థలను  ఈ 5 ఏళ్లలో  పూర్తి చేయాలి. కనీసం ప్రహరీ గోడలు కూడా కట్టలేదు. 
  • చట్టం ప్రకారం రైల్వే జోన్ ఇవ్వాలి. అది ఖర్చుకి సంబంధంలేని చిన్న పాలసీ మార్పు. ఒరిస్సా అభ్యంతరం చెబుతుందనే సాకు చూపించి, అదీ నెరవేర్చలేదు . 
  •  చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయాలి. ఏదో కాస్త బిచ్చమ్ వేశారు. అదీ విజయవాడ,గుంటూరు నగరాలకే ఇచారుతప్ప పునాదులనుండి నిర్మించు కోవలసి ఉన్న రాజధానికి ఓ చిన్న మట్టిపాకేట్ తప్ప   కనీసం చిల్లిగవ్వకూడ ఇవ్వలేదు. 
మోడీ, మాటకారే తప్ప చేతల మనిషి కాదని క్రమేణా భారతీయులందరూ గ్రహిస్తున్నారు.  

Sunday 4 February 2018

పంటకు మద్దతు ధర - రైతుకి సంతోషధార

మన ఆంధ్రాలో ,  ఒక ఎకరాలో వరి పండించడానికి ,విత్తనాలు,ఎరువులు,పురుగుమందులు, మానవవనరుల కూలీ ,ట్రాక్టర్ ఖర్చులన్నీ కలిపి ఒకపంటకు సుమారు 30000/ అవుతుంది. ఎకరాకి సరాసరిగా 30బస్తాల దిగుబడి అనుకొందాం. అంటే, బస్తాకి అవుతున్నఖర్చు ,సుమారుగా 1000/-అవుతుంది. జైట్లీ  2018 బడ్జెట్ లో  ఏమిచెప్పారు? ఖర్చుకి 150శాతం ఎక్కువకలిపి మద్దతు ధరగా నిర్ణయించ
మన్నాడు . అంటే బస్తాకి 2500/- ధరగా  నిర్ణయించాలి .  
స్వామినాధన్  కమిటీ చెప్పినట్లు చేయాలంటే  75kg. వరి బస్తాకి  కనీస మద్దతు ధర రూ . 3000/- గా నిర్ణయించాలి . 
ఇలా చేయగలిగితే రైతు ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ ఇంత గా మద్దతు ధర పెంచాలంటే  మార్కెట్ డైనమిక్స్  దోహద పడాలి. మార్కెట్ ని శాసించాలంటే ,  ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆలా చేయడానికి ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదుగదా?!
మరి రైతేమి చేయాలి?
ఎకరా వరి వ్యవసాయానికి కేవలం రూ .  10000/- కంటే ఎక్కువ ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి. 
పాలు,వెన్న,గుడ్లు ,కూరల ను ఇంట్లోనే ఉత్పత్తి చేసుకోవాలి. 
పరిసరాలను,తాగునీటిని పరిశుభ్రంగా ఉంచుకొంటే సగం జబ్బులు రాకుండా కాపాడుకో వచ్చు. 
ఇవన్నీ నిజమవ్వాలంటే,అనుభజ్ఞులేమి చెప్పారో చూద్దాం . 
1. గో ఆధారిత  సేంద్రియ ,ప్రక్రుతి వ్యవసాయం చేపట్టాలి. కనీసం రెండు పాడిపశువులుండాలి. పెరట్లోనే హైడ్రోఫోనిక్స్ ద్వారా పశుగ్రాసం, కూరగాయలు  పెంచుకోవాలి. 
2. జీవాలు .. కనీసం రెండు గొర్రెలు ,10కోళ్లు పెంచుకోవాలి .
3.సమతుల్యమైన ఆహారాన్ని తీసుకొంటూ, ఆల్కహాల్,పొగత్రాగడం  లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.    అపుడే మనదేశానికి గ్రామ స్వరాజ్యం వచ్చినట్లు ...  

Related image 

Saturday 3 February 2018

ఇపుడు చంద్రబాబు ఏమి చేయాలి?

చంద్రబాబు నమ్ముకొన్న పార్టీ నట్టేట ముంచింది. ఆంధ్రావాళ్లకి మునిగిపోవడం అలవాటే! మొన్న కాంగ్రెస్, నేడు మోడీపార్టీ ముంచింది! బలయ్యేది ఎపుడూ కూడా ఆర్భాటం తప్ప ఆలోచనలేని ఆంధ్రులే! విద్యా,వ్యాపారాలు గట్రా బాగా చేస్తారు. కానీ కులాల పేరుతొ కాట్లాడుకోవటమే తప్ప, ఐకమత్యం అనేది లేదు. 
మోదీ ఆంధ్రాకు సాయం  చేసినా చేయకపోయినా  భాజ‌పాకి ఒరిగే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు అని మోదీపార్టీ అభిప్రాయం. ప్రాక్టిక‌ల్ గా ఆలోచించుకుంటే భాజ‌పాకి  కొత్తగా వచ్చే నష్టమేమీ  ఉండదు కాబ‌ట్టి, ఆంధ్రాపై ప్రత్యేక  అభిమానం ప్ర‌ద‌ర్శించాల్సిన రాజ‌కీయ అవ‌స‌రం వారికి లేదని మోదీపార్టీ లెక్క‌ గా కనబడుతుంది.  
         ఇపుడు,చంద్రబాబు పరిస్థితి డోలాయమానంగా ఉంది. పోల‌వ‌రం ప్రాజెక్టు, రాజ‌ధాని నిధులు, ప్రత్యేక  ప్యాకేజీ… ఇలాంటివ‌న్నీ కేంద్రం నుంచి రావాల్సిన‌వే. అన్నిటిక‌న్నా ముఖ్యంగా, నియోజ‌క వ‌ర్గాల సంఖ్య పెంపు అంశం కూడా కేంద్రం దగ్గర  ప‌రిశీల‌న‌లో ఉంది. రాజ‌కీయంగా, ఆర్థికంగా ఎలా ఆలోచించినా.. ఆంధ్ర స‌ర్కారుకు కేంద్రం అవ‌స‌రం చాలా ఉంది. ఎన్నిక‌ల‌కు ఇంకా దాదాపు ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. ఈ ద‌శ‌లో భాజ‌పాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం అనేది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఇబ్బంది క‌లిగించే రాజ‌కీయ నిర్ణ‌యంగా మారుతుందేమో అనేది చంద్ర‌బాబు అభిప్రాయంగా క‌నిపిస్తోంది. 
అటు రాష్ట్ర అభివృద్ధిని,ఇటు తన పార్టీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి చంద్రబాబుది.  
ఓ పక్క  మోడీ పార్టీ కి 3 అవకాశాలున్నాయి. జగన్ పార్టీతో, చంద్రబాబు పార్టీతో, జనసేనతో కలిసినా ,కలవక పోయినా  పెద్దగా ఒరిగేదేమీ లేదు,పోయేదీ లేదు. కాపోతే,  మూడూ కూడా మోడీ మాట విని పడివుండే పార్టీలు .  అంతేకాదు, ఒక్క చంద్రబాబు పార్టీతప్పించి, ఎన్నికలలో ఎన్ని పార్లమెంట్ సీట్లు కావాలంటే అన్నీ ఇచ్చేసే పార్టీలవి . ఎన్నికలైన తర్వాత మూడు ఆంధ్రాపార్టీలు కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చేవే గానీ ఎదురు తిరిగేవి కాదు. కాబట్టి,మోదీపార్టీకి ఎవరైనా ఒక్కటే!
గెలుపు ఓటములు పక్కనబెట్టి  తమ  మాటవినే పార్టీలవైపు చూస్తున్నారు మోదీపార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళతో కలిసి ఎన్నికలలో కనీసం 12 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవాలని,అవసరమైతే మొత్తం 25 సీట్ల మద్దతు పొందే  పధకం రచిస్తున్నాయి. 
ఏతావాతా  ఆంధ్రాకి  ఏమిచేసినా మోడీ పార్టీకి ఓట్లు పడవు. కాబట్టి, ఎన్నికలకు ముందో,ఆ తర్వాతో సీట్లు బేరం కుదుర్చుకొంటారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత  అవసరాన్ని బట్టి, అటు  జగన్ పార్టీ  ఇటు చంద్రబాబు పార్టీ పార్లమెంట్ సభ్యుల మద్దతును పొందినా ఆశ్చర్య పడవలసింది లేదు.కాబట్టి మోదీపార్టీకు చాయిస్ ఎక్కువ ఉంది.  చంద్రబాబుకి అంత వెసులుబాటు లేదు. 

చంద్రబాబు పార్టీ ,ఆచితూచి అడుగు వేయవలసిన సమయమిది. అలాగని నమ్మించి మోసం చేసిన మోడీ పార్టీని వదిలేయక పోతే ,ఆంధ్రాజనం చంద్రబాబు పై తిరగబడే పరిస్థితి.   
ఎలా జరగాలంటే ఆలా జరుగుతుందనే భావంతో,ఆంధ్రుల సెంటిమెంట్ ని గౌరవించి మోదీపార్టీతో తెగతెంపులు చేసుకొని ఎన్నికలకు సిద్ధపడటమే  పార్టీకి మంచిది.  
కేంద్రం,ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనివన్నీ అక్షరాలా అమలు చేయ వలసిందే! కొత్త ఆంధ్రరాష్ట్రంలో ఒక్క చంద్రబాబు గారికి కి తప్ప మరో నాయకుడెవ్వరికీ అలా అమలు జరిపించే పరిపాలనా అనుభవం
లేదు . అధికారం పై యావ తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అంకితభావం కూడా లేదు. అంతేకాదు, మోడీకి గానీ లేక రాబోయే ఏ పాలకులకైనా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసి,జాతీయ స్థాయిలో ఒక స్థాయిని కల్పించుకోలేకపోతె , రేపు ఆంధ్రాలో ఎన్నికలలో గెలిచినా , ఆ కేంద్రప్రభుత్వం లెక్క చేయదు.

అలాంటి కూటమిని నడిపించే స్థాయి కేవలం చంద్రబాబుగారి కే ఉంది. నిజానికి ఈ విధమైన కౌంటర్ గ్రూప్ లనేవి ప్రాంతీయ వాదానికి కొమ్ముకాసి,జాతీయ వాదానికి తూట్లు పొడుస్తాయి. కానీ అనాధగా ఉన్న రాష్ట్రాన్ని బతికించుకోవడానికి తప్పదు. ఉత్తరాది రాష్ట్రాల కు ఏ విధంగా నిధులు గుమ్మరిస్తున్నారో కనీసం ఆలా ఇచ్చినా ఆంధ్రాకి చాలు.
కాబట్టి, జాతీయస్థాయి పార్టీకి కౌంటర్ గ్రూప్ ని బలవత్తరం చేసుకొంటే తప్ప,ఫెడరల్ వ్యవస్థ బతికి బట్టకట్టే కాలంకాదు.
ఒక వేళ రేపు ఆంధ్రాలో చంద్రబాబుగారి పార్టీ కాక మరోపార్టీ గెలిచినా కేంద్రం తీరు ఇంతే ! ముందు, ఏదో సాయం చేస్తున్నట్లు నటిస్తారు తప్ప క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రయోజనం ఉండదు.
ఎన్నికలలో ఓటర్లు తమ చెప్పు చేతల్లో ఉండటానికి నాయకులు వారిని పూర్తిగా ఎదగనీయరు. అలాగే రాష్ట్రాలు తమ చెప్పుచేతల్లో ఉండటానికి,కేంద్రం, రాష్ట్రాలను పూర్తిగా బలపడనీయని కాలమిది.
 
రాష్ట్ర లాభాన్ని దృష్టిలో పెట్టుకొని ద్రవిడ పార్టీల లెక్క   జగన్,చంద్రబాబు కలిసి రాష్ట్ర విభజన హక్కులకోసం డిమాండ్ చేయాలి.  చంద్రబాబు,మోదీపార్టీతో తెగతెంపులు చేసుకొని  అన్నిపార్టీలను  కలుపుకొని కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. ఆలా పనిచేస్తేనే ఆంధ్రాకి లాభం తప్ప, లేకుంటే నష్టపోయేది ఆంధ్రరాష్ట్రప్రజలు,లాభపడేది ఉత్తరాది పార్టీలు. 
ప్రజలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లేయాలి. 

ఆంధ్రనాయకులారా! బిచ్చమెత్తడం ఇక ఆపండి! Don't Beg... Demand!

ప్యాకేజి , హోదా అనే మాటలు 60% ఓటర్లకు అర్ధం కావు . 
ప్యాకేజి , హోదా అంటే ఏమిటో , వాటి వలన వచ్ఛే లాభమేమిటో , వాటి మధ్య ఉన్న తేడా ఏమిటో , 
  మిగతా 35 శాతం ఓటర్లకు తెలియదు .  
గతవారం  ఆంద్ర ప్రదేశ్ లో  భిన్న వర్గాలు చేసిన సర్వే లో దాదాపుగా అరవై అయిదు నుంచి డబ్భై శాతంమంది "హోదా అంటే ఏమిటో తమకు స్పష్టత లేదని'' వ్యాఖ్యానించారు. హోదా కావాలని కోరేవారిని "దానివల్ల ఏమి వస్తుందో తెలుసా?'' అని ప్రశ్నిస్తే "తమకు తెలియదని'' వారు సమాధానం ఇచ్చారు. 
కేవలం మధ్యతరగతి వారిలో , అదీ నిరుద్యోగ యువత లోనే , ఆంధ్రుల ఆత్మ గౌరవం మంటగలిసి పోతుందనే  సెంటిమెంటల్ భావం, దానితో పాటు ఉద్యోగ అవకాశాలు పెంచే పరిశ్రమలు రావనే  అనుమానం , భయం  ఉన్నాయి .  దానికి ప్రధాన ముద్దాయి BJP, MODI    అని భిన్న ప్రతిపక్షాలు చెబుతున్న విషయాన్ని తిప్పికొట్టే సత్తా ఉన్నవాళ్లు BJP  లో  కనబడటం లేదు .
 చంద్రబాబు ని ఎవ్వరూ అనుమానించడం లేదు . ఎందుకంటే , ఆయన పడుతున్న  కష్టం
 అందరూ చూస్తున్నారు . ఈ సమయం లో ఆర్ధిక పరిజ్ఞాన మున్న వారు  సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను తెలియ చేస్తూ  భయాలను , అపోహలను పోగొట్ట వలసిన అవసరం ఉంది . 
                        కష్టాలలో ఉన్న రాష్ట్రానికి  హోదా , ప్రత్యేక ప్యాకేజి కంటే ముందు , కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయము తప్పనిసరి . పన్నుల్లో రాష్ట్ర వాటా ని త్వరగా కేటాయించాలన్నా ,  FRBM నిబంధనలను కొద్దిగా సడలించి రాష్ట్ర రుణ పరపతిని పెంచాలన్నా , విదేశీ రుణాలతో నెలకొల్పే ప్రాజెక్ట్ లకు గారంటీ  ఇవ్వాలన్నా , కేంద్రీయ సంస్థలను స్థాపన చేయాలన్నా , కేంద్ద్రంతో సయోధ్య తప్పనిసరి . కేంద్రాన్ని కాదని ఇవేమీ ముందుకు సాగవు . కాబట్టి కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయము , సయోధ్య అత్యంత అవసరం .  
  •  వెనుకబడిన ప్రాంతాలను గుర్తించాలి . సహజం గా మన రాష్ట్రం లో ఉన్న 13 జిల్లాలలో , రాయలసీమ 4 మరియు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని అందరికి తెలిసిందే . కాబట్టి ఈ జిల్లాలలో ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించి లాండ్ బాంక్ లు ఏర్పరచి ,పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించాలి . దీనికి ముందుగా రాష్ట్ర -కేంద్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి రావాలి .
  • పెట్టుబడి లో  25 నుండి 40 శాతం ప్రోత్సాహక సాయం ( enhanced investment allowance ) మరియు ఏడాదికి 30 శాతం చొప్పున తరుగుదల లెక్కింపు , మొదలైన ప్రోత్సాహకాలు పారిశ్రామికవేత్త లకు  కేంద్రం ఇవ్వాలి . అలాగే రాష్ట్ర ప్రభుత్వం  పరిశ్రమలకు మొదటి రెండేళ్లు 30 శాతం ఉచిత కరెంట్ ఇవ్వాలి . 
  •  పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ లో మూడు భాగాలు ఉన్నాయి . ఒకటి సాగునీటి ప్రాజెక్ట్ , తాగునీటి పధకం , జల విద్యుత్ ప్రాజెక్ట్ . మొత్తానికి కలిపి 2011 లెక్కల ప్రకారం 16వేల  కోట్లు  ఖర్చు అయ్యే ప్రాజెక్ట్  అని  కేంద్రం అంటుంది . దీనిలో విభజనకు ముందే సుమారు 5000 కోట్ల పనులు పూర్తయ్యాయి . కాబట్టి ఇంకా అవసరమయ్యే 11000 కోట్లలో సుమారు 8000 కోట్లు (సాగునీటి ప్రాజెక్ట్  కి మాత్రమే ) ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చ్చింది . కానీ ఇది సరి పోదు . ఎందుకంటే 2016 లెక్కల ప్రకారం  మూడు విభాగాల మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు అంచనా 26 వేల కోట్లు . దీంట్లో 5000 కోట్లు  విభజనకి ముందే ఖర్చు పెట్టేశారు . ఈ  విషయాన్ని దృష్టిలో పెట్టు కోవాలి . కాబట్టి 2014 ఏప్రిల్ నుండి మూడు విభాగాల తో కూడిన  మొత్తం ప్రాజెక్ట్ కి అయ్యే ఖర్చు మొత్తం  కేంద్రమే  భరించాలి . ప్రాజెక్ట్ లు ఆలస్యమైన కొద్దీ ఖర్చు పెరిగిపోతా ఉంటుంది . రాష్ట్రానికే నిర్మాణ బాధ్యత అప్పగించినా , ఆలస్యమైతే పెరిగే ఖర్చుని కూడా భర్తీ చేయాలన్న నిబంధన తప్పనిసరి గా ఉండాలి .అంతే కాదు ,రాష్ట్రం . గత 2 ఏళ్లలో పోలవరం పైన  సుమారు 4000 కోట్లు ఖర్చు పెట్టారు . కాబట్టి  ఆ డబ్బు కూడా కేంద్రం  రీ ఎంబర్స్ చేయాలి.  
  • 2014-15 ఆర్ధిక సంవత్సరం లో రెవెన్యూ లోటు 14000 కోట్లు అని కేంద్రమే ఒప్పుకొంది . ఇదంతా కేంద్రమే భరించాలి . కానీ ఇప్పటివరకు కేవలం 2000 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చ్చింది . మిగతా 12000 కోట్లు ఎప్పటి కిచ్ఛేను? కేంద్రం వెంటనే ఇవ్వాలి .
  • సంక్షేమ పథకాలైన రైతు ,చేనేత కార్మికుల , ద్వాక్రా గ్రూపుల కు రుణ మాఫీ , అలాగే చంద్రన్న కానుకలు మొదలైన వాటివలన ఇంతగా ఖర్చు పెట్టారని కేంద్రం గుర్రుగా ఉంది. 10 వ PRC  వలన నెల వారీ జీతాల బిల్లు 2100 కోట్ల నుండి అమాంతం 3400 కోట్లకు అనగా 1300 కోట్ల భారం ఏటా పడుతుంది . ఇంతగా రైతు ,చేనేత ,ద్వాక్రా ,ఉద్యోగుల సంక్షేమానికి పాటు బడటం వలన ఆదాయ వనరులు 12 శాతం పెరిగినా కూడా ఇంకా 14000 కోట్లు లోటు ఉంది .  

సంక్షేమం , అభివృద్ధి అనేది పాలకులకు రెండు కళ్ళ వంటివి . అందరినీ కలుపుకొని , అందరికీ సుఖశాంతులు అందిస్తూ (Inclusive growth) ముందుకు పోవలసిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గట్టిగా నమ్ముతున్నారు . అంతెందుకు, మొన్నటివరకు రైతురుణ మాఫీని విమర్శించిన మోడీ గారే గుజరాత్ , తదితర  BJP  పాలిత  రాష్ట్రాలలో  రైతులరుణ మాఫీ లేకాదు,  చంద్రబాబు గారికంటే ఎక్కువ హామీలు గుప్పించారు. 
  • కాబట్టి కేంద్రం, రాష్ట్రంలోని పరిస్థితులను గమనించి , వెంటనే రెవెన్యూ ( ఆదాయ ) లోటుని పూడ్చాలి. 2014-15  16079 కోట్లు . దీనిలో 2303 కోట్లు కేంద్రం ఇచ్చ్చింది . మిగతా 13776 కోట్లు వెంటనే  ఇవ్వాలి . 2015-16 పద్దు కింద 5000 కోట్లు ఇవ్వాలి .2016-17 పద్దు కింద 5000 కోట్లు ఇవ్వాలి . ఏది ఏమైనా ఏడాదికి సుమారు 5000 కోట్ల రెవెన్యూ ( ఆదాయ ) లోటు ఉంటుంది . కనీసం 10 ఏళ్ల పాటు కేంద్రమే ఈ లోటుని భర్తీ చేయాలి . 
  •  ఇంకో విషయాన్ని కూడా గమనించాలి . ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టడం మంచిది కాదు . కానీ , పేదలకు రెండు లక్షల ఇళ్లు  , పోలవరం ప్రాజెక్ట్ , కోర్ కాపిటల్ భవనాలు  వచ్ఛే 3 ఏళ్లలో పూర్తి చేయడానికి , ఆదాయానికి మించి ఖర్చు పెట్టక తప్పదు . 
  • పరిశ్రమలకు , వ్యవసాయ రుణాలకు రాయితీలు ఇవ్వాలి .
  • కనీసం వచ్ఛే ఐదు ఏళ్లలో 20000 కోట్లు రాజధాని కోర్ భవనాలకు , మౌలిక సదుపాయాలకు ఖర్చు అవుతుంది . 

దీనివల్లనే ఫిస్కల్ లోటు కూడా ఇబ్బడి ముబ్బడి గా పెరగక తప్పడం లేదు . 
ప్రస్తుతం , ప్రభుత్వం ఏటా సుమారు 15000 కోట్లు అప్పు తీసు కొంటుంది . నాబార్డ్, ప్రపంచబ్యాంక్,ఆసియన్ అభివృద్ధి బాంక్ లేకాదు, రాష్ట్రప్రజలనుండికూడా బాండ్ ల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకునే అవసరం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేపటి బడ్జెట్ లో ఆంధ్రాకి న్యాయం చేయాలి. 
అలాజరగని పక్షంలో మీనమేషాలు లెక్కించకుండా వెంటనే NDA  ప్రభుత్వం నుండి తప్పుకొని నిరసన ప్రకటించాలి. కావాలంటే బయటనుండి అంశాలవారీగా మద్దతు ప్రకటించుకోవచ్చు. 
ఆంధ్ర ప్రభుత్వానికి ,  జమిలి ఎన్నికలకు వెళ్ళవలసిన అవసరం లేదు . ఖర్చు ఎక్కువైనా ప్రభుత్వం పూర్తికాలం నిలబడి,పోలవరాన్ని పాక్షికం గానైనా పూర్తి చేసి సాగునీరు అందించే ఏర్పాటు, రాజధాని భవనాల నిర్మాణం పూర్తి చేసే ఏర్పాటు జరిగిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళవచ్చు. 

మోడీ పై ఉన్న వ్యతిరేకత దానితో కలిసివుండే పార్టీలపై పడటం ఖాయం. 
మోడీ కొన్నివిషయాలలో ముఖ్యంగా మంచి  విదేశీ పాలసీలు,అవినీతిరహితమైన  పాలన చేసినా , ప్రజాస్వామ్య విలువలను,నియమాలను తోసిరాజని ఒంటెత్తు పోకడలు పోవడం,పైపెచ్చు అటు హిందూ వాదులకు, ఇటు మైనారిటీలకు కూడా అసం తృప్తి కలిగించడం,రాష్ట్రాల మనోభావాలను  పట్టించుకోకపోవడం, నియంతమాదిరి గా కనిపించడం,  రాజకీయలబ్ది కోసం,తమిళనాడు సంక్షోభాన్ని అవకాశంగా మలచుకొని,అవినీతితో కుళ్లిపోయిన DMK వారిని కలవడం, 2 G కేసులను నీరుగార్చారని న్యాయస్థానమే ఆక్రోశించడం,గుజరాత్,బీహార్ ఎన్నికల సమయంలో మోడీ ప్రవర్తన, మెజారిటీ దక్షిణ భారతీయులకు రుచించడం లేదు. 

4 ఏళ్ళక్రితం  మోడీని ఎంతగానో ఆరాధించిన సినిమా నటులు, వివిధ వృత్తిలో ఉన్నవారే , నేడు మోడీ ని అసహ్యించు కొంటున్నారు. దీనికి కారణం ఆయన  తీసుకొన్న నిర్ణయాలను సరైన రీతిలో కమ్యూనికేట్ చేయలేకపోవడమే అనిపిస్తుంది. మన్ కి బాత్ లాంటి ప్రోగ్రాములు ఎన్ని చేసినా ఆయన మాటల్లో స్వచ్ఛత ,సమర్ధత కనబడుతుంది గానీ,క్షేత్రస్థాయిలో అస్సలేమీ కనబడటం లేదు. దీనితో ఆయన మాటల్లో విశ్వాసం తగ్గిపోతుంది.  పైపెచ్చు ఆయనకీ ఉన్న పరిజ్ఞానం పైన కూడా అనుమానం కలుగుతుంది. ఆయనలో పైకి కనబడే హుందాతనం , ఆచరణలో కనబడటం లేదు. 
 దేశాన్ని మార్చాలనే తపనను ఆయనలో చూసే ఓట్లు వేశారు. కానీ,కేవలం ఆయన పార్టీని మాత్రమే బలవత్తరం చేసుకొంటున్నారు తప్ప రాష్ట్రాల కు  సమాన భాగస్వామ్యం ఇచ్చే ఫెడరల్ స్ఫూర్తికి  తూట్లు పొడుస్తున్నారు. 
ఆంధ్రాలో కూడా అవినీతి కేసుల్లో కోర్టు విచారణలో  ఉన్నవారితో సంబంధాలు పెట్టుకోవడం ,రాజకీయ లబ్ది  కోసం విలువలను త్యజించడం లాంటి  చర్యలు మోడీ యొక్క  స్వచ్ఛత ను మకిలి పట్టించేశాయి. 
ఎన్నికలున్న రాష్ట్రాలకు లక్షలకోట్లు ఖరీదు చేసే హామీలు గుప్పించే మోడీ, ఆంద్ర రాష్ట్రానికి న్యాయంగా రావలసిన సౌకర్యాలను కూడా ప్రకటించకపోవడం, తెలుగు వారందరినీ కలచివేస్తుంది . 
మోడీ చేసేది.చూసేది దేశం మొత్తం అభివృద్ధి కావచ్చు,అలాగని ఆంధ్రుల మనోభావాలను,గాయాలను పట్టించుకోనపుడు, మిగతా దేశం గురించి ఆంధ్రులకెందుకు? ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ను సమానంగా చూసినప్పుడే ఆయనపై గౌరవం ఉంటుంది. అలాకాక,కేవలం రాజకీయలబ్ధినే పరమావధిగా చూస్తే , ప్రధానమంత్రైనా ఒక్కటే, ట్రంపైనా ఒక్కటే! గౌరవం కోల్పోతారు.  
చంద్రబాబు లేదా జగన్ లేదా పవన్ లాంటి వుత్సాహిక రాజకీయనాయకులెవరైనా, స్వలాభం కోసం, స్వరక్షణ కోసం 5కోట్ల ఆంధ్రుల సంక్షేమాన్ని ఫణంగా పెడితే  వారి గొయ్యి వారే తవ్వుకొన్నట్లే! 
ప్రాంతీయపార్టీ లేవైనా  మోడీతో గానీ,భవిష్యత్ లో  మోడీలాంటి కేంద్ర పాలకులతో గానీ  కలిసివుంటే ఆంధ్రాలో   పతనం  కాక తప్పదు.  దీనికి ఉదాహరణ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి !