Search This Blog

Friday 9 September 2016

ఆగండి .... ఒక్కసారి ఆలోచించండి

సమైఖ్యఆంధ్రా ఉద్యమం లో      కొన్ని వ్యూహాత్మక   తప్పిదాల వలన మనం హైదరాబాద్ ని కోల్పోయాం . ఎంతసేపూ రాష్ట్రం సమైక్యం గా ఉండాలనే  ఒకే  వాదంతోనే ముందుకు కదిలాం తప్ప , హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఉండాలనే డిమాండ్ ని అప్పుడే గట్టిగా కోరి యుంటే కేంద్రం ఇంకో రకం గా ఆలోచించి ,
 KCR   ని ఒప్పించి  విభజనకి ఒప్పుకునేది . 
 ప్రత్యేక హోదా ఒక్కటే కోరు కొంటూ , మళ్ళీ ఇప్పుడు అదే తప్పిదాన్ని చేస్తున్నా మేమో అనిపిస్తుంది .
ముందు మనకు ఏమి ఇస్తామన్నారో చూద్దాం .  
ఇప్పటి వరకు ప్రకటించిన  ప్యాకేజి సాయం కూడా తక్కువది ఏమీ కాదు . 

  •  ముఖ్యం గా పోలవరం ప్రాజెక్ట్ విషయం లో ఇఛ్చిన హామీ ,  రెవెన్యూ   లోటు ని భర్తీ చేస్తామనే హామీ రెండూ కూడా  రాష్ట్రానికి మేలు చేసేవే .
  •  ప్రత్యేక హోదాకూడా ఇస్తే బాగుంటుంది . కానీ 5 ఏళ్ల  పాటు ఇచ్ఛే హోదా వలన ఎంత లబ్ది చేకూరు తుందో , అంతే లాభాన్ని రాష్ట్రానికి ఇచ్ఛేవిదేశీ రుణ ప్రాజెక్టుల(ఈఏపీ) కింద మనం ఎంత తెచ్చుకొంటే అంత ఇవ్వడానికి కూడా కేంద్రం అంగీకరించింది.
  •  పరిశ్రమలకి కలిగే పన్ను రాయితీలను పూరించడానికి పారిశ్రామిక అభివృద్ధి నిధి పేరిట కేంద్రం  ఇస్తామని చెబుతుంది .ఇంతవరకు బాగానే ఉంది .  ఈ హామీలకు చట్ట బద్ధత కావాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు . 


 సామాన్యులకు ఆర్ధిక విషయాలు  త్వరగా అర్ధం కావు . అపోహలు కలిగించి  రెచ్చ్చగొట్టి
పబ్బం గడుపు కోవడానికి రాజకీయ పార్టీలు కాచు కొనే ఉంటాయి . కాబట్టి , ఈ  సమయం లో కొంత
 సంయమనం అవసరం .
ముఖ్యమంత్రి కి ఉన్న నిబద్దత ని ప్రశ్నించ దానికి ప్రస్తుత రాజకీయ నాయకులు ఎవ్వరూ సరిపోరు .
ఏది ఎప్పుడు ఎలా చేసి రాబట్టు కోవాలో ముఖ్యమంత్రికి తెలిసినట్లు ఎవ్వరికీ తెలియదు .
మనలో ఉన్న భయాలను ,అపోహలను రెచ్ఛ్ గొట్టడానికి నాయకులకు ఇది కలిసోచ్చ్చిన  సమయం .
ప్రత్యేక హోదా డిమాండ్ చేయకూడదని నేను చెప్పబోవడం లేదు .
కనీసం మనకు  ఇస్తానన్న ప్రత్యేక సాయం లో ఏమి చెప్పారో చూసి , ఇంకా ఏమి చేయాలో కూడా ఈ నాయకులు  చెబితే బాగుంటుంది . నిర్మాణాత్మకం గా ప్రవర్తించ వలసిన సమయం ఇది .
మనకి ప్రత్యేక హోదా ,ప్రత్యేక పాకేజీ రెండూ అవసరమే !

No comments:

Post a Comment