Search This Blog

Friday 31 January 2014

తెలుగు వాడంటే అలుసు . తెలుగు ప్రజల శాసన సభ అంటే బేఖాతర్ .

ఒక ఫెడరల్ ప్రభుత్వం,కొంత మంది ప్రజల ఆకాంక్షను గుర్తించి వారికి అనుగుణం గా  రాజ్యాంగ ము లోని 3 వ ఆర్టికల్ ఇచ్చిన అధికారం ద్వారా ,మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకం గా ,ఆ రాష్ట్ర  చట్ట సభ తీర్మానానికి వ్యతి  రేకం గా  రాష్ట్రాన్ని చీల్చడం అనేది చర్చించ వలసిన  చిక్కు ముడే .
జరిగింది ఏ మిటి ?
పా ర్లమెంటులో ప్రవేశపెట్టబోయే విభజన బిల్లులో, అసెంబ్లీకి పంపించిన బిల్లు కంటే, అదనంగా మూడు సప్లిమెంటరీ బిల్లులు, ఒక రహస్య బిల్లు ఉన్నాయి. వాటి గురించి గానీ లేక లక్ష్యాలు, ఆర్థిక విషయాలకు సంబంధించి శాసనసభ్యులు అడిగిన సమాచారాన్ని గానీ కేంద్రం ఇవ్వలేదు. 'ఆ సమాచారాన్ని మీకు ఇచ్చేది లేదు, మీకు పంపించిన బిల్లులో ఉన్న విషయాలను మాత్రం చర్చించి అభిప్రాయం చెప్పండి. అంతే' -ఇదీ స్థూలంగా కేంద్ర హోం శాఖ ద్వారా అసెంబ్లీకి అందిన హుకుం.
 అసలు ఒక అసెంబ్లీని ఆదేశించగల అధికారం కేంద్రానికి ఉందా? 
సమాచారాన్ని దాచిపెట్టి, అతి తక్కువ సమాచారం గల ముసాయిదా బిల్లుగా రాష్ట్ర అసెంబ్లీకి పంపించడం న్యాయసమ్మతమేనా?
పార్లమెంటుకు ఇవ్వబోయే విభజన బిల్లునే అసెంబ్లీకి ఎందుకివ్వరు ?
అంటే శాసన సభలో బిల్లు పై చర్చించడం కేంద్రానికి ఇష్టం లేదా ? 
కోర్టుతీర్పుల్లోనూ, రాజ్యాంగంలోనూ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లు, ముందుగా అసెంబ్లీలో పెట్టే బిల్లు ఒకటికానవసరం లేదు అని చెప్పలేదు. రెండు బిల్లులకి సారూప్యం లేనప్పుడు రాష్ట్రపతి 'నేను ఈ బిల్లుని ఫలానా రాష్ట్ర అసెంబ్లీకి పంపించాను, వారి అభిప్రాయం ఇది' అని పార్లమెంటుకి ఎలా తెలుపగలరు? ఎందుకంటే పార్లమెంటులో వుండబోయే బిల్లులో ఇప్పుడు అసెంబ్లీకి పంపించిన బిల్లులో లేని భాగాలు చాలా వున్నాయి అని సాక్షాత్తు కేంద్రం హోంశాఖ కార్యదర్శి ద్వారా చెప్తుంటే ఇక ఈ బిల్లుకి సార్థకత ఏమిటి? ఏ రాష్ట్రమైతే విడిపోతోందో ఆ రాష్ట్రానికి ముందుగా అసెంబ్లీ అభిప్రాయం కోసం విభజన బిల్లు పంపించాలి అని రాజ్యాంగంలో స్పష్టంగా వుంది.
బిల్లుని పార్లమెంట్ లో పెట్టే ముందు ,ఆ బిల్లులో మార్పులు చేసినా కూడా తిరిగి అసెంబ్లీకి పంపనవసరం లేదు అని అధికరణ 3లో చెప్పినప్పుడు తమ అభిప్రాయం చెప్పే ముందు పూర్తి వివరాలతో కూడిన బిల్లు కావాలి అని అసెంబ్లీ అడగడం తప్పు ఎలా అవుతుంది? 
రెండంచెల వ్యవస్థ ఉన్నప్పుడు పార్లమెంటుకు ఎంత సార్వభౌమత్వం ఉన్నదో, రాష్ట్రాలకూ రాష్ట్ర స్థాయిలో అంత సార్వభౌమత్వం వుండాలి కదా? ప్రజలకు, రాష్ట్రానికి సంబంధించిన విభజన విషయాలు చర్చించేటప్పుడు పార్లమెంటు సభ్యులకు తెలుపగలిగే విషయాలు, అదే వియాన్ని చర్చించేటప్పుడు అసెంబ్లీ సభ్యులకు తెలియకూడదు/తెలియజేయనవసరం లేదు అని కేంద్రం నిర్ణయించడం, అసెంబ్లీని, దాన్ని ఎన్నుకొన్న ప్రజలని కించపరచడమే అవుతుంది. విభజన బిల్లు చర్చించే క్రమంలో అసెంబ్లీకి తగిన వివరాలు అందించే విషయంలో కేంద్ర హోం శాఖ అనుసరిస్తున్న వైఖరి ఖచ్చితంగా రాజ్యాంగపరంగా అసెంబ్లీకి ఆపాదించిన అధికారాలను ప్రశ్నించే విధంగా వుంది. ఇది అరాచకం . దేశ సమగ్రతకు ప్రమాదం . 

Tuesday 28 January 2014

ఓం హూమ్ హనుమతే నమః

శంకరాంశతో  కుశంకలు తీర్చి
అంతరాళమున  ఆదిత్యుని భుజించి        
సంతసమ్ముగ్గా రాముని భజించి
సంజీవి తెచ్చి లక్ష్మణు బతికించి -ఓం హూమ్ హనుమతే నమః

రామ ముద్రను పట్టి జలధి లంఘించి
మైనాకుతో భాషించి సురసను ఏమార్చి
లంక లో అడుగెట్టి  లంకిణిని పరిమార్చి --- ఓం హూమ్ హనుమతే నమః

కడలి దాటి సీతమ్మ ను కాంచి
శ్రీ రామ రామ అనుచు సీతమ్మకు సంతసము కూర్చి
రాకాసుల  మదమణచి లంకను కాల్చి
రామ నామ మహిమను రావణుకు బోధించి - ఓం హూమ్ హనుమతే నమః

కనుగొంటి కనుగొంటి సీతమ్మ నంటూ రాముని ముదమార్చి
రామ కళను శ్రీరాముని కనుల  కాంచి
వాయు పుత్రా నీకు వందనం
వనచర పండితా నీకు వందనం
వాలి గర్వ భంగీ నీకు వందనం - ఓం హూమ్ హనుమతే నమః

అంజనాసుతునిగా  రామాంజలి ఘట్టి
సుగ్రీవు మంత్రిగా రామ స్నేహ వారధి కట్టి
వనచర శాంతి స్థాపకా,  జగజెట్టీ
ముల్లోకమ్ముల లేరు నీకు సరి సాటి - ఓం హూమ్ హనుమతే నమః

విద్యార్ధులలో ఆధ్యాత్మికత ని ఎలా పెంపొంది మ్చాలి ?

అధః ఆత్మికత -అనగా ఆత్మకి అనుగుణ్యం గా జీవనం సాగించడం . అంటే ఆత్మగత మైన ప్రవర్తన .
మనం సాధారణం గా దేహ, ఇంద్రియ, చిత్తానికి అనుగుణం గా నడుస్తాం .
వ్యక్తిత్వం అనగా వ్యక్తీయొక్క తత్త్వం .
ఆ వ్యక్తిత్వం దేహ గతానికే పరిమిత మవ్వక , ఆత్మ గత మవ్వడ  మే ఆధ్యాత్మికత.

ఆత్మ అంటే ఏమిటి ? 
అది ఒక స్థితా ? లేక శక్తి ప్రవాహమా ? బిందువా  - తరంగమా ? విద్యా -అవిద్యా ? ప్రజ్ఞా - మాయా ?
ఆత్మ ఒక అఖండ శక్తి . తరంగాలు లేని ,స్పందనలు లేని సమ స్థితి.
 అది ప్రశాంత మానసిక స్థితి కన్నా వే రైనది . సంతోష చిత్తం కంటే అద్భుత మైనది .
ఆత్మ అంటే ఇది కాదు ,అది కాదు ;ఇలా ఉండదు ,అలా ఉండదు  -అని చెప్పు కోవడం తప్ప ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్ప లేమని ఋషి వాక్యం .
ఆత్మ స్థితి ఇలా ఉంటుందని చెప్పడానికి మనలోని జ్ఞానేంద్రియాలు ,మనస్సు సరిపోవు .
ఆ  స్థితిని అవగతం చేసుకోవడానికి మనమూ ఆ స్థితి కి వెళ్ళ వలసిందే .
ఆత్మ స్థితికి చేసే ఆ  ప్ర యాణమే   ఆధ్యాత్మికత .
 ఆ ప్రయాణానికి  దోహదం చేసే అలవాట్లే సనాతన సంప్రదాయం.

తల్లి తండ్రి  గురువుని పూజించు . 
వినయం,సహనం,క్షమా,సౌశీల్యం ,శుచి శుభ్రత ,ప్రక్రుతి రక్షణ ,నిస్వార్ధ సేవ, ప్రేమ - నిత్య జీవనం లో పాటించు.
సోమరితనం ,ఏమరుపాటు , కోపం ,అత్యాశ ,అసూయ ,అహంకారం  వదిలించు . . ---  విలువలతో కూడిన విద్య అంటే ఇదే . ఈ విద్యే ఆధ్యాత్మిక సాధన.  

Monday 27 January 2014

సర్ప దోషం .

 వివాహం ,సంతానం ,సంపద మొదలగు విషయాలలో సర్ప దోషం  అనే విషయం ,ఒక తీవ్ర మైన సమస్య గా చూస్తున్నాం .
అసలు సర్పం అనగా అర్ధం ఏమిటి ?
ఉరకలెత్తుతున్న ఒక వలయాకార శక్తి . 
మనస్సు కూడా ఒక శక్తి ప్రవాహమే కదా . 
అలాంటి శక్తి మన మనస్సుని అతలాకుతలం చేస్తూ ప్ర శాం తతను చెడ గొట్టే సూచన ను సర్ప దోషం అంటాం . 
అలాగే , మన నాడులలో  ఎంత చిన్న శక్తి ప్రసరణా  లోప మైనా, సర్ప దోషం ఉన్న వారికి,వెంటనే ఫలితం కనిపిస్తుంది .
అంటే దోషం ఉన్న వారు శక్తి ప్రవాహం లోని ఇబ్బందులకు త్వరగా స్పందిస్తారు .

దీనిని ఎలా గుర్తిస్తాం ? 
లగ్నాత్ , రా హు,కేతువులు 1,2,5,7,8 రాశులలో ఉన్నప్పుడు జీవితం లో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది . అన్నీ ఉన్నా ఏదో వెలితిగా ఉంటుంది . . 
దీనికి నివారణ , అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకోవడమే .కోరిక,కోపం,అత్యాశ ని బాగా తగ్గించు కోవాలి. 
పుట్టలో పాలు,నాగ ప్రతిమల ప్రతిష్ట ,చెట్ల పెంపకం ,సుబ్రమణ్య ఆరాధన -మొదలగు పరిహారాలు అన్నీ మనలోని అహంకారాన్ని తగ్గించి భగవద్ శరణాగతి ని పెంచి అరిషడ్వర్గాలను తగ్గించేవే . 

మన నాడులలో ముఖ్యం గా సూర్య చంద్ర నాడులలో శక్తి ప్రసారం సమం గా జరిగే విధం గా ప్రాణాయామం చేయాలి . ధ్యానం ,దానం ,చేయాలి . 
పరిసరాలను శుభ్రం చేయాలి . 
పచ్చని చెట్లను పెంచాలి . 

అంటే ,శరీరం లోని శక్తిని ప్రాణాయామం ద్వారా ,
భూమి చుట్టూ ఉన్న శక్తిని పరిసరాల శుభ్రత ద్వారా  ,
కాస్మిక్ శక్తిని శరణాగతి ద్వారా ------  సమతుల్యత లో ఉంచే విధం గా మన చర్యలు ఉండాలి .

అందరూ  గుర్తు పెట్టు కోవలసిన విషయం . - 
జాతకం లోని గ్రహాల అమరిక మన కర్మను సూచించే వే గానీ ,ఆ గ్రహాల వలన ఫలితం రాదు .
మన ప్రారబ్ద కర్మ వలనే ఫలితాలు వస్తాయి .
దోష పరిహార పద్దతుల ద్వారా మన మనస్సుని శక్తి వంతం చేసుకొని దుష్ఫలితాల తీవ్రతను గణ నీయం గా తగ్గించు కోవచ్చని ఋషి  వాక్యం . 

Thursday 23 January 2014

స్వ ధర్మ సాధనే సనాతన భారత ధర్మం .

స్వ ధర్మం అంటే ఏ మిటి ?
స్వ అనగా  నేను . నేను అంటే  ఏమిటి ? అది ఒక వస్తువా ? శ క్తి శ కలమా (speckle of energy) ?
 పరమ చైతన్యం (cosmic consciousness)లో ని ఒక చిన్ని భాగమే 'నేను ' (spirit)అని వేదాంతులు వారి అనుభవం తో చెప్పారు .
ధర్మం అనగా అర్ధం ఏమిటి ?
బాధ్యత . కర్తవ్యమ్ . నడత.  ప్రవర్తన .
అనగా కర్తను వ్యయం కాకుండా చేసేది.
  అలాగే  కర్త అవ్యయం గా, నిరంతరం గా చేయ వలసిన విధి .
ఆ  విధం గా నడచు  కోవడమే  ధర్మం చర .

"నేను ' అనే దానికి ఉన్న ధర్మాలు ఏమిటి ? 
 పరమ చైతన్యం నకు ఏ వైతే ధర్మాలున్టాయో అవే  ' నేను ' కి కూడా ఉంటాయి .
అమరత్వం ,అఖండత్వం ,అనంతత్వం , ఇవీ  పరమ చైతన్యం లక్షణాలు .

స్వ ధర్మ ఆచరణ అంటే  యీ  లక్షణాల ను సాధించడ మే . అనగా , కొత్తగా పొందడం కాదు . ఉన్న దానినే ఆవిష్కరించు కోవడం .
ఎలా సాధించాలి ? 
జ్ఞాన విచారణ ద్వారా . త్రికర ణ ము లలో నిత్యా అనిత్య వివేచన . సత్యా అసత్య వివేచన, సుఖ దుఃఖ వివేచన అమలు చెయడ మే  జ్ఞాన విచారణ.
త్రికరణము లనగా ఏవి ? 
            మనో వాక్ కాయ కర్మలు 
1.  మనస్సు అనగా ఆలోచన ,సంకల్ప వికల్పాలు;
2. వాక్కు అనగా మాట , మంత్రం;
3. ఆచరణ అనగా చేసే పనులు.

జ్ఞానం ఎలా వస్తుంది ?
సద్గురు సేవ , సత్ గ్రంధ  పటనం ,  సత్సంగం ,సద్విచారణ  నిరంతర ముగా  చేయడం ద్వారా .

సరే జ్ఞానం అంటే ఏమిటో తెలిసింది . కానీ జ్ఞానాన్ని అనుభవం లోకి తెచ్చుకొని ఎలా నిలుపుకోవాలి ?
యోగ సాధన ద్వారా .
                                    అంటే ఆసన ప్రాణా యామా లా ?
అవొక్కటే  కాదు . మనకున్న పంచ కోశాలను శు ద్ది చేసు కొనే క్రియలు అన్నింటినీ అభ్యాసం చేయాలి .
అలాగే మనకున్న గుణ కర్మ వాసనా తత్వాన్ని బట్టి భక్తీ ,కర్మ ,జ్ఞాన మార్గ పద్దతులను నిరంతరం అభ్యసిస్తూ ,పరబ్రహ్మ  పై సంపూర్ణ శ్రద్ద ,విశ్వాసం ఉండాలి .
సాధన సంపూర్ణత కు కు ఈ భౌతిక ప్రపంచ వ్యవ హారా ల పై వైరాగ్యం పునాదిగా  ఉండాలి.
వైరాగ్యం లేని వివేకం , వివేకం లేని వైరాగ్యం పనికి రావు .

వైరాగ్యం అంటే ఏమిటి ? 
కర్మ పై కాదు , కర్మ ఫలం పై ఎలాంటి మోజూ లేక పోవడం .
కర్మ వలన కలిగే సుఖ దుఖాలను సమానం గా అనుభూతి చెందడం .
దీన్నే సమత్వం అనికూ డ  అంటారు .

మనిషి కూడా జంతు వే కదా . కాపోతే గుంపు గా మసి లే సంఘ జీవి . ఇన్ని సాధనలు చేయ వలసిన అవసరం ఏముంది ? 
అన్ని జంతువుల వలె మానవుడు కూడా ఆహార,నిద్ర,మైధునాలకు బానిస . కానీ మనిషిలో చైతన్యం ,దాని వలన బుద్ధి బాగా అభివృద్ధి పొంది ఉన్నాయి . బుద్ధి అనగా వివేచనా శక్తి . ఊహా శక్తి ,తార్కిక శక్తి ,జ్ఞాపక శక్తి ,విచక్షణ శక్తి , బాగా అభివృద్ధి పొంది ఉన్నాయి .దీనినే free will అంటారు .
ఇంద్రియాలకు,పరిసరాలకు ,సహ జాతాలకు ,మనస్సుకి - అనగా భౌతిక శ రీ రానికి ,భౌతిక విషయాలకు లొంగి అనుగుణం గ నడచు కోవడా న్ని జంతు వర్తనం అంటారు . అనగా దీనినే (Destiny) విధి అని అంటాము .
బుద్ధిని  విని యోగించ లేక విధికి బానిసగా బతకడా న్ని జంతు జీవనం లేదా రాక్షస విధానం అని అంటాము .

బుద్దిని సద్విని యోగం చేసుకొని తను ఒక్కడే  సుఖం గా ఉండటం స్వార్ధ పర జీవనం .ఇది అధమం .
బుద్ధిని  విని యోగింఛి తనతో పా టు పది మంది ని  శాంతం గా ఉంచ డం  మానవత్వం.
 బుద్దిని  స్వ ధర్మా చరణ కు అంకితం చేయడం దైవత్వం .

పర ధర్మం అంటే ఏ మిటి ?
భౌతిక ప్రపంచ వ్యవ హారా ల పై సంగత్వం ,మోహత్వాన్ని పర ధర్మం అంటారు .
స్వ ధర్మ సాధనే సనాతన భారత ధర్మం . 

Friday 10 January 2014

వైకుంట ఏకాదశి పర్వ దినం .

ఓం నమో నారాయణాయ ... 
భారతీయ సనాతన ధర్మ ధారలో ముఖ్యమైన తిధి ఏకాదశి . అందునా ధనుర్మాసం లో వచ్చే ఏకాదశి ని ఉత్తర ద్వార దర్శిని గా ,ఆధ్యాత్మిక  సాధన లో చివరి మెట్టు ఐన విష్ణు పదాన్ని చేరడానికి సరైన సమయం  గా చెప్పు కోవాలి .
  సూర్య ,  చంద్ర గమనం ఆధారం గా  కాలాన్ని విభజించి , మనిషిని అతి సున్నితం గా ప్రభావితం చేసే  --- భూ వాతా వరణం , పీడనం ,ఉష్ణోగ్రత , భూ ఐయస్కాంత  శక్తి  , అలాగే సముద్రాలు ,ఓజోన్ పోర , మనిషి మానసం ,బుద్ధి ,కణాలలో క్రియలు,రక్త ప్రవాహం , క్రోమోజోమ్ ల విభజన , ప్రాణ శక్తి , శక్తి చక్రాలు ,ఇడా - పింగళ - సుషుమ్న ప్రవాహాలు ---- ఏ ఏ సమయం లో  ఇవన్నీ ఎలా ప్రభావితం చెందుతాయో తెలుసుకొని , సామాన్యులు ఆ యా సమయాలలో ఏ విధం గా ప్రవర్తిస్తే ఆరోగ్యం ,ఆధ్యాత్మికత వృద్ది పొందు తాయో  అవగాహన చేసుకొని , పండుగలు , నోములు ,వ్రతాల రూపంలో మనకు ఆచారాలు ఏర్పరిచారు .

ఈ రోజు మనలోని సుషుమ్నా ప్రవాహం ఉత్తేజిత మయ్యె సమయం .ఇదే  సమయం లో మనం చేయ వలసిన  ప్రాణా యామం ,మంత్రం జపం, ధ్యానం ఇవన్నీ చక్కగా జరగా లంటే కడుపు ఖాళీగా ఉండాలి . ఈ  క్రియనే ఉపవాసం అని ఋషులు చెప్పారు .

సంవత్సరం లో వచ్చే 24 ఏకాదశి రోజుల్లో కూడా సుషుమ్నా ప్రవాహం ఉత్తేజిత మవుతుంది . కానీ ,ఈ వైకుంట ఏకాదశి నాడు  సుషుమ్నా ప్రవాహం ఉత్తేజిత మవ్వడ మే కాదు , దాని ప్రవాహ దిశ ఉత్తర మార్గం , అనగా సహస్రారం వైపు పరుగు తీస్తుంది . అంతే కాదు , ఈ రోజు సుషుమ్నా మార్గం ముక్కోటి శక్తుల సంచయం గా మారే రోజు . కాబట్టి ప్రతి మనిషీ  ఈ అవకాశాన్ని వృధా పోనీయక , శరణా గతి తో ,ఎలాంటి అహమూ లేకుండా , నిరంతరం భగ వ న్నామ స్మరణ చేస్తే ,   సుషుమ్నా ప్రవాహం అత్యంత ఉధృత మై సహస్రారం వైపు ఉరుకుతూ సాగే క్రమం లో మనలోని శక్తి చక్రాలు శుభ్ర పడి చెడు కర్మ వాసనలు అన్నీ భస్మ మై మన కారణ శరీరం పునీత మవ్ తుంది .
భక్తి  ,కర్మ ,రాజ యోగులు అందరూ చివరికి జ్ఞానం పొంద వల సిందే . జ్ఞానమే మోక్షం .
మనస్సు,చిత్తం, అహంకారం పూర్తిగా అధిగమించి నప్పుడే సాధకులు జ్ఞానాన్ని పొందటం అనేది జరుగుతుంది . అలా జరిగే అవకాసం ఎక్కువగా ఉన్న సమయ మే ఏకాదశి.

మానవులు  వ్యవహారక మైన సులువు కోసం సూర్య చంద్రుల ఉదయ అస్తమానాలను , అవి ఆకాశం లో తిరిగే క్రమాన్ని విభజించి వాటికి గంటలు, నిమిషాలు ,సెకన్ లు గా పిలుచు కొంటున్నారు .
కాలమానం మనిషి అలవాటు చేసుకొన్న లెక్క.
మనస్సు ఉన్నంత సేపే కా లం లె క్కలు ఉంటాయి .

సూర్య మానం ప్రకారం ,మార్గ శీర్షం  లేదా పౌష్య మాసం లో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశి ని వైకుంట లేదా ముక్కోటి ఏకాదశి గా చెబుతాము .
సూర్య గమనాన్ని ,నక్షత్ర ముల  ను బట్టి సూర్య మానం ( 27  నక్షత్ర ము లు + సూర్యుడు ).
చంద్రుని హెచ్చు తగ్గు లను బట్టి ,(వీటికే 15 తిదులని పేరు ) చంద్ర మానం .

మన దైనందిన జీవితం లో జరుపు కొనే శుభ కార్యాలకు శుక్ల పక్షం మంచిది .
భగవదా రాధనకు ,హోమ ,వ్రత , నోము , యజ్ఞ క్రతువులకు కృష్ణ పక్షం మంచిది .

అందరూ  గుర్తుంచు కోండి . మీ పిల్లలకి చెప్పడం మరవకండి . 
 - పంచ కోశ శుద్దీ కరణ, తద్వారా  నిరంతర  శాంతి ,ఆనందం --- ఇదే  సనాతన భారత సంప్రదాయం -
 ప్రతి పండుగా  పంచ కోశ   పునీత    పర్వ దినమే .

శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధన - సం పదా |
శ త్రు- బు ద్ధి-వినాశాయ దీ ప- జ్యోతిర్ -నమో స్తుతే  ||

Tuesday 7 January 2014

Art of Cleaning...

మనకున్న పంచ కోశాలను శుద్ది చేసు కోవడానికి ఋషులు ఎన్నో ఉపాయాలు చెప్పారు . పైకి కనపడే శరీరం ఒక్కటే కాక,మన మనస్సు ,మనలోని జీవ శక్తి,బుద్ది ,అహంకారం,అలాగే మనలో ఉండే అరిషడ్వర్గాలు,వాత-కఫ -పిత్త  అనే 3 దోషాలు , సాత్విక- రాజసిక -తామసికం అనే 3 గుణాలు ,మన పుట్టుక కి కారణ మైన కారణ శరీరం - ఇలా ఇవన్నీ కూడ శుద్ది చేయ పడి నప్పుడే ఆత్మ అవగత మవ్వు తుంది .

దేహ శుద్ది కి సాత్విక ఆహారం,ఉపవాసం,స్వచ్చమైన నీరు,గాలి ,వ్యాయామం ,స్నానం ,సూర్య నమస్కారాలు
భావ శుద్దికి కర్తృత్వ భావం లేని అహంకార రహిత పూజలు,భగవన్నామ సంకీర్తనలు ,హోమాలు ,
మానస శుద్దికి వైరాగ్యం ,మంత్ర జపం,కర్మ యోగ సాధన, ఏకాగ్రత ,ధ్యానం సాధన
ప్రాణ శుద్దికి ప్రాణాయామం ,
మనలోని శక్తి ప్రవాహం , చక్రాల శుద్దికి , మంత్రం జపం , క్రిస్టల్స్ మరియు రాళ్ళు ,అలాగే అనేక మైన పద్దతుల ద్వారా శక్తి చక్రాలను చైతన్య పరిచి సమతుల్యత లో ఉంచడం ,
కారణ శరీర శుద్దికి ధ్యానం , సమాధి , స్థిత ప్రజ్ఞత అలవరచు కోవడం
అహంకార శుద్దికి వినయం,భక్తీ సాధన ,
బుద్ది శుద్దికి వివేకం ,జ్ఞాన యోగ సాధన .

Monday 6 January 2014

Art of Karma.

యుద్ధం ఎవరితో చేయాలి ?
చిత్తం లో ఉన్న అరిశడ్వర్గాలతో యుద్ధం చేయాలి . సమస్త ప్రాణులు తమ తమ ప్రక్రుతి ని అనుసరించి కర్మలను చేస్తాయి .
మనిషికి , మిగతా ప్రాణులకు తేడా ఏమిటి ? 
మనిషి లో వివేక విచక్షణ ,ఊ హా శక్తి బాగా పరిణితి చెందాయి
సరే , మనిషి ప్రక్రుతి ఏమిటి ?
రాగ ద్వేషాలు మనిషి లో ఉన్న మనస్సు యొక్క  సహజాత స్వభావాలు .
మా నవ దేహం పంచ తన్మాత్రలతో ,ప్రాణ శక్తి తో ఉన్న మండుతున్న కొలిమి .
కానీ మనిషి అంటే ఈ దేహము ,మనస్సూ కానే కాదు .
మనిషి నిజ మైన సహజాతం శాంతి - ఆనందం - సచ్చిదానందం . ఇది మనస్సుతో గ్రహించే ఇంద్రియార్ధం కాదు .  అనుభూతి చెందిన  జ్ఞానులు  చెప్పిన ఉపనిషత్ సారం .
ఏదైనా కారణం వల్ల కలిగేది సంతోషం లేదా దుఖం .
ఎలాంటి కారణం ,ప్రేరేపణ లేకుండా నిత్యమూ మనలో ఉండేది ఆనందం . ఇది ఆత్మ లక్షణం .
కానీ ఈ సహజ లక్షణాన్ని మరిచి పోయి మనస్సు చేసే మాయకు లోబడి పోవడం మానవ జన్మ కి ఉన్న అత్యంత సామాన్య లక్షణం . ఇక్కడి నుమ్డి ఆరోహణం చేసి మన స్వ స్వభావాన్ని , అనగా ఆత్మ  స్వభావాన్ని గుర్తుకి తెచ్చు కోవడ మే మనిషి జన్మకి లక్ష్యం కావాలని ఋషులు ,గీతాకారుడు చెప్పారు .

మనస్సుతో మాత్రమే విషయాలను  గ్రహించే సామర్ధ్య మున్న సామాన్యులకు ఆత్మ గత అనుభూతి గురించి చెప్పినా అర్ధం కాదు .

ద్వేషం ఎంత చెడ్డదో రాగమూ అంతే చెడ్డది .
పరధర్మాన్ని , అనగా దేహ , మానసిక ధర్మాలను మనం ఎంత బా గా అమలు చేసినా ,మన స్వధర్మ మైన అంటే ఆత్మధర్మ మైన ఆనందాన్ని నిత్యమూ అనుశ్టిమ్చ డ మే మన పరిణామానికి మంచిది .

మనం దేహ దృష్టి తో లోకాన్ని ,అందులో జరిగే ఘటనలను చూసినంత కాలం మనకు దుఖం, సుఖం వస్తూ నే ఉంటాయి .
మనం అన్నింటి కన్నా సూక్ష్మము ,అతి శక్తి వంతము ఐన ఆత్మ దృష్టి తో చూస్తే అనగా రాగ ద్వేషాలు లేని
స్వభావం తో ఉన్నప్పుడు ప్రతి ఘటనా ఆనంద కరమే .
కర్మా లేదా అకర్మా ఆనంద  మే .
సంఘ టన లేదా అసంఘ టనా ఆనంద మే .
నిత్యమూ ఆనంద మే .

Art of Living -1

మనుషులు ఎక్కువ శాతం సామాన్యమైన వివేకం తో ,అరిశడ్వర్గాలతొ కూడిన చిత్తం తో , శారీరక,మానసిక ఇబ్బందులకు ,ఆర్ధిక పర మైన సమస్యలకు , రక్షణ గురించి కలిగే భయాలకు , అలాగే రకరకాల కోరికలను తీర్చు కొనే క్రమం లో కలిగే వత్తిడి కి  లొంగి, కుంగి పోతుంటారు .

తమ లో కలిగే ఆలోచనలకు , కష్టాలకు ,నష్టాలకు  పూర్వ జన్మ కర్మలే కారణ మనుకొని  సరి పెట్టు  కొనే వాళ్ళు కొందరు . స్వాముల కి  ,గుళ్ళ  కి వెళ్లి మొక్కు కొనే వాళ్ళు  కొందరు .

తమ బలాన్ని ,బలహీనతని తెలుసు కోలేని వాళ్ళు ,
తమకున్న స్థితిని,పరిస్థితులను అర్ధం చేసు కో ని వాళ్ళు ,
విపరీత మైన కోరికలతో వేసారి పోయే వాళ్ళు  ----- ఎవరు ఏది చెప్పినా నమ్మే స్థితి లొఉన్నప్పుడు, స్వాములు,బాబా లు ,గుళ్ళలో జరిపే కార్యక్రమాలు, సేవలు వీటన్నింటికీ ఆకర్షిత మవ్వుతారు.

చేయ వలన ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేసి కోరికని, కోరిక వలన కలిగే లాభ నష్టాలను పూర్తిగా వదిలేసి ఒక శక్తి కి మనసా వాచా కర్మణా లొంగి పోవడమే  భక్తి .

అనాసక్తి  - వైరాగ్యం - కర్మ నిర్వహణ  -కర్మ ఫల త్యాగం లేదా కర్మ ఫలం పై అనాసక్తి -
 పదిమందికీ క్షేమం కలిగించేది యజ్ఞం  . మన కర్మలను యజ్ఞం వలే చేయాలి .
మనం గాలి పీలుస్తున్నాము . అన్నం తింటు న్నాము . ఆ గాలి ,నీరు , ఆహారం పదిమందికీ  అందే విధం గా మన ప్రయత్నం , కార్యా చరణ ఉండాలి . అదే యజ్ఞం .

 హోమ యజ్ఞ కార్యాలు బాహ్య పర మైన క్రతువులైనా , హోమ ద్రవ్యాలు , అప్పుడు  సంకల్పించే సమర్పణా భావనలు ఈ  విశ్వమ్ లోని అంతర్గత శక్తులకు మేలు చేసే పనులే .

ఆత్మ అంటే తన నిజ స్వరూపమని ,ఈ విశ్వ శక్తి లో అదొక భాగమని పూర్తిగా అనుభూతి చెంది - అనుభూతి కలిగించే భావం , ఆ అనుభూతిని గ్రహించే ప్రజ్ఞ , అనుభూతిని పొందే శక్తి - ఇవన్నీ ఒక్కటే అని సంభావిమ్చిన ప్పుడు మిగిలేది మౌన మే .

కానీ సామాన్యులు తమ తొలి  యత్నం గా  చేయ వలసింది --- ఫలాసక్తి లేని యజ్ఞ బద్ద  మైన  కర్మలు . అనగా మన దైనందిన పనులను, ఉద్యోగాలను , బాధ్యతలను ,నిర్ణయాలను , కోరికలను ,సమాచార సంబంధాలను , మానవ సంభంధాలను -ఫలాపేక్ష లేని యజ్ఞ బద్దంగా చేయడం అలవాటు చేసుకోవాలి .
వీటిని ప్రతి నిత్యం అభ్యాసం చేయాలి . అదే సాధన . దీనికి సహాయ పడేవి -భగవన్నామ సంకీర్తనలు, కర్తృత్వ భావం లేకుండా సమర్పణా భావం తో చేసే పూజలు,మనస్సుని అధిగ మించడానికి చేసే క్రియలు .

మనస్సుని ఎలా అధీనం చేసుకో వాలి ?
మనిషిలోని 6 జంతు  గుణాలను అధిగమించా లంటే వాటికి వ్యతి రేక మైన గుణాలను సాధన గా చేయాలి .
క్రోధాన్ని క్షమా ఓర్పు తో
కామాన్ని వైరాగ్యం తో
లోభాన్ని దానం తో
మోహాన్ని వివేకం తో
మదాన్ని అణకువతో
మాత్సర్యాన్ని కారుణ్య సేవ తో  --  - అధి గ మించే విధం గా మనస్సుని పూర్తిగా మార్చు కోవాలి .

ధ్యానం ఎంత సేపు చేస్తే అంత  సేపు మాత్ర మే మీకు శాంతిని , ఆనందాన్ని ఇవ్వగలదు . 
కానీ భగవద్గీతని నిత్య జీవితం లో అన్వయించు కొంటే ,మన జీవన మే ధ్యాన మో తుంది .