Search This Blog

Friday 25 April 2014

క్షత్రియ లోకపు పిలుపు

రాబోయే పాలకులు పాలించే  5 ఏళ్ళు భారత దేశ  చరిత్రని తిరగ రాసే కాలం .

  • ముఖ్యం గా భారత సనాతన సంప్రదాయ పునరుద్దరణ ,
  • విదేశీ వ్యవహారాలలో అత్యంత చురుకైన పదునైన పధకాలు ,  రష్యా ,ఇజ్రాయేల్ ,శ్రీలంక,నేపాల్,ఇండోనేషియా  దేశాలతో సత్సంబంధాలు . పాకిస్తాన్,చైనాలకు దీటైన సమాధానం 
  • మానవ వనరులను అత్యంత ఎక్కువగా వినియోగించు కొనే పరిశ్రమలు దేశ వ్యాప్తం గా  నెలకొల్పడం , 
  • అంతరిక్ష జ్ఞానాన్ని ప్రజా బాహుళ్యానికి అందించే పరిశోధనలు , 
  • రెండో హరిత,క్షీర,నీలి విప్లవాలు , 
  • లింగ విచక్షణ ను రూపు మాపే కటిన చట్టాలు ,
  • యువత కి చేతి నిండా పని ,
  • రై తుకి మద్దతు పంట ధర , 
  • రక్షణ సామగ్రిని దేశ  వాళీగా తయారు చేసే ముమ్మర పరిశోధనలు . 
రాబోయే కాలమ్ లో  కాబోయే నాయకులకు , క్షత్రియ పరిషత్ లన్నీ నిస్వార్ధం గా వారి వంతు సహకారం అందించాలని ,బారత దేశ ఐక్యతని కాపాడుతూ ,సనాతన ధర్మ ధార అవిచ్చన్నం గా సాగడానికి అవిరళ కృషి సల్పాలని ప్రార్ధన . 

Sunday 20 April 2014

క్షత్రియులందరూ ఒక్కటే .

12 వ శతాబ్దానికి పూర్వం భారత దే శ  క్షత్రియులలో ఎలాంటి భేదాలు లేవు . ఉత్తర ప్రాంత రాజ్ పుట్  లు ,దక్షిణ ప్రాంత మరాటా క్షత్రియుల మధ్య  సంభంధ బాంధవ్యాలు బాగా ఉండేవి .
24 బ్రహ్మ , 24 సూర్య , 24 శేష , 24 చంద్ర వంశాలు కలిపి మొత్తం 96 మరాటా క్షత్రియ వంశాలు మన భారత దేశాన్ని 17 , 18 శతాబ్దాలలో పాలించాయి .
కలియుగం ప్రారంభ దశలో , వ్యాసుడు ,వామ దేవుడు ,శుకుడు మొదలగు ఋషులు హిందూ మత  పునరుద్దరణకు ,భారత జాతి రక్షణకు ఏర్పరచిన 56 రాజ వంశాల నుండి 96 శాఖలుగా విస్తరిల్లిన మరాటా క్షత్రియ వంశాలు రాజస్థాన్ , కర్ణాటక ,మహారాష్ట్ర , మధ్య ప్రదే శ్  ,గోవా ,దక్కన్ ప్రాంతం ,గుజరాత్ లలో ప్రవర్దిల్లాయి . గోదావరి జిల్లా క్షత్రియులు రాజస్థాన్ రాజ్ పుట్ ల వారసులు . కృష్ణా జిల్లా క్షత్రియులు మరాటా క్షత్రియ వారసులు . పూర్వం క్షత్రియ దళాలు తమ విధి నిర్వహణలో అనేక ప్రాంతాలలో  స్థిర పడ్డారు . ముఖ్యం గా నదీ తీర ప్రాంతాల వెంబడి వారి సంచారం సాగేది .

కృష్ణా జిల్లా , కోసూరు  గ్రామం లోని మరికొందరి క్షత్రియుల కులగోత్రాల వివరాలు.

1. ఇంటిపేరు దళపతి   - చవాన్  క్లాన్  - - చంద్ర వంశం - మేవాడ్ రాజ్యం, గురువు వశిష్ట, వేదం రుగ్వేదం,గాయత్రి మంత్రం,క్లాన్ దేవత జ్వాలా ముఖీ భవాని.వశిష్ట గోత్రం .
ప్రవర . Prawar (Five) :- Angirasa, Brihaspati, Chyavana, Upamanyu and Saman *Guhyasutra :- Paraska 

2. ఇంటిపేరు జగతాప్ - జగతాప్వం శం - చంద్ర వంశ్ -భరత్పూర్ రాజ్యం -  జెండా పై గణపతి -ఖండేరా దేవత.

3. ఇంటి పేరు బుట్టె - జాదవ్ లేదా యాదవ్ క్లాన్ - -పసుపు రంగు జెండా-ధమ్మపాల గోత్రం -రుగ్వేదం - ప్రాంతం - వరంగల్,మధుర,దేవగిరి రాజ్యం -
*Gotra: Atri and Shavasaviti , అత్రి ,శవసవితి  లేదా ఆత్రేయస గోత్రం . 
*Pravar ;- Atri, Archan and Shavasaviti, 
*Veda: Rigveda ,
 *sign ;- Black, 
*Clan god (Kuladaivat):- Shreeshankar,Khandoba 
* Sect;- Nath

4.ఇంటి పేరు బోర్కాటి  లేదా బుర్ఘటే  - ధర్మదీర్ లేదా దందీర్ క్లాన్ . -బ్రహ్మ వంశం - చిత్తోడ్ ప్రాంతం - గాయత్రి మంత్రం - జెండా పై రుద్రుడు - కౌశిక్ రుషి .
Lineage: Bramhavansha, descended from the Brahmavanshi king Derik . 
Clan object: Pancha-pallava . *Guru: Kaushika rishi 
Gotra: Dorik *Veda: Rigveda *Mantra: Gayatri mantra. 



 .


Thursday 10 April 2014

మతాన్ని రక్షించు కోవలసిన అవసరం ఉందా?

మతాన్ని రక్షించు కోవలసిన అవసరం ఉందా?
ఈ భౌతిక ప్రపంచం లో మనిషికి రక్షణ ఇచ్చే ది గుంపు . ఆ గుంపు  అనేది  కులం వల్లో , రంగు వలనో , ప్రాంతం వల్లో ఎలా వస్తుందో అంత  కన్నా బలం గా మతం ద్వారా వస్తుంది .
కాబట్టి పారమార్ధిక చింతన మీద శ్రద్ద నమ్మకం లేని వారు , మానవత్వాన్ని మతం తో ముడి పెట్టే వారు తమ మతమే గొప్పదని , అన్య మతాలు  ఒట్టి బోగస్ అని,తమ మత  సిద్దాంతాలను ప్రచారం చేసుకొంటూ ఇతర మతాలను తెగ నాడుతూ ఉంటారు .

నేటి కాలానికి మనిషిని ఒక బలమైన సమూహం గా పట్టి ఉంచేది మతం .
ఆక్రోశం లో , ఆపదలో ప్రార్ధన ,
కోరికలు తీరడానికి  చేసే క్రతువులు --- ఇవన్నీ మనిషికి అత్యంత అవసరం .
ఒక  జాతి జీవన విధానం, వారు అనుసరించే మతం  పై ఆధార పడి ఉంటుంది .
   ఎన్ని విషయాలలో ఏకాభిప్రాయం ఉంటే అంత  ప్రశాంతం గా సంఘం ఉంటుంది .
ఒక సామూహిక  సమ్మతిని ప్రోత్సహించేది మతం.
కాబట్టి మతాన్ని రక్షించు కోవలసిందే . అలాగని అన్య మతాలను ఈసడించు కొనక్కర లేదు .
భిన్న మతాల మధ్య ఆరోగ్య కర పోటీ అన్ని విషయాలలో అవసరమే .
మతం మనిషిని ఓదా ర్చుతుం ది .
ప్రాధమిక అవసరాలైన కూడు ,గుడ్డ ,నీడ , రక్షణ కరువైన వారికి ఆలంబన గా నిలిచే మతాన్ని ఎక్కువ మంది ఆదరిస్తారు,  అనుసరిస్తారు .
ఇవన్నీ తీరిన తర్వాతే మనిషి పరమార్ధ చింతన చేయ గలడు .
హిందూ మతం ఆధ్యాత్మిక తకు  ఎక్కువ ప్రాధాన్యత నిస్తుంది.