Search This Blog

Sunday 30 March 2014

మన దేశ ఆర్ధిక స్థితి ,మనకున్న అప్పులు







ఎంత అభివృద్ధి చెందుతున్న దేశ  మైనా మేరు పర్వతం లా పెరిగిపోతున్న అప్పుని ,ఎడారిలా విస్తరిస్తున్న  అవినీతిని,నల్ల ధన ప్రవాహాన్ని ,ప్రజల్లో పేరుకుపోయిన అలసత్వాన్ని , 
సంక్షేమ పధకాల ముసుగులో భిచ్చం ఏరు కొంటూ కరడుగట్టిన  ప్రజల సోమరితనాన్ని 
తట్టుకోలేదు . 

Saturday 29 March 2014

 హిందూ ధర్మ శాస్త్రం,సత్సంతానానికి ,కులగోత్ర వం శ అభివృద్దికి ,అలాగే మనిషి మోక్షం పొందడానికి చేయ వలసిన కొన్ని గుహ్య    కర్మల కోసం , సమాజం జంతు స్థితికి  దిగ జార కుండా కాపాడు కోవటానికి -వివాహ చట్రాన్ని ఏర్పాటు చేసింది .
ఆయా కాల మాన పరిస్థితులకు  అనుగుణ్యమ్ గా కొన్ని విభిన్న మైన వివాహ  పద్దతులు వచ్చాయి . ఇంకా ఇంకా వస్తాయ్ .
ఏది ఎలా ఉన్నా స్త్రీ పురుష బంధం శారీరక,మానసిక,భావోద్వేగ ,సామా జిక స్థాయి లను దాటి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని  ఋషుల ముఖ్య ఉద్దేశ్యం .
పెళ్లి ఒక  పవిత్ర హోమం . మనిషి జీవితం లో జరగబోయే అనేక నిత్య నైమిత్తిక కర్మలు,హోమాలు,వ్రతాలు ,యజ్ఞాలకు వివాహ హోమం నాంది .

వివాహ సంప్రదాయ విధానం . 
పెళ్లి మండపం ప్రధాన ద్వారం దగ్గరే , ఆడ పెళ్లి వారు వరుడిని ,మగ పెళ్లి    వారిని  సాదరం గా- పూర్ణ కుంభ స్వాగతం తో  పెళ్లి మండపానికి ఆహ్వానించి , వరుడిని ఆశీర్వచనాలతో వేదిక పైకి తోడ్కొని వెళతారు . వధువు తల్లి,ఆ తర్వాత పురోహితుడు పెళ్లి కొడుకిని ఆశీర్వదిస్తారు . తర్వాత మగ పెళ్లి వారికి,వరుడికి మధుపర్కం లేదా  పానకం  ఇస్తారు .
వరుడు తూర్పు దిక్కుగా ,వధువు ఉత్తర దిక్కుగా నిలబడి ఉండి ,వధువు వరుడిని పెళ్ళిపీట పై ఆసీనుల వ్వమని కోరాలి . వరుడు కూ ర్చున్న  తర్వాత వధువు వరుడికి కుడి ప్రక్కన కూర్చోవాలి .
పురోహితుడు చేయించే  క్రమం . 

  • వరుడితో ఆచమనం,అంగ న్యాసం చేయించాలి . 
  • మధుపర్కం స్వీకారం . 
  • బహుమతుల ప్రధానం - వధువు తండ్రి వరుడికి ఆవుని ,ఇతర బహుమతులు ఇవ్వాలి . వరుడు వధువుకి బంగారం,వస్త్రాలు ప్రధానం చేయాలి . 


మిగతా భాగం తర్వాత పోస్టులో 

Tuesday 25 March 2014

జై కిసాన్ ... జై హింద్




మన దేశంలో సుమారు 18 మి లియన్ టన్నుల ధాన్యం- వరి ,గోధుమ - గోడౌన్ లు లేక ఆరుబయట చాలీ చాలని టార్పాలిన్ ల క్రింద ముక్కిపోతున్నాయి . అంతే కాదు , ఈ ధాన్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం ఏటా లక్ష కోట్లు ఖర్చు చేస్తుంది .

దీంట్లో 10 మి లియన్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసినా 3 బిలియన్ డాలర్ ల విదేశీ మారక ద్రవ్యం వస్తుంది .
ఇంత  మిగులు వ్యవసాయ ఉత్పత్తికి కారణం ప్రైవేట్ విత్తన సంస్థలు , ముఖ్యం గా బిటి ,మోన్సా  టో ,పయోనీర్ లాంటి సంస్థలు పరిశోధనలపై బాగా ఖర్చు పెట్టి పత్తి  ,మొక్క జొన్న దిగుబడులను పెంచడమే .

మొదటి పచ్చ విప్లవానికి , తొలి క్షీర విప్లవానికి ప్రభుత్వమూ , సహకార సంస్థలు కారణ మైతే ,నేటి రెండో వ్యవసాయ విప్లవానికి కారణం , శాస్త్రజ్ఞుల కృషి ని చేలోకి తీసుకెళ్ళిన ప్రైవేట్ సంస్థల వాణిజ్య బలం .

సెప్టెంబర్ 2011 లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పై  ఉన్న ఆంక్షలు తొలగించిన తర్వాత ఏటా 10 మిలియన్ టన్నుల వరి , 7మిలియన్ టన్నుల గోధుమ ని మనం ఎగుమతి చేయ గలుగు తున్నాము .

వ్యవసాయ రంగం లో పెట్టుబడులు పెరగాలి .
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి .
రైతు పండించే పంటకి కి పోటా పోటీ మద్దతు ధరలు ఉండాలి .
ఎందుకంటే దేశంలో పనిచేసే వారిలో 60శాతం మంది వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకు తున్నారు .
 వారు చల్లగా ఉండాలి . వారి చేలు పచ్చగా ఉండాలి .
అప్పుడే ప్రతి ఒక్కరికి చేతి నిండా పని , కడుపు నిండా కూడు దొరుకుద్ది .
జై కిసాన్ ... జై హింద్

Friday 21 March 2014

ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి .

మనుషులను చీల్చడానికి ఎన్నో విష వలయాలున్నాయి . అందులో  మహా ప్రమాద కర మైనది మతమూ , కులమూ .
మన రాష్ట్రం లో కులాల సంఖ్యా బలం ఎలా ఉందో చెబుతుంది ఈ క్రింది బొమ్మ .
అధికారం ద క్కా లంటే కులాల వారీగా మనుషులకు ఎర  వేయాలి .
కొన్ని కులాలను అందలం ఎక్కించాలి . మరి కొంత మందికి తాయిలాలు పంచాలి .
కుల బలం ఉందని విర్రవీగి , ఆ తాయిలాలకు పడిపోతే తర్వాత వగచీ ప్రయోజనం ఉండదు .
మన సెంటిమెంట్ ని , ఇష్టాలను పక్కన పెట్టి సమాజ హితవుని దృష్టి లో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి
ప్రజా స్వామ్యం లో  ఎన్నికలే  సామాన్యుడి ఆయుధం . దానిని ఎలా వాడుకోవాలో తెలియకపోతే అది మనల్నే గాయ పరుస్తుంది .
సంక్షేమ పధకాల పేరుతో విసిరే ఎంగిలి బిచ్చం కావాలా ?
ఉత్పాదకత ని పెంచి ఉద్యోగాలను సృష్టించే వ్యవస్థ కావాల్నా ?
అవినీతి,దోపిడీ ,క్విడ్ ప్రో కో రాజ్యం రావాలా ?
స్వేచ్చ , న్యాయం ,రక్షణ ,చేతి నిండా పని,కడుపు నిండా కూడు కావాలా ?
నిర్ణయించు కొనే సమయం వచ్చింది .
ఓట్ల పండుగ వస్తుంది . సిద్దం గా ఉండండి .



Demographics of A.P. as on 2010,categorization based on reservation policy:

Saturday 15 March 2014

తెలంగాణ ప్రభుత్వం ముందు పెద్ద కర్తవ్యమే ఉన్నది.

ఏ ప్రాంతానికైనా భూమి మూలధనం. వ్యవసాయ దిగుబడి ఒక ప్రాంత సామర్థ్యాన్ని, స్థోమతను తెలియజేస్తుంది. 
 భూకమతాల సమీక్ష, భూసంపద నిర్ధారణ కోసం బృహత్ కార్యక్రమాన్ని నిజాయితీపరులైన అధికారుల పర్యవేక్షణలో సాగించాలి. దానికి తోడు చేయవలసిన ఒక ముఖ్యమయిన విధాన నిర్ణయం- వ్యవసాయభూముల కొనుగోలుపై ఆంక్షలు విధించడం. 

మహారాష్ట్రలో, గుజరాత్‌లో వ్యవసాయదారులు కానివారు పంటభూములను కొనడానికి వీలులేదు. నిర్ణీత ఆదాయం దాటిన వారు కూడా వ్యవసాయభూములు కొనరాదు. పెద్దమనుషుల ఒప్పందంలో అటువంటి నిబంధన ఒకటి ఉండేది. ఆ ఒప్పం దాన్ని ఖాతరు చేయకపోవడం వల్ల తెలంగాణ చాలా భూమిని కోల్పోయింది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయాలకు మధ్య అగాధం ఉన్న కాలంలో, ప్రవాసభారతీయుల చేతిలో మిగులుధనం మిక్కిలిగా ఉన్న సమయంలో, భూమిని అం గడిలో పెడితే, చివరికి ఏమీ మిగలదు.

కార్పొరేట్లకు, పరిశ్రమలకు, సెజ్‌లకు అవసరానికి మించిన భూములు ఇవ్వడం నిలిపివేయాలి. 

తెలంగాణా రైతులు,గిరిజనుల జీవితాలు స్వయం సమృద్ది గా పండుతాయని కన్న కలలు నిజం కావాలి . 

Thursday 13 March 2014

అప్పుడే ఏమైంది ? ముందుంది ముసళ్ళ పండగ

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ బద్ద హామీలు ఇవ్వకుండా నే అడ్డగోలుగా ఆంద్ర రాష్ట్ర విభజనను  చేసింది .
కేంద్రానికి నిధులు లేవు .
పోలవరం, సీలేరు, గాలేరు, హంద్రినీవా, రాజోలిబండ, డెల్టా ఆధునీకరణ -వీటి గురించి ఉన్న చిక్కు ముళ్ళు తీర్చ కుండా ,సీమాన్ధ్రులు నిరంతరం బిచ్చగాళ్ళ మాదిరిగా అడుక్కొనే టట్లు చేసేసింది .
అటు తెలంగాణా రైతులకు కరెంటు వెతలు,నిరుద్యోగులకు నిరాశా నిట్టూర్పులు తప్పేటట్లు లేవు .
హైదరాబాద్ ఆదాయాన్ని సీమాంధ్ర కి పంచ కుండా ,కనీసం ఉద్యోగులకు జీతాలు,పెన్షన్ లు ఇవ్వలేని స్థితికి దిగజార్చింది .
రెండు లక్షల కోట్ల అప్పుని జనాభా దామాషా లో పంచి సీమాన్ధ్రని నిండా ముంచేసింది .
జాతీయ స్థాయి విద్యాలయాల వలన వాటి చుట్టూ భూముల రేట్లు పెరగడం తప్ప సీమాంధ్ర విద్యార్ధులకు ప్రత్యేకం గా ఒరిగేదేమీ లేదు . ఎందుకంటే వీటి ప్రవేశా లలో స్థానిక  రిజర్వేషన్ లుండవు .
పోలవరం  ముంపు ప్రాంతాల సమస్య ,ఆస్తులు ,అప్పుల సమస్య , కామన్ రాజధాని గా  హైదరాబాద్ ఉంటుందని చెప్పిన కల్లబొల్లి  కబుర్లు --- ఇవన్నీ తెలుగు వారు అనుభవించవలసిన అగత్యం .

ఎలాంటి చట్ట సవరణ (258A or 371H)లేకుండా - ఒక రాష్ట్రం లోని ప్రాంతం పై గవర్నర్ కి అధికారం కట్ట బెట్ట లేరు . కాబట్టి బిల్లులో చెప్పినట్లుగా  గవర్నర్ అజమాయిషీ హైదరాబాద్ పై జరుగుతుందని నమ్మకం లేదు .
కోర్టులో ఈ కామన్ రాజధాని క్లాజు వీగిపోయినప్పుడు , సీమాంధ్రులు తప్పని సరిగా హైదరాబాద్ పై తమ హక్కు  కోల్పోతారు .

 ఇది ప్రతి తెలుగు వాడూ తన చేత గానితనానికి చెల్లిస్తున్న మూల్యం .
పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన ప్రతి రాజకీయుడు కూడా మూల్యం చెల్లించే రోజు ముందుంది . 

Wednesday 12 March 2014

భూమిని,గోవుని ,అమ్మని కాచేవారు నవ్వుతూ ఉండాలి ...

దేశం లో 70శాతం ప్రజలు భూమిని నమ్ముకొన్న వ్యవ సాయదారులు,వ్యవసాయ కూలీలే .
 పొలం -పుట్రా, చె ట్టూ- చేమ, కొండా -బండ , అడవి - పోడు ,అరక - మడక ని నమ్ముకొన్న అమాయక జనాలే .

ఏటా 25కోట్ల టన్నుల ధాన్యం,ఇంకా కూరగాయలు,పండ్లు,అలాగే వాణిజ్య పంటలు పండిస్తున్నా వీరిలో 80శాతం మంది వారు చేసే పనిపై సంతృప్తిగా లేరు .
కారణం , చేలో ఎలుకలు,చీడపీడలు ,అంగట్లో దళారీ మూకలు,ఆకాశంలో గాలివానలు , అమలు కాని ప్రభుత్వ పధకాలు .
 8లక్షల కోట్ల రుణ పదకాలున్నా అవసర మున్న రైతులకు అందివ్వలేని  ప్రభుత్వ అసమర్ధత - ఇవన్నీ రైతుని మడి  నుండి పట్టణానికి పోమ్మంటున్నాయ్ .

సామూ హిక  ఎలుకల,చీడపీడల నివారణ ,
గోవుల ,జీవాల పెంపకం ద్వారా సమగ్ర వ్యవసాయం ,
సేంద్రియ ఎరువుల వాడకం ,పంట మార్పిడి ,
గ్రామాల్లో విత్తన శుద్ది ,విత్తన నిధి ఏర్పాటు ,
వ్యవసాయ ఉత్పత్తుల రక్షణకు శీతల గిడ్డంగుల ఏర్పాటు ,
సరిఐన సమయానికి రుణాల మంజూరు , అదునులో పదును కి సాయం ,
మండీల్లో మద్దతు ధరలు ,దళారుల నిర్మూలన  -------  ఇవన్నీ జరగవలసిన అవసరం ఉంది .

ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రచిస్తుంది . కానీ కార్య క్షేత్రం లో ఆ పధకాలు,ప్రభుత్వ నిధులు అన్నీ పక్క దారి పట్టి రైతు నోటికి ఇంట మన్ను మశానం మిగులుతుంది .

రైతు భారతాన్ని సుసంపన్నం చేసే నాయకులు రావాలి .
రైతు లు కూడా మారాలి .

Tuesday 11 March 2014

మనం మారాలి ...

ఒక్కటి మాత్రం పచ్చి నిజం . అసమానత ఎంత ఎక్కువ ఉంటే అంతగా సమాజం చీలిపోతుంది . 
ఆహారం,నీరు,విద్య,వైద్యం ,సత్వర న్యాయం  అందరికీ సమానం గా అందని సమాజంలో అంతర్యుద్ధాలు ,ఉగ్రవాదాలు నిత్యకృత్యం గా మారతాయి .  
మన రాజ్యాంగం లో నిబద్దీక రించు కొన్నట్లుగా ధర్మం,న్యాయం,సంక్షేమం, సమభావం,సౌభ్రాతత్వం మన దేశం లో వెల్లి  విరిసే టట్లు మన ప్రణాలికలున్దాలి . 
  • రైతులు పండించే పంటలకు  మద్దతు ధర ఇవ్వాలి. 
  • వారి పంట పాడై  పోకుండా శీతల గిడ్డంగులు ప్రతి మండలంలో నిర్మించాలి . 
  • ప్రతి మండలంలో ఆయా ప్రాంతాలలో లభ్య మయ్యె ప్రక్రుతి వనరులు , పండే పంటలు ఉపయోగించు కొనే చిన్న తరహా పరిశ్రమలను,ముఖ్యం గా యంత్రాల పై కాకుండా మానవ వనరుల పై ఆధార పడే పరిశ్రమలను , ప్రభుత్వ - ప్రైవేట్ బాగా స్వామ్యం లో నిర్మించాలి . 
  • వ్యవసాయ మరియు అనుబంధ పరిశ్రమలలో కనీస వేతనాలను 300/day అమలు చేయాలి . 
  • పనిచేసే సామర్ధ్యం ఉన్న ప్రతి మనిషికి వారానికి కనీసం 5 రోజుల పని లభ్య మయ్యే విధం గా పరిశ్రమలు,పధకాలు రచించి అమలు చేయాలి . 
  • పనిచెయ గల ప్రతి మనిషీ  తన ఆరోగ్యానికి,ప్రజారోగ్యానికి తప్పనిసరిగా రోజుకి 5 రూపాయలు ప్రాంతీయ ప్రభుత్వానికి చెల్లించాలి . 
  • 15లోపు ,65 దాటిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ మే ఉచిత నీరు,ఆహారం,వైద్యం ,విద్య ,వికాసం అందించాలి. 
  • విలువలతో కూడిన విద్య లేనివారిని నిరక్షరాస్యులు గానే గుర్తించాలి . అంటే  వారికి ఎలాంటి ఉన్నత ఉద్యోగాలు ,పదవులు అంద కుండా చట్టం చేయాలి . 
  • పనిచేసే సామర్ధ్యం ఉన్నవారికి ఎట్టి పరిస్థితిల్లో నూ ,బిచ్చ మేసినట్లుగా సంక్షేమ పధకాలు పేరు తో ఉచిత సౌకర్యాలు కలుగ చేయ కుండా ,అలాంటి హామీలు కూడా పార్టీలు చేయ కుండా చట్టం చేయాలి . 
  • కుల,మతా లకు,భాషా ప్రాంతీయతలకు అతీతం గా సార్వత్రిక పౌర హక్కు , పౌర ధర్మ చట్టాన్ని చేయాలి. 
  • ధనవంతులకి ,పేద వారికి మధ్య పెరిగిపోతున్న అంతరాన్ని తగ్గించే విధం గా పధకాలు ఉండాలి . 
  • దేశీయ  సరకుల  పై పన్ను భారం తగ్గించి చైనా వస్తువుల దాడిని తిప్పికొట్టి ,మన ప్రజలకు పని కల్పించే పరిశ్రమలను కాపాడాలి . స్వదేశీ వస్తు వినియోగాన్ని ప్రోత్సహించాలి . 
  • కాలుష్యాన్ని యుద్ద ప్రాతిపదిక పై తగ్గించాలి . నదులు,గాలి,ఆహారం ,కలిషితం కాకుండా కటిన చట్టాలను అమలు చేయాలి. 
  • గంగని,గోవుని ,అమ్మని కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితికి దేశాన్నిఈడ్చిన వారిని కటినం గా శిక్షించాలి.
  • అన్నీ తెలిసీ ఓటు వేయడానికి బద్దకిం చే బడు ద్దాయులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సదుపాయాలూ ఉండకూడదు. 
  • చట్ట సభకి పోటీ పడే అభ్యర్ధులు ఎలాంటి నేరచరిత్ర లేకుండా సమాజ సేవలో ఆరితేరిన వారై ఉండాలి.     

కొత్తా రాష్ట్ర మండీ -

పూర్వం రాచరికాల కాలంలో పాలించే రాజు ఒక్కడు ధర్మం గా ఉంటే రాజ్యం సుభిక్షం గా ఉండేది . కానీ నేటి ప్రజాస్వామ్య యుగం లో ప్రతి మనిషి ధర్మం గా ఉంటేనే సంఘం శాంతం  గా ఉంటుంది .

తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి . అధికారం కోసం ఎన్నో వర్గాలు తమ పోరు ప్రారంభించాయి .
ఇప్పటి వరకు ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టిన రాజకీయులు ,కులాల వారీగా ప్రజలను చీల్చే పనిలో ఉన్నారు .
భాష ,కులం , మతం ,ప్రాంతీయత ,మనుషులను ఎలా వేరు చేస్తాయో మన దేశాన్ని చూస్తే అర్ధ మవుతుంది .


రెండు ప్రాంతాల్లో కొత్త సామాజిక శక్తులు రాజకీయాలను ప్రభావితం చేసే దశకు చేరుకున్నాయి. 
ఏ రాజకీయ పార్టీ అయినా దళితులను, మైనారిటీలను విస్మరించి దేశవ్యాప్త ప్రాబల్యం సంపాదించగలదా ? అనుమానమే ! 
తెలంగాణలో సుమారు 50 శాసనసభ నియోజకవర్గాలు సీమాంధ్రుల ఓట్ల పైనే ఆధార పడి యున్నాయ్ . 
సమైఖ్య రాష్ట్రం లో సుమారు 100 శాసనసభ నియోజకవర్గాలు,17 లోక్ సభ నియోజకవర్గాల లో 10 శాతం ముస్లిం వోటర్ లు ఉన్నారు . 

Monday 10 March 2014

దానం చేయండి -దర్శన భాగ్యం పొందం డి

మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ ఇష్టం వచ్చిన రోజున తిరుమలలో 
శ్రీ వెంకటే శ్వర స్వామి వారి దర్శనం  చేసుకొని దేవస్థానం కాటేజీలో విశ్రాంతి తీసుకొనే అవకాశం వస్తే వదులు కొంటారా ? 
ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోరు కదా !
ఈ కోరిక సాకారం కావాలంటే ఒకే ఒక్క  లక్ష రూపాయలు స్వామి వారి దేవ స్థానానికి దానం చేయండి . 
For more information on schemes, please contact:   వివరాలకు సంప్రదించండి : 
  • Phone No. +91-0877-2277777
  • Phone No. +91-0877-2263472 at Donor Cell, Tirupati
  • Phone No. +91-0877-2233333