Search This Blog

Wednesday 17 December 2014

లూట్ మార్

 అధికారులు, వ్యాపారస్తులు ,అధికారం లో ఉన్న రాజకీయనాయకులు  గడచిన దశాబ్దం లో సుమారు 30 లక్షల కోట్ల మనదేశ సంపదను లూటీ చేశారు . ఈ సంపద ని బయటకు పోకుండా కాపాడు కొంటే, మనం విదేశీ పెట్టుబళ్ళ
పై ఆధార పడ నక్కర లేదు . పోయినదానిని తెచ్చినా ,తేకున్నా కనీసం ఇప్పటి నుండైనా జాగ్రత్త పడే పాలసీలను పటిష్ఠం గా అమలు చేసే సత్తా ఉన్న మోడీ ప్రభుత్వం ఎందుకనో ,అనుకొన్నంత వేగం చూపడం లేదు .
according to the latest study released on Tuesday by Global Financial Integrity (GFI), a Washington DC-based research and advisory organization,in the preceding decade,  the total illicit outflow of capital from the country mounts to about  Rs 28 lakh crore.  
weather modi's govt brings black money or not, we expected that it can control further illicit outflow of capital from the country with iron fist. but its not so!

Wednesday 5 November 2014

engineering colleges has to change

ఇన్నాళ్ళూ , ఒక సాఫ్ట్ వేర్ కంపనీ లో 6000కోట్ల రూపాయల అదనపు రాబడికి దేశీయ ఐటి కంపెనీల్లో కొత్తగా 26,500 ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు . కారణం ?
ఆటో మేషన్ !
గత ఏడు , 2013-14లో ఐటి కంపెనీలు ప్రతి 6000కోట్ల రూపాయల అదనపు రాబడికి, కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య కేవలం 13,000 మాత్రమే. అంటే దాదాపు సగం ఉద్యోగాలు తగ్గి పోయాయి . 
 డైనమిక్‌ ఆటోమేషన్‌ కోసం ఐటి కంపెనీలు, ఆటోమేషన్‌ టూల్స్‌, సాఫ్ట్‌వేర్‌ రోబోలను ఉపయోగిస్తున్నాయి. 
తక్కువ స్కిల్‌ ఉండి, చేసినపనే మళ్లీమళ్లీ చేయాల్సిన చోట ఆటోమేషన్‌ ఉపాధిని దెబ్బతీస్తుంది. టెలికామ్‌ రంగంలో స్విచ్‌ బోర్డు ఉద్యోగాలు గల్లంతైన విషయం తెలిసిందే.  
కానీ , యంత్రంపై యాంత్రికంగా పనిచేసే ఉద్యోగాలు గల్లంతైనా, మనిషి తన నైపుణ్యాలను, ఆలోచనా శక్తిని, స్పందనలను ఉపయోగించక త ప్పని రంగాల్లో ఉద్యోగాలను మాత్రం ఎవరూ తగ్గించలేరు.వైద్యం, వ్యవసాయ రంగాల్లో సేవలు, విద్యుత్‌, నీటి సరఫరా వంటి సర్వీసులు వీటిని ఐటితో అనుసంధానం చేయడం ద్వారా కొత్త హైబ్రిడ్‌ రంగాలు ఉనికిలోకి వస్తాయి.
కాబట్టి , ఇంజనీరింగ్ కాలేజీలు డాక్టర్స్ ,నర్సులు ,ఇంకా అన్ని రకాల వృత్తుల వారికీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పే సిలబస్ తో కోర్సులు నిర్వహి స్తే వారికీ ఆర్ధికం గా బాగుంటుంది . 

Friday 10 October 2014

అట్ల తద్ది నోము

అట్ల తద్ది -ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగనీ ,చంద్రోదయ ఉమావ్రతం' అనీ సంప్రదాయం చెబుతుంది . 
స్త్రీలలో ఉండే కోరికలు -ముఖ్యం గా మంచి వీర్య వంతుడైన భర్త ,సత్సంతానం కోరుకొంటూ వారి చర్మానికి మంచి చేసే గోరింటాకు పెట్టు కొని , ఆరోగ్యానికి శుభ కర మైన బియ్యం పిండి ,మినప్పిండి కలిపి చే సే అట్ల నే చంద్ర కళా ధరుడైన శివ సమేత గౌరీ దేవికి నివేదన చేసి ,అలాగే కొంత మంది స్త్రీలకూ దాన మనే వాయనం ఇచ్చి ప్రసాదం స్వీకరిస్తారు . 
స్త్రీలకు చెందిన హార్మోనుల పై - చంద్రుడు, కుజుడు , రాహు-కేతువు లు ప్రభావం చూపుతారు . 
ఇడా -పింగళ నాడులలోని ప్రాణ శక్తి ప్రవాహాలు , స్త్రీ గర్భాశయ -అండ కోశాల' పై ప్రభావం చూపే పారా సింప థిటిక్ నరాలు ---- ఇవన్నీ సక్రమ బద్దం గా పనిచేయ డానికి సరైన పోషకాహారం ,ప్రశాంత మైన ఉల్లాసభరిత వాతా వరణం ఉండాలి . 
పండుగలు ,వ్రతాలు చేయడం లో అంతరార్ధం ఇదే . 

Sunday 5 October 2014

సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతకు బిగ్‌డేటా ఎనలిటిక్స్‌ పరిజ్ఞానం

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, అదే సమయంలో ఒక్క అనర్హుడికి కూడా ఇవ్వకూడదన్న లక్ష్యంతో సరి కొత్త టెక్నాలజీని వాడుకోవడానికి నడుం బిగించిన ఆంధ్ర ప్రభుత్వం . 
క్షే త్ర స్ధాయిలో సర్వే, ఆధార్‌ కార్డుతో అనుసంధానం,మిగతా శాఖలతో సరి పోల్చి వడపోత - ఇవన్నీ నిక్కచ్చిగా చేస్తూ  నిజంగా పేదవారా కాదా అన్నదానిపై  విశ్లేషణలు  చేయిస్తున్నారు. 
 పక్కా గృహాల మంజూరు,ఫించన్ లు ,రేషన్ బియ్యం ,ఉచిత ఆరోగ్య సేవలు,ఉచిత ఇళ్ళు -ఇలా ఎన్నో పధకాలు పక్క దారి పట్ట కుండా అవసర మైన అర్హులకు మాత్రమే అందే టట్లు చేయాలని చంద్రబాబు తపన . 
కొంత మంది తమకు 65 ఏళ్ల వయసు లేకపోయినా  పింఛన్లు తీసుకొంటున్నారు . 
అసలు ఈ భూమి మీద లేని సుమారు మూడున్నర లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా కాగితాలలో చూపించి కొంతమంది   బొక్కేస్తున్నారు . 

Friday 19 September 2014

3 లక్షల తెలుగు దేశం పార్టీ కార్యకర్తల కు సువర్ణ అవ కాశం .

సుమారు 20000 గుళ్ళ కి , 200 మార్కెట్ యార్డ్ లకు కమిటీ సభ్యులు గా నామినేట్ అయ్యే అవకాశం
రావడం తో , తెలుగు దేశం పార్టీ కార్యకర్తల లో హుషారు వచ్చింది .

రాజధాని వార్తలు -2

కృష్ణా నదికి ఇరు వైపులా -అటు  తాడేపల్లి నుండి అమరావతి వరకు ,ఇటు గొల్లపూడి నుండి ఇబ్రహీం పట్టణం వరకు - ప్రభుత్వ పరిపాలనా భవనాలు , ఉద్యోగుల , MLA,MLC ,మంత్రుల ల నివాసాలు వచ్చే అవకాశం ఉంది. డైరెక్టరేట్ ,కమీషన రేట్ , సెక్రటేరియట్ ,శాసన సభ ,కౌన్సిల్ ,రాజభవన్ ,అలాగే సుమారు 100 ప్రభుత్వ సంస్థల
ఆఫీసులు వస్తాయి . నిజానికి వీటన్నింటినీ కేవలం 1000 ఎకరాలలో మంచి పచ్చదనం తో బహుళ అంతస్థుల భవనాలతో ,సోలార్ శక్తితో ,మురికి శుద్ది ప్లాంట్ మ రియు శు ద్దీకరిమ్చిన జల వినియోగం మొదలగు స్మార్ట్ సాంకేతికత ను ఉప యోగించు కొని ప్లాన్ చేస్తే విజయవాడ ఒక మంచి మోడల్ రాజధానిగా వృద్ధి చెందుతుంది .

సుమారు 500 km బకింగ్ హామ్ కాలువని  జల రవాణాకు అనుగుణం గా అభివృద్ధి చేస్తే అత్యంత చౌక లో సరకులను కాకినాడ నుండి విల్లుపురం వరకు రవాణా చేసుకో వచ్చు .



తల్లి తెలంగాణా కూడా భరత మాత బిడ్డే

 9 జిల్లాల తెలంగాణ లో 80 లక్షల కుటుంబాలు , 3కోట్ల జనాభా ఉన్నారు . 
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 20 లక్షల కుటుంబాలు ,75 లక్షల జనాభా ఉన్నారు . 
శ్రీ కే .సి . ఆర్ . గారు ఆంద్ర సెట్లర్స్ పట్ల వివక్ష, ఆంధ్ర పెట్టుబడి దారుల పట్ల వైముఖ్యం ,
అలాగే దేశ రాజ్యాంగం పట్ల హేళన , అలుసు -- ఇలాగే కొ న సాగిస్తే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గానో  లేదా ప్రత్యేక రాష్ట్రం గానో  మార్చమని హైదరాబాద్ వాస్తవ్యులందరూ ముక్త కంటం  తో గళం విప్పే రోజు  అతిత్వరలో నే వస్తుంది .

తెలంగాణా ప్రజలందరూ మేల్కొని తమ నాయకులను అదుపులో పెట్టు కోవలసిన అవసరం చాలా ఉంది .
మనం భారతీయులమని,మన ఫెడరల్ వ్యవస్థ లో జెండాని , రాజ్యాంగా న్ని గౌర వించాలని  మరిచి పోతే అంత  కన్నా దౌర్భాగ్యం ఉండదు .

నిజాం నవాబులు దేవుళ్ళని , రజాకర్ల వలనే తెలంగాణా అభివృద్ధి చెందిందని ,
తెలంగాణా పోరాటం ఎంత సబబో కాశ్మీర్ పోరాటం అంతే సబబని --- డంకా వాయించి చెబుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తి నట్లు గా మిన్న కుండటం చాలా ప్రమాదకరం .
దేశానికి ,ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా అదుపు చేయ వలసిన బాధ్యత కేంద్రానిదే . 

Wednesday 3 September 2014

తస్మాత్ జాగ్రత్త

   అందరూ ఉహిస్తు న్నట్లు విజయవాడ ప్రాంతం హైదరాబాద్ లాగా భూమికి సమాంతరం గా వ్యాపించదు .
ఎందు కంటే కొత్తగా  భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు .
నదీ తీరానికి ఎదురుగా ప్రభుత్వ భూము లున్న చోట ,బహుళ అంతస్తుల ప్రభుత్వ పరిపాలనా భవనాలు,
రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు ఇళ్ళు ,కొన్ని విద్య, విద్యాలయాలు వస్తాయి .

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం గా అభివృద్ధి చెందా  లంటే డబ్బు ఒక్కటే సరిపోదు ,
సరిపడా ప్రయాణికుల డిమాండ్ ఉండాలి .
అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఉన్నప్పుడే అది సాధ్య పడుతుంది .

అటు రాయల సీమ,ఇటు విశాఖ ప్రాంతాలు ఉద్యోగ కల్పనలో ,పరిశ్రమల స్థాపనలో  దూసుకు పోతాయి .
ముఖ్యం గా ఐ. టి .,ఫార్మా ,సినీ పరిశ్రమలు విశాఖ లోనూ ; హార్డ్ వేర్ ,సాఫ్ట్ వేర్ ,ఇతర భారీ పరిశ్రమలన్నీ బంగలొర్ కి ,మద్రాస్ కి దగ్గరున్న అనంతపురం , చిత్తూర్ ,తిరుపతి,కర్నూల్ ప్రాంతాలలో స్థా పించే అవకాశాలు హెచ్చు గా ఉన్నాయి .
విజయవాడ ,గుంటూరు ప్రాంతాలు కేవలం పరిపా లనా విభాగాల కే పరిమితమవుతుంది . అంటే నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది . సుమారు 10వేల మంది ఉద్యోగులు కొత్తగా రాజధానికి వస్తారు ,కాబట్టి అపార్ట్మెంట్ ల కు అద్దెలు పెరుగుతాయి .
ఏది ఏమైనా ,హైదరాబాద్ మాదిరి వత్తిడి ఉండదు .
అనవసర మైన స్పెక్యు లేషన్ తో దళారులు  రియల్ ఎస్టేట్ బుడగ ని అమాంతం గా
పెంచు  కొంటూ పో తున్నారు .
విజయవాడ కి 20 కిలోమీటర్ ల దూరం లో  ఎకరా భూమి సుమారు
6 నుండి 10 కోట్లకి పెంచి చెబుతున్నారు . అంటే ,గజం 25000/-లెక్కన
అమ్ముదామని చూస్తున్నారు .
ఇలాగే ప్రజలు వ్యవహరిస్తే ,ఇప్పుడు భూములపై  పెట్టుబడి పెట్టే వాళ్ళు నిండా మునుగుతారు . 

Sunday 31 August 2014

మోడీ మాజిక్

తొలి 100 రోజు ల్లో కొత్త ప్రధాన మంత్రి మన దేశానికి చేసిన పని ,
 దిశా నిర్దేశం ఎలా ఉంది ?

1. ఇంతదాకా చిన్న చిన్న ఉద్యోగులకే పరిమిత మైన  అనగా కేవలం  రూ.6,500 లోపు జీతం ఉన్న ఉద్యోగుల కే అవకాశ మున్న EPF, ఇప్పుడు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఈ పరిమితి రూ.15,000కు పెరుగుతుంది. దీనివల్ల పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నెలవారీ పెన్షన్‌లో కూడా పెరుగుదల ఉంటుంది.  EPF అంటే పదవీ విరమణ సమయానికి కొంత డబ్బు చేతికి వచ్చి, ఆ తర్వాత నెలవారీ పించన్ సౌకర్యం పొందడానికి ప్రతి ఉద్యోగీ తన జీతం లో కొంత భాగం మరియు యజమాని కూడా అంతే మొత్తాన్ని ప్రతి నెలా ప్రభుత్వ భవిష్య నిధి అనే పొదుపు ఖాతా లో పెడతారు . ఉదాహరణకు , 6500/- జీతం ఉన్న ఉద్యోగి తన వాటా గా  రూ.780 + అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా EPF  లో జమ చేస్తున్నారు. ఇప్పుడు 15000/జీతగాడు 1800/- + అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా EPF  లో జమ చేస్తారు . 

2. ఉ ద్యోగుల డిపాజిట్‌ మొత్తంతో అనుసంధానించిన బీమా (ఈడీఎల్‌ఐ) పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న ప్రయోజనం సైతం ఇకపై రూ.1.56 లక్షల నుంచి రూ.3.6 లక్షలకు పెరగనుంది . 

3. ఇ న్నాళ్లూ చాలీ చాలని పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న బడుగు కుటుంబాలకు పెద్ద ఊరట. చిరుద్యోగులుగా రిటైరై, కేవలం మూడు నాలుగు వందల పింఛనుతో అష్టకష్టాలు పడుతున్న మాజీలకు ఇకపై నెలకు కనీసం వెయ్యి రూపాయల మొత్తం పింఛనుగా అందనుంది. అలాగే భర్తను కోల్పోయిన వారికీ ఇకపై వెయ్యి రూపాయల గౌరవప్రదమైన పింఛను మొత్తం చేతికి రానుంది.
4. జన ధన యోజన :సామాన్యుడిని కూడా ఆర్ధిక ప్రగతిలో కలుపు కొని పోవడానికి ,ప్రతి భారతీయుడికీ ఒక బాంక్ ఖాతా ఉండాలని ,దానిద్వారా ప్రభుత్వ సంక్షేమ పధకాలకు సంబంధించిన నగదు బదిలీ ,ఉపాధి కూలీ, ఇంకా ఇతరత్రా సదుపాయాలూ , అలాగే కనీసం 5000/- అప్పు ,1లక్ష ప్రమాద భీమా ,ముందు ముందు ఆరోగ్య భీమా ,ఇంకా అనేక సదుపాయాలను ఎలాంటి దళారీల ,అధికారుల బెడద లేకుండా కల్పించ బడతాయి . 
   ఈ పధకం ద్వారా బాంక్ ఖాతాలు ,అలాగే ఎలాంటి బాంక్ అప్పులకు అర్హత లేని 
50 కోట్ల మందికి   కొత్తగా బాంక్ ఖాతాలు ఏర్పరు స్తారు . 

5.స్వచ్చ్ భారత్ :  దేశం లో సగం మంది అంటే  సుమారు 60 కోట్ల మంది  టాయిలెట్ లు వాడటం లేదు . సెల్ ఫోన్ లు మాత్రం వాడ తారు .  5ఏళ్లలో వీరందరికీ ప్రభుత్వ మే ఉచితం గా టాయి లెట్ లు కట్టాలని సంకల్పిం చింది . 
స్వచ్చ మైన శుద్ద మైన దేశమే  ఆరోగ్య ప్రదం  గా అభి వృద్ది చెందుతుంది . 

6.  వాణిజ్యం మె రుగుదలకోసం,ఐక మత్య అభివృద్ధి కోసం  పొరుగు దేశాలతో సఖ్యత . 

7. అగ్ర రాజ్యాలతో ముఖ్యం గా బ్రిక్స్ దేశాల సమాఖ్య లో కీలక పాత్ర, బ్రిక్స్ బాంక్ ఆవిష్కారం . 

8. ఫాస్ట్ ట్రాక్ పై వాణిజ్య ,పారిశ్రామిక ఉత్పాదకత అభివృద్ధి. 

9. ఉల్లి,ఆయిల్ , అలాగే అన్ని వస్తువుల రిటైల్ ధరల స్థిరీకరణ అతి పెద్ద విజయం . దీ ర్ఘకాలంలో ధరలను అదుపులో ఉంచేం దుకు ధరల స్థిరీకరణ నిధి.  

10.  కాశ్మీర్ పండిట్ ల కు పునరావాసం . 

11. డిజిటల్ భారత్ , 100 స్మార్ట్ సిటి పధకం, నల్ల ధానం వెలికి తీతకు సిట్ ,24/7 విద్యుత్ సరఫరా, 
జల,రోడ్,రైల్ పబ్లిక్ రవాణా  మెరుగుదల , రక్షణ పరికరాల ,రైలు వాగన్ ల తయారీలో విదేశీ పెట్టుబడుల కు స్వాగతం . 

12. మంత్రుల శాఖల పై ప్రధాన మంత్రి మంత్రి ఆఫీస్ కి పూర్తి  పట్టు . 

13.అనవసర దుబారా తగ్గించి నిర్ణయాలను వేగిర పరచడానికి మంత్రిత్వ శాఖల కుదింపు , మంత్రుల కమిటీల(GoM) రద్దు , ప్రణాలికా సంఘ రద్దు , ఆఫీస్ పని వేళ లను కటినం గా అమలు చేసి దస్త్రాలు త్వరగా కదిలే టట్లు చేయడం . 

14. అన్నింటి కంటే అతి ముఖ్యం -ప్రజలు అప్ప చెప్పిన బాధ్యతా ను ఎక్కడా ఎలాంటి తొందర లేకుండా ,హడావిడీ గందర గోళం కనబడ కుండా , సుక్షితుడైన సైనికుడిలా పధకాలను రచిస్తూ సాగిపోతున్న విధానం,గారంటీగా దేశానికి మంచి రోజులోచ్చాయనే నమ్మకం  కలిగిస్తుంది . 

Wednesday 20 August 2014

Clean India@Modi.

మనదేశం లో పల్లెలు పరి శుభ్రం గా ఉండా లన్నా , అంటువ్యాధులు అరికట్టా లన్నా ,
స్త్రీలపై అత్యాచారాలు నిరోధించా లన్నా, టాయిలెట్ ల కొరత తో ఇబ్బంది పడుతున్న ,
11కోట్ల కుటుంబాలకు, 1 లక్ష ప్రభుత్వ పాట శాలలకు, యుద్ద ప్రాతి పదిక పై  టాయిలెట్ లు
నిర్మించ డానికి సుమారు 2లక్షల కోట్లు కావాలి .
ఈ పధకం ఎంతో  మందికి ఉద్యోగ అవకాశాలు కలగ చేస్తుంది .
సిమెంట్ ,ఇటుక,శానిటరీ  పరిశ్రమలకు గట్టి ఊతమ్ ఇస్తుంది .
ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందా లంటే ఈ క్రింది షరతులు పెట్టాలి.
1.టాయిలెట్స్,సెప్టిక్ టాంక్ ఉండి, విధి గా వాడకంలో ఉండాలి.
2.కానుపు సమయంలో సమాచారాన్ని ప్రాధమిక వైద్య  కేంద్రంలొ నమోదు చేయాలి.
3.విధిగా కాయగూరలు ఇంట్లో పండించాలి.

Sunday 17 August 2014

The leader of New state ???

నాయకుడికి,ముఖ్యం గా ప్రభుత్వం నడిపే వారికి సమస్య ల పై ఖచ్చిత మైన అవగాహన,
ముందు చూపు ,విజ్ఞత , ప్రజల పై అభిమానం ఉండాలి .

కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు,మీడియాలో కొద్ది కాలం పాటు సంచలనం కలి గించే  ప్రకటనలు , ప్రజలను వర్గాలుగా చీల్చి ఒక రి పై ఒకరిని ఉసి కొల్పే చర్యలు -ఇవన్నీ ఆ నాయకుడిని ,పార్టీని కొంతకాలం అందలం ఎక్కించ వచ్చేమో గానీ,ప్రజలు అష్ట కష్టాలు పడి భవిష్యత్ లో సాధారణ జన జీవన స్రవంతి కి దూర మవుతారు .
అంటే ఒక తిక్కర్ నాయకుడి వలన కోట్ల మంది ప్రజలు తమ అవకాశాలను కోల్పోతారు .
 వారి భవిష్యత్ ప్రమాదం లో పడుతుంది .

ముందుగా ప్రకటన చేయడం, ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవడం, ఆ పిమ్మట సవరించుకోవడం . 
 ఇప్పటి వరకు శ్రీ కేసీఆర్‌ తీసుకున్న 13 నిర్ణయాల్లో తడబాటు తప్ప, ఎందులోనూ స్పష్టత, 
కచ్చితత్వం కనిపించడం లేదు . కేవలం రెచ్చ గొట్టే ధోరణి ,రాజ్యాంగ ము పై అవగాహనా రాహిత్యం 
కనిపిస్తుంది . 

ఏమనిపిస్తుం దంటే ఒక వర్గాన్ని ఒక ప్రకటనతో బెదరించి ,వారి తో లాలూచీ పడతు న్నా రేమో అనిపిస్తుంది . 
కేంద్రం తో గొడవ పెట్టు కోవడం , కేంద్రానికి మిగతా రాష్ట్ర ముఖ్య మంత్రులకి ఉత్తరాలు రాసి పలుచన అవ్వడం 
అవసర మైతే తెలంగాణ పౌర ముద్రికలు బట్వాడా చేసి ఒక కొత్త దేశం లెక్క అమాయక ప్రజలలో దేశ ద్రోహ భావాలను పెచ్చ రిల్ల  చేయడం - ఇవన్నీ చౌకబారు రాజకీయ విన్యాసాలు తప్ప , మంచి నాయకత్వ లక్షణాలు మాత్రం కావు . 


 పేకాట క్లబ్బులను నడవనివ్వమని చెప్పారు
 ప్లేబాయ్‌లాంటి క్లబ్బులకు అనుమతి ఇచ్చారు
 వాహనాల నెంబర్ల మార్పు అన్నారు
 అమలు చేయడం లేదంటూ కోర్టుకు వివరణ ఇచ్చారు! 
 అక్రమ కట్టడాలను సహించేది లేదని కొన్నిటిని కూల్చివేశారు
 ఇప్పుడు కూల్చివేతలపై ముందుకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు
 సమగ్ర కుటుంబ సర్వేలో అందరూ వివరాలు చెప్పాల్సిందేనని చెప్పారు
 కాదు.. కాదు.. స్వచ్ఛందమని కోర్టుకు వివరణ ఇచ్చారు! 
 మెట్రో రైలు పనులు సాగనివ్వమని చెప్పి
మళ్లీ పనులకు పచ్చజెండా ఊపారని, పైగా 200 కిలోమీటర్ల వరకు పొడిగిస్తామంటున్నారని గుర్తు చేశారు 
 విద్యార్థులందరికీ ఫీజులు చెల్లిస్తామని, ఎంత మొత్తమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
 ఇప్పుడేమో లేని పోని నిబంధనలు విధిస్తున్నారు’
 రాష్ట్ర విభజన బిల్లుని పూర్తిగా సమర్ధిమ్చారు. 
 ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు . 

Tuesday 12 August 2014

వ్యవసాయ భారతం

స్వాతంత్రం వచ్చిన ప్పటి  నుండి ఇప్పటి వరకు  గణాంకాలు పరిశీలిస్తే , రైతులు(అనగా అంతో ఇంతో భూమి ఉన్న వారు) జనాభా లో 50% నుండి  25% కి తగ్గిపోయారు .
అంటే సంఖ్యా పరం గా 7 కోట్ల నుండి 12 కోట్ల కి  రైతులు పెరిగినా జనాభా పరం గా చూస్తే వారి శాతం సగానికి పడిపోయింది .

ఇదే కాలం లో ,రైతు కూలీలు అనగా వ్యవసాయ పై ఆధార పడి  పని చేసే వారు 20% నుండి క్రమం గా పెరుగుతూ ఇప్పుడు 30% ఉన్నారు . అంటే  రైతు కూలీలు సుమారు 3 కోట్ల నుండి 14 కోట్లకు పెరిగారు .

అంటే మన దేశం లో రైతులు క్రమం గా తమ భూములను కోల్పోయి , రైతు కూలీలుగా ఆర్ధిక నిచ్చెన లో క్రిందకు జారి పోతున్నారు .

గడిచిన దశాబ్దం లో ముఖ్యం గా కాంగ్రెస్ పాలించిన 10 ఏళ్లలో  కొత్తగా 4 కోట్ల మంది, ఆర్ధిక స్థితులు దిగజారి రైతు కూలీలు గా మారారు .
మొత్తం మన రైతు మరియు రైతు కూలీల సం ఖ్య 26 కోట్లు మాత్రమే . అంటే జనాభా లో కేవలం 22% వ్యవసాయ రంగం లో పని చేస్తున్నారు .

వ్యవసాయం రంగం తో పాటు అనుబంధ శాఖ లైన పౌల్ట్రీ ,చేపలు ,డైరి ,పూలు పండ్ల  రంగం కూడా లెక్కిస్తే 60 కోట్ల మంది వీటి పై ఆధార పడి  ఉన్నారు .

Monday 28 July 2014

బంగారు తెలంగాణా గా మారడానికి సింగరేణి ఓ వరం .

1. సింగరేణి కాలరీస్‌కు చెందిన గనులలో మొత్తం 22,200 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. ఇందులో ఇప్పటివరకు 1,200 మిలియన్‌ టన్నుల  బొగ్గును మాత్రమే వెలికితీశారు. 
2. ఒక మిలియన్‌ టన్ను బొగ్గు నిల్వలు ఉన్న గని ఖరీదు సుమారు 10  కోట్ల రూపాయలు . అనగా సింగరేణిలో  ప్రస్తుతం ఉన్న 21 వేల మిలియన్‌ టన్నుల నిల్వల విలువ సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు .  ఇందులో కేంద్రం వాటా 49 శాతం. 

Wednesday 16 July 2014

ధర్మ కర్మ సాధన

ధర్మం అనగా ధరించేది అని అర్ధం . ఈ చరాచర ప్రపంచాన్ని ధరించి ఉన్న  చైతన్య ప్రవాహం నే దైవం అని వ్యవహరిస్తాం . ధర్మం దేశ ,కాల స్థితులకు అతీతం గా ఉంటుంది . అది ఒక సుస్థిర మైన ,అమరమైన స్పందనా రాహిత్య స్థితి . అదే సత్యం . ఎందుకంటే అది మారేది కాదు . అదే ఆనందం .   చిన్నపదంలో చెప్పా లంటే  అదే -ఓం తత్సత్ . 
అలాంటి స్పందనా రాహిత్య చైతన్యం లో ఒక్క శాతం నుండి మాత్రమే అపరా ప్రక్రుతి వ్యక్త మవుతుంది . మిగతా 99% అవ్యక్తం గా ఉంటుంది .
భౌతిక స్థాయిలో సుఖాల వలన కలిగేది సంతోషం ,దుఖాల వలన కలిగేది విచారం . సుఖ దుఖాలకు అతీతం గా ఉన్న స్పందనా రాహిత్య స్థితి ఆనందకరం  అని ఋషి వాక్యం .

దైవం = స్పందన (vibration) లేని చైతన్యం  = అవ్యక్తం = పరా ప్రక్రుతి .
మనిషి కంటికి , కె మేరాలకు ,దూరదర్శిని లకు ,ఇంకా ఎన్నో అధునాతన పరికరాలకు అందే విశ్వం ,చరాచర ప్రాణులు  = వివిధ స్థాయిలలో స్పందించే చైతన్యం  = వ్యక్తం = అపరా ప్రక్రుతి .

దైవం = 99% పరా ప్రక్రుతి + 1% అపరా ప్రక్రుతి .

సాధన ద్వారా మనిషి పరిణామం :
కంటికి కనపడే వాటి పై మోజు పెంచుకొని , "నేను -నాది ' అనే చైతన్యం తో  భౌతిక స్థాయిలో ఉన్న మనిషి   వివేక వైరాగ్య అభ్యాసాలతో  క్రమేణా చైతన్య పరిధిని విస్తరించు కొంటూ ఇంద్రియాలను , ఆలోచనలను ,చిత్త వాసనలను అధిగమిస్తూ  ఆ క్రమం లో మోహ బంధాలను తెంచు కొంటూ -"నేను(అహం ) అనేది మిధ్య - నా నిజమైన స్థితి ఆత్మ స్థితి " అని అనుభూతిస్తూ చివరికి ఈ ఆత్మ కూడా పరమాత్మలో ఓ శకలం ' అని అనుకొంటూ చిట్ట చివరికి అపరా ప్రక్రుతి ,పరా ప్రక్రుతి అన్నీ ఒక్కటే ' అనే స్థితికి చేరుకొంటాడు . ఈ సాధనే మనిషి అసలైన  ధర్మం. ఈ పరిణామ ప్రక్రియే అసలైన కర్మ .  


సనాతన లేదా అసలైన లేదా అమరమైన ధర్మ మంటే --- సంప్రదాయాలు , ఆచారాలు , మత విశ్వాసాలు ,పాప పుణ్యాలు ,మంచి చెడ్డలు ,వర్ణాశ్రమ  మరియు నిత్య నైమిత్తిక కర్మలు కావు . ఇవి మనం సంఘ శాంతి కోసం , మానవ సంబంధ బాంధవ సౌలభ్యం కోసం ,ప్రక్రుతి రక్షణ కోసం ,చిత్త శాంతి కోసం ఏర్పాటు చేసుకొన్న నీతి నియమాలు .
అలా అని వీటిని నిర్లక్ష్యం చేయ కూడదు . ధర్మ సాధన కి పని కొచ్చేవీ ధర్మమే . అందుకే  అంతిమ ధర్మాన్ని పొందా లంటే ఈ విలువలు  కూడా అవసరమే .

(Duty & responsibility)కర్తవ్యం ,బాధ్యత ,అనేవి  వ్రుత్తి పరం గా ,బాంధవ్యాల పరం గా ,పదవుల పరం గా ,ప్రవ్రుత్తి పరం గా  ఆయా దేశ కాల మాన పరిస్థితులకు అనుగున్యం గా చేయ వలసిన కర్మలు .

ప్రతి ప్రాణి కర్మ చేయకుండా మనలేదు . చిత్తం లో ఒక సంకల్పం పుట్టిందీ అంటే అదీ కర్మే . చిత్త  కర్మ .
మనస్సులో ఒక ఆలోచన మొదలయ్యిందీ అంటే అదీ కర్మే . మానసిక కర్మ .
ఒక మాట పలికాము అంటే అదీ కర్మే . వాచిక కర్మ .
శరీర స్థాయిలో అసంకల్పిత చర్యలూ (autonomous actions like digestion,respiration,circulation,cell energy metabolissm,etc...) కర్మే .

కర్మ ద్వారా ధర్మ సాధన ఎలా ? 
కర్తృత్వ భావన లేకుండా , చేసే పనిలో కుశలత ,చేసిన పని నుండి వచ్చే ఫలితం పై నిరాసక్తి ,ఏ  పని చేసినా భగవద్ సేవ గా ,ఎలాంటి ఫలితం వచ్చినా దైవ ప్రసాదం గా ,సంపూర్ణ శరణాగతి -శ్రద్ధతో -ఎలాంటి పనిచేసినా అది ధర్మానికి దారితీస్తుంది .

"మోహ బంధ నాశనం మనిషి సాధనా లక్ష్యం 
మాయా విచ్చిన్న మోక్షం మనిషి జన్మ గమ్యం " . 

Thursday 5 June 2014

నూతన రాష్ట్ర నిర్మాణానికి నడుం కట్టిన ఆంద్ర జాతికి నమస్కారం .

సోనియా కాంగ్రెస్ చేసిన దుర్మార్గపు రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర మొత్తం రగిలిపోయింది.

పచ్చని ఆంధ్ర రాష్ట్రాన్ని విడ దీయడం  భౌగోళికం గా ,వనరుల పరం గా చాలా కష్టం. ఆత్మ హత్యా సద్రుశ్యం.అభివ్రుద్ది పట్టాల పై దూసుకు పోతున్న రాష్ట్రాన్ని ఆపి అడ్డం గా నరికేసి మీ చావు మీరు చావండని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది సోనియా కాంగ్రెస్.

విడదీస్తే ఎవరికి వారు ఇంకా బాగా బతుకుతారనే వాదం ఉంది.అలాగే ఎక్కువ మంది రాజకీయ నాయకులకు మంచి అధికార అవకాశాలు  వస్తాయనే దురాశ ఉండనే ఉంది .

రాష్ట్ర విభజన సోనియా కాంగ్రెస్ కల్పిత ఉత్పాతం .
ఆస్తులు అప్పులు,ఉద్యోగులు,విద్యుత్,నీళ్ళు,విద్యా - వైద్య సంస్థలు,ప్రాజెక్ట్ లు ఎలా పంచాలో కూడ తెలీని కేంద్ర వ్యవస్థ, తమ బుర్ర తక్కువ చేష్టలతో తెలుగు జాతి మధ్యన చిచ్చు పెట్టింది.

ఆక్రోశంతో ,అభద్రతా భావంతో రగిలిపోతున్న ఆంధ్ర యువత పెడ దారి పట్టి బ్రష్ట్టు పట్టకుండా కాపాడ గలిగే నాయకుడు చంద్ర బాబే అని నమ్మి తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం.

సమయానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు సమన్యాయం అనే ఒక సకారాత్మక ద్రుక్పధం వలన ఆంధ్ర జాతి యువత  లొ చిచ్చు రేగిన  దేశ విచ్చిన్న వాదం,వేర్పాటు భావం సద్దుమణిగి  మరల దేశ జన జీవన స్రవంతి లో కలిసిపోయి,జరిగిన అన్యాయాన్ని దిగమింగి,సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాంగ్రెస్ చేసిన అరాచకాన్ని అరికట్టగలదు,అభివ్రుద్దికే అంకితమైన చంద్రబాబు ఒక్కడే సమర్ధ మైన నాయకత్వం తో నడిపించ గలడు అని అనుకొని, తమ సొంత రాష్ట్ర పునర్నిర్మాణం పై ద్రుష్టి పెట్టారు.
ఈ సందర్భం గా మనందరమూ సంఘీభావం తో ఉండి రాష్ట్రాన్ని నిర్మించు కొందాం .


Tuesday 3 June 2014

Road Map for swarnaandhra !

80000 కోట్ల అప్పు,ఏటా 15000 కోట్ల లోటు బడ్జెట్ ,2000 MW విద్యుత్ కోత ,గుండె కాయ లాంటి రాజధాని కొరత -ఇవన్నీ మనకొచ్చిన తిప్పలు . 
ఇంత  అధ్వాన్న స్థితిలో  కొత్త ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టి ఎలాంటి కష్టానికైనా వెరవక ముందుండాలి . 
  • 13 జిల్లాలను విభజించి 25 జిల్లాలుగా  పెంచాలి .
  • 175 నియొజక వర్గాలను 250 కి పెరిగే టట్లు  పునర్వ్యవస్థీకరించాలి .
  • ప్రతి జిల్లాలొ లభ్య మయ్యే వనరుల ఆధారం గా మధ్య తరహా లేదా భారీ పరిస్రమలు స్థాపన చేయ డానికి - దేశ విదేశ వ్యాపార సంస్థ లతొ చర్చలు ప్రారంభించాలి . 
  • విద్య -వైద్య -ఉద్యొగ కల్పన - వీటికి నిపుణులతొ రోడ్ మాప్ తయార్ చేయించాలి . 
  •  ఉచిత నిర్బంధ ప్రాధమిక విద్య , నిర్బంధ ఓటు హక్కు  ప్రవేశ పెట్టాలి . 
  • గ్రామాలలో మొబైల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వర్తించాలి . 
  • భూ కమతాలను,అటవీ భూమిని,ప్రభుత్వ భూములను  పూర్తిగా సర్వే చేసి డిజిటలైజ్ చేయాలి . 
  • మైనింగ్ గనులను ,ఇసుక , సముద్ర  తీరాన్ని ,ఎర్ర చందనం ,జాతి రాళ్ళ గుట్టలను,పూర్తిగా సర్వే చేసి డిజిటలైజ్ చేయాలి . 

ముఖ్యం గా కొత్త రాజధానిని నిర్మించాలి . 
                                                                              స్మార్ట్ సిటీ నిర్మాణానికి ఒక నమూనా :
  • 25000 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు 100 ఎకరాల స్థలంలో 25000 ఎపార్ట్మెంట్స్ నిర్మించ వచ్చు.దానిలోనే క్లబ్,ఇతర క్రీడా సదుపాయాలు,హస్పిటల్, వాకింగ్ ట్రాక్,గ్రొసరీ మాల్,కల్పించ వచ్చు.
  • 100 మంది మంత్రులు,350మంది శాసన సభ్యులకు 500 ఎపార్ట్మెంట్స్ కావాలి- వీటికి 50ఎకరాలు కావాలి. 
  • క్లరికల్ మరియు మిగతా సిబ్బందికి సుమారు 1000 ఇళ్ళు కావాలి. వీటికి మరో 50 వ్కరాలు అవసరం.
  • 10000 మంది పోలీస్,5000 మంది స్పెషల్ ఫోర్స్,వారికి కావలసిన ట్రైనింగ్ అకాడమీలు,నిత్యం వినియోగించే క్రీడా మైదానాలకు -200 ఎకరాలు కావాలి.
  • రాజ్ భవన్,రాష్ట్రపతి ఆతిధ్యానికి,ప్రధాన మంత్రి మరియు ఇతర కేంద్ర మంత్రులకు మరో 25 ఎకరాలలొ విల్లాలు నిర్మించాలి.
  • వివిధ రాష్త్ర ప్రతినిధులకు, వివిధ దేశ కాన్సులేట్ లకు 20 అంతస్తుల బిల్డింగ్ అవసరం. దీనికి 10ఎకరాలు కావాలి.    
  • అలాగే చట్ట సభలు -శాసన సభ,కౌన్సిల్,సెక్రటేరియట్ ,5000 మందికి సరిపడా ఆడిటోరియం, విడియో కాంఫరెన్స్ హాలులు,2 హెలిపాడ్ లు - వీటన్నింటికీ 200 ఎకరాలు కావాలి.
  • కేజి నుండి పిజి వరకు విద్యా సంస్థలు, 4 హాస్పిటల్స్- వీటికి సుమారు 300 ఎకరాలు కావాలి.
  • 5 వన్ స్టార్ హోటల్స్,రెండు 3-స్టార్ హోటల్స్,10 రెస్టారెంట్స్,10 సినిమా హాళ్ళు,ఇంకా ఇతర వినోద సౌకర్యాలకు,పెద్ద క్రీడా స్టేడియం- వీటికి సుమారు 100ఎకరాలు కావాలి. 
  • సోలిడ్ వేస్ట్,లిక్విడ్  వేస్ట్ శుద్ది చేసే ప్లాంట్స్,వాటర్ ప్లాంట్స్,రోడ్స్, మొదలగు వాటికి -500 ఎకరాలు. 
అనగా సుమారు 1500 ఎకరాలు ఉంటే మనమూ రాజధాని నగరం నిర్మించు కోవచ్చు.

డబ్బు జబ్బు చేసిన ఎలచ్చన్ లు

రాజకీయాల్లో ఎంతో సులువుగా డబ్బు సంపాదించవచ్చునని 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేసి చూపించింది. ఒక రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఇంత  భారీ స్థాయిలో అవినీతి ఊడ లు దింపి వ్యవస్థలను అల్లకల్లోలం చేయ వచ్చా అనేది అందరికీ అర్ధం కాని విషయం . భారత  దేశ అవినీతి చరిత్రలో ఓ రికార్డ్ . 
ఇప్పుడు  అదే అందరికీ ఆదర్శంగా మారింది. అధికారం ఉంటే విచ్చలవిడిగా డబ్బు సంపాదించవచ్చునన్న ఉద్దేశంతో ఎన్నికల్లో అంతే విచ్చలవిడిగా ఖర్చు చేశారు. 
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ప్రభుత్వ భూములు దండిగా ఉన్నాయి. కనుక ఏవో దందాలు చేసి డబ్బు సంపాదించవచ్చునని తెలంగాణ నాయకులు ఆశ పడుతుండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి అవకాశం లేదే? ప్రభుత్వ ఆదాయం చూద్దామా అంటే లోటు బడ్జెట్‌తో దినదిన గండంగా బండి నడపాల్సిన పరిస్థితి. 
మరి ఎందుకు సీమాన్ధ్రలో కూడా ఇంట భారీగా ఖర్చు పెట్టారు ? 

Friday 30 May 2014

రాజధాని పరం గా ,ఆదాయం పరం గా ,కాలేజీ సీట్ల పరం గా ,ఉద్యోగాల పరం గా ,విద్యుత్ కేటా యింపుల పరం గా ,ఆస్తులు అప్పుల పంపకాల పరం గా సీమాంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దండి ...

  • సెక్రటేరియట్ లో రాష్ట్ర కేడర్ పోస్ట్ లు ఎన్ని ఉన్నాయి ? కేవలం 4417 పోస్ట్ లు .
  • మొత్తం సంయుక్త రాష్ట్రం లో  రాష్ట్ర కేడర్ పోస్ట్ లు ఎన్ని ఉన్నాయి ? 90000 పోస్ట్ లు .
  • అన్ని పోస్ట్ ల లో ఉద్యోగులు ఉన్నారా ? లేరు . 27000 పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి .నికరం గా 47186 రాష్ట్ర కేడర్ ఉద్యోగులున్నారు . 

  • రాష్ట్ర కేడర్ ఉద్యోగులను ఎలా విభజించారు ? 24838 ఉద్యోగులను ఇప్పుడు ఎక్కడ ఎలా పనిచేస్తూ న్నారో అలాగే ఉంచారు . 12,361 మందిని కొత్త ఆంధ్రా కి , మిగతా  9,987 మందిని తెలంగాణా కి పంచారు . అంటే జనాభా ప్రాతి పధికన 58:42 నిష్పత్తిలో పంచారు . అనగా సుమారు 25000 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు కొత్త ఆంధ్ర రాజధానిలో నివాస సౌకర్యాలు ఏర్పరచాలి . 

  • మొత్తం సంయుక్త రాష్ట్రం లో  ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు ? 11 లక్షలు .
  • లోకల్ -నాన్ లోకల్  అని ఎలా నిర్ణ యిస్తారు ? వరుసగా 4 ఏళ్ళు ప్రాధమిక విద్య ( 4 నుండి 10 క్లాస్ వరకు) ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికి చెందినా వారిగా గుర్తిస్తారు .
  • నేటివిటి -స్వస్థలం ఎలా నిర్ణ యిస్తారు ? పుట్టిన ప్రదేశాన్ని బట్టి . తెలంగాణా ఉద్యోగులు నేటివిటి ని బేస్ చేసుకొని విభ జించ మంటుంటే ,సీమాంధ్ర ఉద్యోగులు లోకల్ స్టేటస్ ని బట్టి విభ జించ మంటున్నారు .
  • రాజధానిలో ఎన్ని రకాల రాష్ట్ర కేడర్ పోస్ట్ లు / ఉద్యోగులు ఉంటారు ? 
సెక్రటేరియట్ , డైరెక్టరేట్ ,కార్పోరేషన్ లకు సంబంధించిన వారు .
  • సీమాంధ్ర ఉద్యోగులు ఎందుకు బాధ పడుతున్నారు ?
10ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఉండే అనుమతి ఉన్నా , కొత్త సీమాంధ్ర ముఖ్య మంత్రి వేరే చోట రాజధాని నిర్మాణం చేస్తే , సొంత ఇళ్ళు వదిలేసి కొత్త రాజ ధాని కి  వెళ్లి పోవలసిందే అని .

జనాభాని బట్టి ఆస్తులు అప్పులు పంచారు . కానీ విద్యుత్ ని మాత్రం వాడకాన్ని బట్టి పంచుతున్నారు ! ఇదెక్కడి న్యాయం ? 
ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 16000 MW విద్యుత్ మరియు కొత్తగా రాబోయే విద్యుత్ ప్రాజెక్ట్ ల ద్వారా ఉత్పత్తి అయ్యే 4000 MW ల విద్యుత్   లో 54 % తెలంగాణ కి ,46% ఆంద్ర కి ఇస్తున్నారు .
అలాగే అంతర్ రాష్ట్ర కరెంటు సరఫరా ని ఏ  విధం గా ఆజమాయిషీ చేయాలో కేంద్రం చెప్పడం లేదు . ఇది ఇరు రాష్ట్రాల మధ్య గొడవలకు దారి తీస్తుంది . 

అటు విద్యా సంస్థ ల పంపకాలలో కూడా ఆంద్ర కి అన్యాయం జరుగుతుంది . 

ఇప్పటికే తెలంగాణా లో ఉన్న అంతర్జాతీయ   స్థాయి   విద్యా సంస్థలు - ISB,NALSAR,NIFT ,ICFAI  -లాంటివి కొత్త సీమాన్ధ్రలో ఏర్పరచా లంటే ఎంతో  సమయం,డబ్బు కావాలి .

కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు తప్పుకి చెల్లించిన మూల్యం అధికారం కోల్పోవడమే . కానీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య రాచేసిన రావణ కాష్టం కారణం గా , త రతరాల తెలుగు సోదరుల బతుకు బండ లవుతుం ది.
ఇది రాజకీయ నాయకుల వికృత క్రీడ . 

Thursday 29 May 2014

శ్రీ కేసీఆర్ కి చిన్న మెమో

1. రాష్ట్రాన్ని విడదీయా లంటే  రాష్ట్ర చట్టసభల ఆమోదం, అభిప్రాయం సేకరించాల్సి ఉంటుందని ... ఆ తర్వాతే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించాల్సి ఉంటుందని - ఆంద్ర రాష్ట్రాన్ని దారుణం గా విడ గొట్టినప్పుడు సోయ లేదా    శ్రీ కేసీఆర్ గారు ?
2. ఇంకా అధికారికం గా తెలంగాణ ఏర్పడ లేదు . కాబట్టి తెలంగాణ  చట్ట సభ ఆమోదం అనే ప్రశ్న ఎక్కడిది సర్  ? 
3. సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని గేలి చేసి మీ పబ్బం గడుపు కొన్నప్పుడు రాజ్యాంగం గుర్తు రాలే  శ్రీ కేసీఆర్ గారు ?
4. సమైఖ్యాన్ధ్రుల లక్షల కోట్ల  కష్టార్జితం హైదరాబాద్ నుండి ఉన్నఫళం  గా సీమాన్ద్రులను వెళ్ళ గొట్టాలనే  పిలుపు నిచ్చిన మీ కు గిరిజనులను గురించి మాట్లాడే అర్హత ఉందా శ్రీ కేసీఆర్ ?
5. హైదరాబాద్ లోని  150 మండలాలు దోచుకొని మీసాల్ మెలేసి న మీరు, పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్ దృష్టి లో కేవలం 7 మండలాలను ఆంధ్రలో కలిపితే, సూదిమొన ప్రాంతాన్ని కూడా వదలుకోమని శత్రు దేశం లెక్క హుంకరిస్తారా  శ్రీ కేసీఆర్ ?
6. సరే సుప్రీం కోర్ట్ కి వెళ్ళి తేలుస్తానంటున్నారు ...అలాగే చేద్దాం. మెజారిటీ ప్రజలను వారి రాజధాని నుండి ఎలా తరిమేస్తారో ,10  ఏళ్ల  పాటు మాత్రమే హైదరాబాద్ ఉమ్మది రాజధాని ఎలా చేస్తారో,ఆంధ్ర ప్రదేశ్ అస్సెంబ్లి ఆమోదం లేకుండా రాష్త్రాన్ని ఎందుకు చీల్చారో అది కూడా తేలుద్దాం .

Saturday 24 May 2014

An open letter to Sri Narender damodardas Modi -PM-INDIA.

Respected sir
i wish,the history of our nation takes a turn for good, with your  presence in the seat of PM. Mahatma gandhi and many stalwarts of our nation including abdul kalam ji proclaimed about gram swarajya'. 
In this context and out of eagerness,i submit my suggestions humbly for your kind consideration as follows.


1. commissioning of "mobile farm produce buying vehicle" manned with quality checking machine,smart  phone to display the current market movements. this vehicle -(a lorry) can commute to the farm fields and there it self the person belonging to concerned authority can buy the produce after explaining the current market trends and govt's supporting price,etc... and make payment by check on the spot and enter the transaction details in the smart phone to send it to the district and state server.
it will prevent the hard hassles now faced by farmers at market yards.
2. construction of paddy&pulses storing granary(prefabricated using HD plastic or cement),mini cold storage kiosks in each and every village with the partnership of "village farmers commune" or NGO or in Public private partnership.
3. seed procurement at village level by "village farmers commune".
4.establishing the house or micro-industries in every village depending on the availability of resources- mills dealing with pulses,paddy,cotton,maize,jowar,millets,red chilly,coconut,etc...
5. Forming  "village workers commune" in every village to be contacted by farmers,industrialists and NREGE for their work.
6. consider and study for the prospects to establish"PURA"s in every mandal/taluk.(Sri A.P.J.Abdul kalam ji's suggestion)
7.DWACRA, village workers commune and village farmers commune can amalgamate as one society to run microfinance,mutual benefit schemes and enter in to various types of insurances as group- crop,health,life,childrens education,disaster loss,etc...
8.commissioning of chain of mobile virtual labs for school&college students.
9. commissioning of healthcare on net (Mobi-health) -telemedicine- telediagnostics,teleinterpretation,teletreatment to facilitate right medicine in right time at the doorsteps of the people.
10.All PHC s must be manned by 3 MBBS doctors,1 Dentist, 1 AYUSH physician, 6 ANMs, 3 MPHW,x-ray technician,lab technician and 3 nurses and having storage facility for blood,essential medicines,vaccines and facilities for emergency resuscitation.
11. school children can participate/involve to get hands-on training in farm field work,post office,banks,hospitals,police stations,market yard,near by industries to develop awareness and aptitude.
12. the colleges near to villages, can monitor the parameters of village development  and the collegiates can submit their monthly or quarterly reports to near by mandal or district authorities.
13.commissioning of renewable energy resources' in every village - solar,wind mill,biomass,tidal,biodiesel -depending on availability and cost index.
14.free distribution of LED bulbs to all households in village.free commissioning of capacitors and remote monitors using simple cheap  feature phone for all agri pump sets.
15.using hydrophonics technology every village household can grow fodder crop in their houseyards.the govt can create the awareness and distribute the needy equipment at 50% subsidised cost.
16.Control and Regularise all statues (except of freedom fighters and renowned persons of yester era) erected in our country  on or after 1975, by slapping Rs.1000/- per anum.
Thank you

Friday 23 May 2014

పోలవరం ..నిజమ్ గా వర మేనా ?

కృష్ణమ్మ ని గోదారి తల్లిని ముడి వేసే ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ , అదేనండి  'పోలవరం వలన లాభం ఉందా ? 
నౌకా యానం తో పాటు అన్ని ప్రయోజనాలు ఒన కూడే టట్లు దీని డిజైన్ మార్చి ఇంకా చౌకలో ,తక్కువ సమయం లో  పూర్తీ చేసే అవకాశం ఉందా ? 
అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవ్ తుంది ?
ఈ ప్రాజెక్ట్ వలన ఎవరు ఎలా ప్రభావితం అవుతారు ?

నష్ట పోయే వారు : 

  • ఎగువ పాటు లో ఉన్న 3 రాష్ట్రాల వారు - ఒడిశా ,చత్తీస్ ఘడ్ మరియు ఖమ్మం జిల్లాలో (తెలంగాణా ) ఉన్న భూభాగం ముంపు వలన కొండ రెడ్లు నిర్వాసితు లవ్వడమే కాదు వారి తరతరాల జీవనోపాధిని కూడా కోల్పోతారు.
  • గత కొంత కాలం గా ఏటికి ఏడు ,వరద నీరు అపరిమితం గా పోటెత్త డం వలన మట్టి తో కట్ట బోయే పోలవరం డాం వలన ,దిగువన ఉన్న గోదావరి డెల్టా వారికి ముంపు ప్రమాదం . 

లబ్ది పొందే వారు :

  • గోదావరి ,కృష్ణా డెల్టా పొలాలకు రబీ కాలం లో నికరమైన సాగు నీరు లభ్యత .
  • రాయలసీమకి కొద్దిగా సాగునీరు ,వైజాగ్ కి త్రాగు నీరు ,పరిశ్రమలకు నీరు లభ్యత .
  • ఆంద్ర రాష్ట్రానికి 1000 MW విద్యుత్ లభ్యత . 
  • గోదావరి లో నౌకా యాన వృద్ది . 

కొన్ని ప్రశ్నలు ?

  • 18000 కోట్లకి బదులు  కేవలం  8000 కోట్లతో నే ,ఎలాంటి ముంపు సమస్యలు , అంతర రాష్ట్ర వివాదాలు లేకుండా , పోలవరం ప్రయోజనాలు అన్నీ ఒన కూడితే ఎవరి కైనా అభ్యంతరమా ?
  • 75 TMC ల నీరు నిలవ చేసే మట్టి డాం కన్నా 30 TMC ల నీరు నిల్వ ఉంచే 3 చిన్న బారేజీలు కట్టుకొని కూడా అన్ని ప్రయోజనాలు చక్కగా చౌకలో ,తక్కువ సమయం లో పొందే అవకాశం ఉంటే ఎవరైనా వదులు కొంటారా ?
  • 750 km పొడవు ఉన్న గోదావరి నది పై ఒక క్రమ పద్దతిలో చిన్న చిన్న బారేజీలు కడితే ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు పోరుపెడుతున్నా కేవలం కాంట్రాక్ట్ పనులను పందేరం చేయడానికి భారీ డాం లు ప్లాన్ చేశారా ? 
  • ఉదాహరణకు ,అమెరికాలోని మిసిసిపి నది పై 27 బారేజీలు కట్టి  భారీ నౌకా యానం కూడా అమలు చేస్తున్నారు .అలాగే గోదావరి పై కూడా 3 బారేజీలు ఎందుకు కట్ట కూడదు ? 
మరి కొంత సమాచారం :

  • ప్రాజెక్ట్ స్థలానికి అనుమతి ? - 2005 లో వచ్చింది . 
  • పర్యావరణ అనుమతి ? - 2005 లో వచ్చింది . 
  • పాపికొండల అభయారణ్యం అనుమతి ? - 2005 లో వచ్చింది . 
  • గిరిజనులకు  నష్ట పరిహారం ,భూమి,ఇళ్ళు ,ఉపాధి చూపే అనుమతి(R&R CLEARANCE ) ? - 2007 లో వచ్చింది . 
  • కేంద్ర నీటి యాజమాయిషీ (central water commission )అనుమతి ? -2009  లో వచ్చింది . 
  • ప్రాజెక్ట్ పై పెట్టుబడికి ప్లానింగ్ కమిషన్ అనుమతి - 2009 లో వచ్చింది(25.02.2009 for Rs. 10151.04 Crore ). 
  • చత్తీస్ గడ్ , ఒడిశా లో ముంపు ప్రాంతాల ప్రజల సాధక బాధలను విని(public hearings) ,ఆయా ప్రాంతాలలో వరద గట్లు (flood banks) పటిష్టం చేసే   దెప్పుడు ? - చత్తీస్ గడ్ , ఒడిశా ఒప్పు కొన్నప్పుడు  . 
  • ప్రాజెక్ట్ కి ఎంత  ఖర్చు అవుతుంది ? - 16000 కోట్లు . 
  •  గత 10ఏళ్లలో జరిగిన కాల్వల పనులకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు ?- 4000 కోట్లు 
  • ప్రాజెక్ట్ లో చేయ వలసిన పనులే మిటి ?- 75 TMC ల నీళ్ళు నిల్వ చేయడానికి గోదావరి నది కి అడ్డుగా 45 మీటర్ల ఎత్తు ,సుమారు 2 km పొడవు డాం , దీనికి అనుబంధం గా 1000 MW విద్యుత్ ఉత్పాదన , కుడి ఎడమ కాల్వ ల ద్వారా గోదావరి ,విశాఖ జిల్లా లలోని 7 లక్షల ఎకరాలకు గారం టీ నీరు ,అలాగే ప్రకాశం బారేజి కి  80 TMC ల నీరు . 
  • ఎంత మంది నిర్వాసితు లవుతున్నారు ? - సుమారు 250 గ్రామాలు, 2 లక్షల జనం డాం వలన ; 15000 ఇళ్ళు 50000 జనం కాల్వల వలన నిర్వాసితులు అవుతారు . 
  •  మీరు చెపుతున్న 7లక్షల ఎకరాలలో మూడొంతుల భూమికి అంటే  5లక్షల ఎకరాలకు ఆల్రెడీ 1999 నుండిసాగు నీరు అందుతుంది గదా ? మరి ఇంత  ఖర్చు పెట్టి కడుతున్న ఈ ప్రాజెక్ట్ వలన కొత్తగా  ఏమైనా లాభం ఉందంటారా ? -కుడి కాల్వ ద్వారాసుమారు 1 లక్ష ఎకరాలకు కొత్తగా సాగునీరు, మరో  2లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ; ఎడమ కాల్వ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ;
  • ఇప్పటికే , పుష్కరం ,తాడిపూడి ,చాగల్నాడు ,ఏలేరు ,తొర్రిగెడ్డ  పంపింగ్ స్కీమ్ ల ద్వారా సాగు చేయ బడుతున్న గోదావరి ,విశాఖ పొలాలకు గారంటీ సాగునీరు అందే అవకాశం . 
  • ఏది ఏమైనా డాం మాత్రం  ఉదృతం గా వచ్చే వరద నీటి( మాక్సిమం 250,000 cumecs ) ని తట్టు కొనే విధం గా ఉండాలి . కానీ ప్రస్తుత డిజైన్ మాత్రం కేవలం 10000 cumecs  కి సరిపోతుంది . ప్రభుత్వం ఈ  విషయం సరి చూసుకోవాలి . అలాగే డిజైన్ మార్చి తక్కువ వ్యయం ,తక్కువ టైం లో అన్ని ప్రయోజనాలతో ప్రాజెక్ట్ పూర్తి అయ్యే అవకాశం ఉందేమో మరొక్కసారి సాంకేతిక నిపుణులతో ఆలోచించాలి. 

Wednesday 21 May 2014

శివోహం ... చిదంబరం

File:Chidambaram Shiva.jpg 

ఈ మధ్య నేను చిదంబరం వెళ్లి నటరాజ స్వామిని దర్శనం చేసుకొన్నా .
పై నున్న చిత్రం లో 'సత్య జ్ఞాన సుందర ఆనంద స్థితికి'  నటరాజ ఆకార మిచ్చి ,శక్తి కి శివకామి అని పేరు పెట్టి , నిరాకానికి గుర్తుగా ఓ చిన్న స్ఫటిక లింగం,  ప్రక్కనే ఉన్న బిల్వ దళ పరివేష్టిత యంత్రమే ఆకాశ తత్వానికి సంకేతం గా అన్వయించి- కొలిచే గర్భా లయ విమానం బంగారు పూతతో  ప్రకాశిస్తూ పొన్నాంబలం గా వినుతి కెక్కింది . 
ఇంకా వ్యాఘ్ర పాదుడు ,పతంజలి మహర్షి సన్నుతి చేస్తుం టే ,నటరాజు అవిద్య ని అదిమి,  ఇచ్చ -జ్ఞాన - క్రియా శక్తి రూపమైన శివకామి తో కలిసి ఈ సకల  చరాచర సృష్టి ని పుట్టిస్తూ ,పోషిస్తూ ,లయం చేస్తూ జనన మరణ మోక్ష చక్రాన్ని నడుపుతున్నాడు . 

మీకు తెలుసు ,తమిళ నాడు అంటే శివ మయం . 63 నాయ నార్లు , 18 సిద్ధ పురుషులు ప్రకటిత మై అణువ ణువు శివోహం గా సన్నుతి చేసిన పుణ్య దేశం .
 సంగమ కాలం లో ని  సంగం సాహిత్యం లో  ముఖ్యం గా సంబంధర్,సుందర్,అప్పర్  వ్రాసిన  తేవారం , అలాగే మాణిక్య వాచికర్ వ్రాసిన తిరువాచికం లో చిదంబర నటరాజ స్వామి  స్తోత్రం లు   ఉంటాయి .

 పంచ భూత లింగాల వరుసలో చిదంబరం ఆకాశ తత్వాన్ని ప్రభోదిస్తుం ది .
కాళ హస్తి ,కంచి , చిదంబరం గుళ్ళు మూడు ఒకే వరుసలో ( a straight line exactly at 79 degree 41 minutes East longitude ,other wise called as divine axis) ఉంటాయి . 
ఈ భూ మండలం లో కొన్ని ప్రదేశాలు దైవ శక్తి కి ప్రేరణా మరియు ప్రకటిత మయ్యె స్థలాలుగా ఉంటాయి . 
అలాంటి శక్తి స్థానముల నే 'తీర్ధములు ' అంటాము. 

అమాయకత్వం వేరు . అవిద్య వేరు . సరళం గా చెప్పా లంటే మూర్ఖత్వమే అవిద్య .
ప్రతి విషయములో  అహం తో మమేక మవ్వడం అవిద్య .
మన కళ్ళకు కనిపించేదే సత్యం అనుకోవడం అవిద్య .

  మన మూల ప్రక్రుతి సత్య జ్ఞాన ఆనందం అనీ , మిగతావన్నీ మన మనస్సు (-మాయ) ఆడించే కల్పితాలనీ తెలుసుకోవడమే శ్రీవిద్య .
'దుఃఖాలన్నీ కల్పితాలే.., ఆనందమొక్కటే సత్యం'. 
కల్పితాలంటే మనిషి కావాలని(మాయలో పడి ,మొహం లో పడి ,బంధం లో చిక్కి ) చేసినవి. తన స్వార్థంతో, విద్వేషంతో కుత్సిత బుద్ధితో, క్రూర మనస్తత్వంతో చేసినవి . 
శివం :
ప్రతి పర మాణువు , అలాగే క్వార్క్ లు ఇవన్నీ నిత్యమూ స్పందన లోనే ఉంటాయి . 
శక్తిని ధరించి శక్తిని పంచి ఈ సర్వ సృష్టి స్థితి లయములకు ఆది మూలం పరమ శివుడు . 
ధ్వని శక్తి , కాంతి శక్తి , స్థితి శక్తి ,గతి - చలన శక్తి ,ఐస్కాంత శక్తి ,విద్యుత్ శక్తి , ఫోటాన్ శక్తి ,అణు శక్తి -ఇవన్నీ వేర్వేరు గా స్పందించే స్పందనలే . 
శివారాధన ?
శరణా గతి లేని ప్రార్ధనలు ,ఆరాధనలు , క్రతువులు,మంత్ర సాధన ,జప తపాలు అన్నీ నిరర్ధకం . 
వాటి వల్ల మోక్షం కలుగదు. 
హిందూ దేవాలయాల్లో శుభ్రత ? 
 ఏ గుడి చూసినా ,ఆ గుళ్ళకు ఎన్ని మడులు మాన్యాలున్నా శుచీ శుభ్రత లేకుంటే సామాన్యుడికి నచ్చదు . 
ఆధ్యాత్మిక మార్గం లో ఉన్న వారికి ఎలాగున్నా నచ్చుతుంది . ఎందు కంటే వారు చూసేది వేరు . 
40 ఎకరాలలో కొలువై  ఉన్న చిదంబర దేవాలయం స్వామికి 5000 ఎకరాల పొలం ఉంది. 

నిజమైన భక్తుడు దైవం పట్ల తన కృతజ్ఞత ని ప్రకటించు కోవడానికి గుడికి వస్తాడు. ఆ కృతజ్ఞతా భావా న్నే భక్తి అంటాము .  
ప్రార్ధన ,నాట్యం ,సంగీతం ,పంచోపచార పూజ ఇలా వివిధ పద్దతుల (ఆగమ శాస్త్ర విధానాలు లేదా వైదిక క్రతువులు) లో తనలోని భక్తీ ని శరణా గతి భావం తో సమర్పణ చేస్తాడు . 
చిదంబరం లో దీక్షితార్ లు అనే వారు ఆలయ పర్య వేక్షకులుగా ,పూజార్లుగా వైదిక పద్దతి లో స్వామిని సేవిస్తారు. 

అర్ధ క్రాంతి !

ప్రజలను ఎంత గా కష్ట పెట్ట వచ్చో ,దేశాన్ని  ఎంత అధ్వాన్నం గా  పాలించ వచ్చో , వ్యవస్థని ఎంతగా నాశనం చేయ వచ్చో మీరు తెలుసు కోవాలంటే -గడచిన 10 ఏళ్లలో మీరొక్క సారైనా భారత దేశం వచ్చి ఉంటే చాలు .

ప్రాంతీయ వేర్పాటు వాదాలు ,అవినీతి కుంభ కోణాలు  పేట్రేగి  దేశ సమగ్రతకే ఎసరు తెచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు,
పతన మవుతున్న రూపాయ్ , రాకెట్ లా దూసుకు పోతున్న ధరలు ,నిరుద్యోగం ,కుంగి కునారిల్లుతున్న యువత - ఇవన్నీ ఒక మార్పు -ఒక క్రాంతి ,కోరుకొన్నాయ్ .

ఆ మార్పు వస్తుందని , తమ జీవితాలలో క్రాంతి వెల్లి   విరుస్తుంద ని  ప్రగాడ నమ్మకం కలిగించే  పార్టీని అందలం ఎక్కించ డా నికి 80 కోట్ల ఓటర్లు ముఖ్యం గా 12 కోట్ల మంది యువత   ఉవ్విళ్ళూ రుతున్నారు .

అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమం , నయా లొహ్ పురుష్ మోడీ  కలిగించిన నమ్మకం  పునాది వేసాయ్ .
ఇక జరగవలసిన కార్యక్రమం చూద్దాం . 
ప్రభుత్వం  ఏటా సబ్సిడీల రూపం లో ఆయిల్ కి 13లక్షల కోట్లు ,విద్యుత్ కి 4 లక్షల కోట్లు , ఎరువులకు 6 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది . అయినా ,70శాతం పల్లెలు ఇంకా బయోమాస్ నే వాడుతున్నాయ్ .
40 శాతం ప్రజల కు ,నేటికీ కిరోసిన్ దీపాలే గతి .

పేద వారు ఎంత మంది ఉన్నారు ? వారి కి కూడు -గుడ్డ - నీడ కల్పించ దానికి ఎంత కావాలి ? ఎంత మంది కి  విలువలతో కూడిన ప్రాధమిక విద్య  (up to 7th class) , మంచి ప్రాధమిక వైద్యం , సత్వర న్యాయం అందు బాటులో ఉంది ? అనే నిఖార్సైన లెక్కలు వేయాలి .
6 లక్షల గ్రామాలు , 600 జిల్లాలు గా ఉన్న విభిన్న భారత్ కి  ఒకే అభివృద్ధి ఫార్ములా సరిపోదు .
ప్రతి జిల్లాకి ఆయా  ప్రాంత భూ , పంట ,ఖనిజ ,మానవ వనరుల ప్రాతి పాదిక పై ఒక ఫధకం తయార్ చేయాలి .
ఉదాహరణకు ఆహార భద్రతా పేరుతో ఏటా 1 లక్ష కోట్లు కేటాయించి అందులో కేవలం 50 వేల కోట్లు పేదల ఆహారానికి ఖర్చు పెట్టి మిగతాది మింగే ద్దా మనే దౌర్భాగ్యపు ఎత్తుగడ కాంగ్రెస్ ప్రభుత్వానిది .
సరైన లెక్క లుంటే ఇలాంటి దోపిడీని అరి కట్ట వచ్చు .
అలాగే పోషకాహార లోపం అనేది మన దేశం లో ప్రమాద కర మైన రీతి లో ఉంది . దీనికి కారణం ఆహార కొరత ఒక్కటే కాదు , సరైన శుభ్రత లేక పోవడం , బహిరంగ మల విసర్జన , దానితో కలిగే ఇన్ఫెక్షన్ ల వల్ల తిన్నది వంట బట్టక పోవడం ...

ఎనర్జీ స్వయం సమృద్ధి ఉంటేనే అర్ధ క్రాంతి . 
విద్యుత్ లేక పోతే ఉత్పత్తి లేదు . 
1965 వరకు చైనా ,భారత్ ఒకే స్థితి లో ఉండేవి . అప్పటి నుండి చైనా - భారీ,మధ్య ,కుటీర  పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడి గా పెంచు కొంటూ ప్రపంచం లో ఉన్న గాస్, ఆయిల్ వనరులను చౌక ధరల కే దొరక బుచ్చుకొని జాతీయ స్థూల ఉత్పత్తి ని పరుగులు పెట్టిస్తుం టే ,భారత్, సేవా రంగం లో నే చతికిల పడి వ్యవసాయ ,పారిశ్రామిక రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎనర్జీ స్వయం సమృద్ది ని గాలికి వదిలేసింది .

బర్మా అంగోలా , కజకిస్తాన్ లలో ఆయిల్ నిక్షేపాలను చౌకగా స్వాధీనం చేసుకొన్న చైనా ,
పాకిస్తాన్ ,ఇరాన్ లలో ఓడ రేవులు నిర్మించడానికి కూడా  ఆర్ధిక సాయం చేసి గాస్ సరఫరాకి మార్గం సుగమం చేసు కొంటుంటే, మన దేశం  ఈసురో మంటూ సంస్కరణలు పేర పిల్లి మొగ్గలేస్తుంది .

ఏటా కోటి మంది యువత ఉద్యోగాల మార్కెట్ కి వస్తున్నారు . కానీ మన దేశం లో అత్యంత ఆకర్షణీయ సేవా రంగం  కేవలం 20 లక్షల మంది కి మాత్రమే ఉద్యోగాలు ఇస్తుంది .
గత పదేళ్ళలో కేవలం 50 లక్షల మంది కి మాత్రమే ఉద్యోగాలు దొరికాయి .


భవిష్యత్ భారతానికి అణు విద్యుతే దిక్కు అని చిన్న పిల్లోడికి కూడా తెలుసు .
 అణు ప్రమాద ము వస్తే పరికరాలు సరఫరా చేసిన సంస్థలే బాధ్యత వహించా లనే చట్టం మనం పెట్టు కోవడం వలన ,ఏ  కంపనీ ముందుకు రావడం లేదు .

అర్ధం కాని విషయం ఏమిటీ అంటే ,మన దేశానికి వనరుల కొరత లేక పోయినా ఎందుకు వెనుక బడి ఉంది ?
సరైన దిశా నిర్దేశం చేసే నాయకులు లేకనా ?
ఉన్న నిధులను ,వనరులను దొంగ చాటుగా విదేశాలకు ఐయిన కాడికి తెగ నమ్మేసి ప్రజలను ,వ్యవస్థలను లూటీ చేస్తున్న అధికార నాయక గణా ల ధన దాహమా ?
అపారమైన బొగ్గు , తరగని ధోరియం , 3మిలియన్ చ కిమీ ల లో  గాస్ నిల్వలు ,సౌర విద్యుత్ కి పనికి వచ్చే భూ ప్రాంతం , మేధా వులు , మానవ వనరులు - ఇన్ని ఉన్నా మన బద్ధకం ,మూర్ఖత్వం , స్వార్ధం  ముందు పనికి రాకుండా పోతున్నాయ్ .

వనరులు  ఎప్పుడు , ఎట్లా ఉపయోగించాలో తెలిసేది మార్కెట్ కదలికల బట్టే గానీ , ప్రభుత్వ పాలసీల ద్వారా కాదు .
గనులు,ఆయిల్ ,గాస్ ,ఖనిజాలు - వీటిని తవ్వి ప్రాసెస్స్ చేసి వినియోగిం చాలీ అంటే, పెట్టుబడి , సాంకేతిక నైపుణ్యం చాలా అవసరం . ఇవన్నీ ప్రైవేట్ రంగం లోనే సాధ్యం  గానీ ప్ర భు త్వ రంగం లో సాధ్యం కాని పని .
Therefore, it is necessary to expand production capacities by allowing private participation. 
Given the right mix of incentives, market forces will usher in new capital and technologies for fuel extraction, carbon sequestration, and gasification.
 "ఇంధన వనరుల ఉత్పత్తి -సరఫరా -ధరల నియంత్రణ  సంఘం " అనేది స్వయం సంచలిత అధికారాలతో ,ప్రపంచ ఇంధన రంగ కదలికలకు అనుగుణ్యం గా ,ఎలాంటి రాజకీయ వత్తిళ్ళ ప్రమేయం లేకుండా పని చేసిన నాడు 125 కోట్ల మందికీ  అర్ధ క్రాంతి ఫలితాలు అందుతాయి . 

Monday 19 May 2014

ఒకే పౌర చట్టం అత్యంత అవసరం .

అందరి అంచనాలనూ అందుకొంటూ ,మరికొందరి ఆశ లను అడియాసలు చేస్తూ సీమాంధ్ర ఓటర్లు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం .
అనాధలా  మిగిలిన రాష్ట్ర పునర్నిర్మాణం , అవినీతిరహిత సమ సమాజం ,చేతి నిండా  పని,కడుపుకి కూడు ,నిలవడానికి గూడు ,నిరుద్యోగులకు , వృద్దులకు పెన్షన్ లు - ఈ కోరికలన్నీ ఈడేర తాయనే కొండంత ఆశ తో ఇక్కడ చంద్ర బాబు కి ,అక్కడ 'నమో' కి పగ్గాలు ఒప్ప చెప్పారు .

రికార్డ్ స్థాయి లో 26కోట్ల టన్నుల ఆహార ధాన్యాలే  కాదు, పదేళ్ళు ప్రతి పక్షం లో రేయనకా పగలనకా కష్ట పడ్డ రాజకీయ సైనికుడి కలల   పంట కూడా పండింది .
అంతే కాదు ,120 కోట్ల భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు కూడా వచ్చ్చెశా యి .
మోడీ అంటే మోత . మోడీ తోనే మోక్షం - ఇదీ నేటి భారతం . 
ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరును బిజెపి గత సెప్టెంబర్‌లో ప్రకటించిన నాటి నుంచి భారత మార్కెట్‌లోకి ఎఫ్ఐఐలు లక్ష కోట్ల రూపాయలకు పైబడిన పెట్టుబడులు తెచ్చారు . మోడీ మంత్రంతో సెన్సెక్స్ 2014 సంవత్సరం ముగిసే నాటికి 29 వేలకు చేరుతుందని,  మోదీ పెట్టుబడుల వాతావరణాన్ని పునరుజ్జీవింపచేయడం ఖాయమని అందరి ఆశ . 

విభిన్న  ఆచారాలు , పద్దతులు   ఆచరించే వివిధ మానవ సమూహాలు ఒకే త్రాటి పై నిలబడి సమాజం లో పురోగమించ  లంటే ఒకే పౌర చట్టం అత్యంత అవసరం . 
వివాహం,సంతానం , వారసత్వం ,విడాకులు -ఇవన్నీ సున్నిత మైన విషయాలు . వీటిలో సమానత తెస్తే సమాజం లో తేడాలు భేదాలు తగ్గి అందరూ ఒక్కటే అనే భావం వెల్లివిరుస్తుంది . 
ఉదాహరణకు ,గోవా రాష్ట్రం లో ఇదే చేశారు . 
Goa is the only state to have implemented the directive principle on the Uniform Civil Code and converted it into a law called the Goa Civil Code or the Goa Family Law.  It is the set of civil laws that governs all the Goans irrespective of the religion or the ethnicity to which they belong. 

లింగ వివక్షత , స్త్రీ అణచివేత సమసిపోవాలన్నా ,
దేశం లో ఉన్న విభిన్న మతాల వారు సౌహార్ద్రత తో కలిసి జీవించాలన్నా ,
దేశ జనాభా స్థిరీక రింప బడాలన్నా ,
దేశ జాతీయోత్పత్తి సమాన నిష్పత్తిలో పంచ బడాలన్నా  -
అందరికీ ఒకే పౌర చట్టం - కుల మతాలకు అతీతం గా భారత పౌరులకు- సమాన హక్కులు , సరిసమాన బాధ్యతలు ఉండాలి . 


Some reject Uniform Civil Code,saying no religion can dictate others. Point of UCC is not to divide by religion,but to unite by nationality.

Monday 12 May 2014

రైతన్న లారా ఏకం కండి

మనదేశం బాగు పడా లన్నా , మన రైతు సుఖ పడా లన్నా రైతులందరూ గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంఘటితం అవ్వాలి . 

గ్రామీణ రైతు సంఘం తో , ప్రభుత్వమూ ,ప్రైవేట్ సంస్థలు కలిసి  చేయవలసన కనీస విధి విధానాలు . 

1గ్రామీణ  విత్తన శుద్ది ,విత్తన విక్రయ కేంద్రాలు
2. గ్రామీణ ధాన్యం గిడ్డంగులు
3. గ్రామీణ ధాన్యం నాణ్యతా పరీక్ష మరియు రాష్ట్ర వ్యాప్త మార్కెట్ ధర వరలు తెలిపే అంతర్జాల కేంద్రం
4. మొబైల్ ధాన్య విక్రయ వాహనం  - రైతు కల్లం వద్ద కే విక్రయ వాహనం వచ్చి ,అక్కడే ధాన్య నాణ్యత  పరీక్ష చేసి , రైతుకి మార్కెట్ ధర ,ప్రభుత్వ ధర గురించి అవగాహన కలుగ చేసి చెల్లింపులు కూడా అక్కడే పూర్తీ చేయాలి .
5. ఆయా గ్రామాలలో ఏ రైతు దగ్గర ఎంత ధాన్యం ఏ ఏ ధరకి కొనుగోలు చేసిందీ పూర్తీ వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర సర్వర్ కి ఫీడ్ చేయాలి .
6. ప్రక్రుతి సేద్యం , ఆర్గానిక్ సేద్యం , సాగునీటి పొదుపు ,జీవాల పెంపకం , పంట మార్పిడి ,వాణిజ్య పంటల సాగు ,సమగ్ర వ్యవసాయ పద్దతులు మొదలగు ప్రక్రుతి సమతుల్యతా విధానాలను (cost effective and ecosafe methods) ప్రతి రైతుకి చేలోనే శిక్షణ ఇచ్చే వ్యవస్థని ఏర్పాటు చేయాలి .
7. రైతు పండించే పంటలో 30శాతాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసు కొనే వెసులు బాటు ప్రభుత్వం , ప్రైవేట్ సంస్థల భాగ స్వామ్యం తో కలుగ చేయాలి .
8. ప్రతి గ్రామంలో ఆయా పంటల ఉత్పత్తులకు విలువ జోడించే(value addition) కుటీర పరిశ్రమలు - కారం,ధాన్యం ,పిండి ,పప్పుల మిల్లులు ,బెల్లం ,ఖండసారి , ప్రత్తి జిన్నింగ్ ,మొక్కజొన్న వలిచే యంత్రాలు , తృణ  ధాన్యాలను శుభ్రం చేసి ప్యాక్ చే యడం .
9. ప్రతి విద్యార్ధి 30రోజులు వ్యవసాయంలో ప్రత్యక్షం గా పాల్గొనాలి .
10.ప్రతి  కాలేజీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పై న చెప్పుకొన్న విధి  విధానాలు సవ్యం గా అమలు అయ్యే టట్లు మానిటర్ చేయాలి .

Saturday 10 May 2014

దరిద్ర దోపిడీ భారతం లో కొన్ని కోలా వెర్రి ప్రశ్నలు ...

మన దేశంలో  బంగార మే , కాదు బంగారు మనుషులున్నారు . అవును నల్ల బంగారం ,నల్ల నోట్లు అన్నీ కలిపి స్విస్ బాంక్ ల్లో దాచి దేశాన్ని అడ్డం గా నిలువు గా కోసుకు తింటున్నారు .
ఆదాయ పన్ను లెక్కల ప్రకారం , 120 కోట్ల భారత దేశం లో కేవలం 600 మంది కి మాత్రమే 100 కోట్ల పైబడి సంపద ఉంది .

మన దేశం లో 30కోట్ల మంది రైతులు పండించే పంటని ,అమెరికాలో కేవలం 9లక్షల రైతులు పండిస్తున్నారు .
రైతుకి కేజీ చె రకుకి 2/-రూపాయలు ఇచ్చి ,పంచదారని 40కేజీ /- కి అమ్ముతున్నా
ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన భూ స్వాదీన చట్టముతో రైతుల భూమి లాక్కుం టున్నా
ఏటా అర లక్ష రైతులు ప్రాణాలు తీసుకొంటున్నా
రైతుల పేరు చెప్పి బాంక్ లకు, శీతల గిడ్డంగులకు లక్షల కోట్లు దోచి పెడుతున్నా ----
                    మన రైతులు, ప్ర భుత్వాలను ఎందుకు నిలదియ్యరు? 

 పనిచేసే సత్తువా ఉన్న 30కోట్ల మంది  పనీ, పాటా - ఉద్యోగం, సద్యోగం లేదు .
రోజు కి  కనీసం  10రూపాయలు సంపాదన లేని వాళ్ళు  ఇంకా 20కోట్ల మంది ఉన్నారు .
ప్రపంచ బాంక్ దృష్టి లో 75 కోట్ల మంది ఇండియన్స్ రోజు వారీ ఆదాయం 50 రూపాయలు కూ డా లేదు .
మురికి వాడ లలో ఇంకా 10కోట్ల మంది కునారిల్లు తున్నారు .
(As per Multi-dimensional Poverty Index (MPI), About 645 million people or 55% of India’s population is poor as measured by this composite indicator made up of ten markers of education, health and standard of living achievement levels.)

మరి , ఏటా 100 రోజుల ఉపాధి హామీ పధకం పేరుతో 50 వేల కోట్లు ,
ఉచిత ఆహార పధకం పేరుతో లక్ష కోట్లు -ఖర్చు పెడుతున్న ప్రభుత్వ సొమ్ము ఏమవు తుంది ? 

 మన దేశ రుణాలు ,జాతీయ స్థూల  ఉత్పత్తి ని మించి పోతున్నా ,
హవాలా ద్వారా   దేశం దాటి న  నల్ల డబ్బు పార్టిసి పేటరీ నోటు  రూపం లో తెల్లగా మారి షేర్ మార్కెట్  కి వస్తున్నా ---- 
స్విస్స్ బాంకు ల్లో మూలుగుతున్న భార తీయుల దొం గ  డబ్బు  సుమారు 1500 బిలియన్ డాలర్ లు ఎప్పు డ య్యా  స్వాధీనం చేసు   కొంటారు ?