Search This Blog

Tuesday 29 January 2013

చేతిలో డబ్బున్న వాడికి చేసు కొన్నంత మహా దేవ !

ఆర్ధిక స్థితి మందం  గా ఉన్నప్పుడు , డబ్బు చెలామణీ తగ్గి ,   బాకీ దార్లు అప్పు చెల్లింపులు చేయ లేక
 బాంక్ ల నిరర్ధక ఆస్తులు పెరిగి  తద్వారా   బాంక్ లకు కూడా ద్రవ్య సరఫరా తగ్గి ,బాంక్ లు
 అప్పు ఇవ్వ లే నప్పుడు ,  పరిస్థితి ఎలా ఉంటుంది ?
our markets going in to the phase of "deflation".
what measures one has to observe in coming 5years?

1.స్థిరాస్తులు కొనే వాళ్ళు తగ్గి ,వాటి విలువలు తగ్గుతాయి . ఆ తర్వాత కొనే వాళ్ళు కూడ ఉండరు .
2. డబ్బు సరఫరా    తక్కువ ఉండటం వలన పరిశ్రమలకు , వ్యాపారాలకు ఇబ్బంది ఏర్పడు తుంది .
3.ప్రజల కొనుగోలు శక్తి తగ్గు తుంది . వస్తువుల ధరలు తగ్గినా కొనుగోళ్ళు పెరగవు .

సా మాన్య ప్రజలు తీసు కోవలసిన జాగ్రత్తలు :
1.ఉన్న డబ్బుని కనీస అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి . విలాస వస్తువులు ,సెల్ ఫోన్ లు , ఎ.సి.లు , కార్ లు , తదితర వస్తువుల జోలికి వెళ్ళ కూడదు .
2. స్థలాల పైన ,స్టాక్ ల్లో , స్పెక్యులేషన్ పై పెట్టుబడి వద్దు .
3. సాధ్య మైనంత వరకు మీ కున్న సంపదను కరెన్సీ రూపం లో గాని ,లేదా ఏదైనా త్వరగా ద్రవ్య చ లా మణీ కి ఉపయోగ పడే -బంగారం  , అద్దె లు వచ్చే రియల్ ఎస్టేట్  లాంటి వాటిలో మదుపు చేయ వచ్చు .బంగారం కొనేది అవసరానికి ఉపయోగించు కోవటానికే తప్ప దాని పై భారీ లాభాలు వస్తాయని కాదు . ఎందు కంటే రాబోయే 10 ఏళ్ల లో బంగారం విలువ క్రిందటి దశాబ్దం లాగా పెరగదు .
4. ముఖ్యం గా చదువు ల కోసం డొనేషన్ లు కట్ట వద్దు .
5. కనీసం 3 లక్షల విలువ గల  ఆరోగ్య భీమా ప్రతి ఒక్కరికీ ఉండాలి .
6. కుటుంబం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాలి .వ్యవసాయం పై  గ్రామీణ యువత దృష్టి పెట్టాలి .
సేవా రంగం చతికిల బడే కాలం ఇది . కాబట్టి ఉత్పాదక రంగం పై ఎక్కువ శ్రద్ద పెట్టాలి .
7.  ఇంజనీరింగ్ ,మెడిసిన్ లాంటి అత్యధిక ఖరీదు చదువులు  కాకుండా ,వృతి విద్యా కోర్సులు - పారా మెడికల్ , పారా లీగల్ ,పాలిటెక్నిక్ ,వడ్రంగం ,ఎలక్ట్రీషియన్ ,శానిటరి , ఆటో మెకానిక్ కోర్సులు చేస్తే ఉద్యోగాలు గ్యారంటీ .

Monday 28 January 2013

రాబోయే 5 ఏళ్ళలో ప్రపంచ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది ?

విషయాన్ని చర్చించే ముందు , కొన్ని పదాలకు అర్ధం తెలుసు కొందాం .
  • Inflation (ద్రవ్యోల్పణమ్ ): is an expansion in the total supply of money and credit.
  • Deflation (ద్రవ్య విలువను తగ్గిపోవుట లేదా ద్రవ్య చలామణి తగ్గిపోవుట ) : is a contraction in the total supply of money and credit.
  • What is debt (అప్పు )? 
     debt is the borrower’s agreement to pay money to the creditor.
  • What is credit (నమ్మకం  లేదా  డబ్బు జమ ) ?
     Credit is an agreement transferring the right to access money from the owner of the money to someone else.
  • What is money (డబ్బు )? Money is something that serves as a unit of account, a store of value and final payment.
గత 50 ఏళ్ళుగా  ప్రపంచం మొత్తం అనగా దేశాలు , వ్యక్తులు అప్పు చేసి పప్పు కూడు (in inflationary period)  తిన్న ఫలితం ----డబ్బు చెలామణి తగ్గి ,అప్పు పుట్టని పరిస్థితి (deflation) ---> ఆర్ధిక క్రుంగుబాటు --->  ఉత్పాదక పరిశ్రమ చతికలబడి ---> నిరుద్యోగం --->సాంఘిక ఆందోళనలు  ---> రాజకీయ అస్థిరత --->  అంతర్జాతీయ వాణిజ్య క్రుంగుబాటు ---> ప్రపంచ యుద్ధం 

రాబోయే 5 ఏళ్ళ లో ఆర్ధిక పరిస్థితి ప్రపంచ వ్యాప్తం గా ఆందో ళన కరమ్ గా మారుతుంది .
మనం ఏం  చేయాలో తర్వాత పోస్ట్ లో చర్చిద్దాం .

భూములు బీళ్ళవ్ తాయ్ . జర జాగ్రత్త


ఈ క్రింది ప్రాజక్ట్ లు పూర్తీ ఐతే తెలంగాణా 350 T.M.C.  నీరు నిల్వ చేసు కొంటుంది 
శ్రీరాంసాగర్ లేదా పోచంపాడు SRSP: the capacity of this reservoir is 120 tmc.
Yellampalli /Sri Pada Sagar: Capacity to store 70 TMC of water
Inchampally: Capacity to store 120 tmc of water.
GLIS (Devadula) : Through lift irrigation 50 tmc of water.
Dhummagudem: Through lift irrigation it can lift some 20 TMC.
Ali sagr, Lendi (joint project with Maharatra) , singoor (on manjira) add up to 50 TMC. 
All this adds up to 350 TMC of storage.

విచిత్రమేమి టంటే ,ఇప్పటి వరకు మన రాష్ట్రం లో ఉన్నమొత్తం  డాం ల 

నీటి నిల్వ సామర్ధ్యం 300 T.M.C.లు మాత్రమే.

 ఒక్క శ్రీశైలం ఆనకట్ట తప్ప , నాగార్జున సాగర్ ,జూరాల  లు కూడా 

తెలంగాణా ప్రాంతం లో నే ఉండటం వలన సీమాంధ్ర లో మరే 

ఆనకట్ట కూడా  ఉండదు .   

జాతీయ నీటి యాజ మాన్యం లేనప్పుడు డెల్టా పరిస్థితి ఏమిటి ?

ఆలమట్టి డామ్ ఎత్తు పెంచినా ,బాబ్లి డాం కట్టినా,ఇప్పుడు  ఉన్న ట్రిబ్యునల్ 

ఏమీ చేయ లేని స్థితి లో ఉంటే ,ఆనకట్టల ఆజమాయిషీ ని నది ఎగువ 

ప్రాంతం వారికి వదిలేయడం తెలివి తక్కువ పని .చేజేతులా సీమాంధ్ర  

బంగారు భూములను బీడు పెట్టు కోవడ మే .

నదుల చాలు ల్లో నాగ జెముడు ,చేల చాలు ల్లో చికిలింత గడ్డి ,

రైతు నోట్లో ఇంత  మన్ను మశానం .

Tuesday 22 January 2013

మన మధ్య నీటి యుద్దాలు వద్దు.

మొత్తం లభ్య మయ్యె  2100 T.M.C. కృష్ణా నదీ జలాల లో మన రాష్ట్ర వాటా 800 T.M.C.
 ఈ  కాస్త నీటి కోసం మహారాష్ట్ర ,కర్ణాటక రాష్ట్రాల తో నిత్యం గొడవ పడుతూ నే ఉన్నాం . బాబ్లి డాం వలన గోదావరి  ,ఆలమట్టి డాం వల్ల  మన నాగార్జున సాగర్ ఎంత గా ఎండి పోయిందో అందరికీ తెలుసు .

మూడు రాష్ట్రాలలో 1400 km. ప్రవాహం ఉన్న  కృష్ణా నది  యొక్క 2.5 లక్షల చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం అంతా  సమతలం గా ఉండదు .
3000 MW  విద్యుత్ శక్తి  కృష్ణా నీటి పై కట్టిన పవర్ ప్రాజక్ట్ ల ద్వారా వస్తుంది .
26 చిన్నా పెద్దా ఆనకట్టలు లు 14000 TMC నీటిని నిల్వ చేస్తున్నాయి .

 కృష్ణా డెల్టా కి 182 T.M.C. జలాలు కేటాయించారు .ఎందుకంటే కోస్తాలో నీటి వాలుకి తగ్గ విధం గా పొలాలు ఉంటాయి the irrigation potential created in coastal Andhra is comparatively greater than that in other regions because of early efforts by British rulers and the advantage of gravity. 

కృష్ణ నీటిని సీమాంధ్ర వారు ఎక్కువ వాడేసు కొంటున్నారు  అని తెలంగాణ వాదులు అబద్దపు ప్రచారం చేస్తూ ,ఈ  క్రింది లెక్కలను ఉదాహరణ గా చూపుతున్నారు . కానీ కేచ్మెంట్ ఏరియా  ని బట్టి జల పంపకాలు ఉండవు అని బచావత్ కమిటీ తేల్చి చెప్పింది .
Regioncatchmentcultivable landirrigated Area
Andhra
31.5%
62.5%
76.72%
Telangana
68.5%
37.5%
24%

Maharashtra and Karnataka pleaded before the tribunal to allocate the river waters according to the proportions of catchment area, drainage contribution, population, culturable areas, etc, in the three states. The tribunal rejected this demand.
పరీవాహక వైశాల్యం ,జనాభా , ప్రవాహపు వైశాల్యం  ప్రాతిపదికన, నీటి పంపకాలు జరగరాదు -అని బచావత్ కమిటీ తేల్చి చెప్పింది .

గోదావరి  నదీ జలాలు :There are five riparian states in the Godavari basin, namely Maharashtra, Chhattisgarh, Karnataka, Orissa and Andhra Pradesh.The bulk of the contribution to the Godavari is from the Pranahita, Indravati and Sabari tributaries.

మొత్తం లభ్య మయ్యె 3200 T.M.C. గోదావరి  నదీ జలాల లో మన రాష్ట్ర వాటా 1480 T.M.C.
తెలంగాణా లో గోదావరి నదీ ప్రవాహం లోయలో సాగుతుంటే  , పొలాలన్నీ ఎంతో  ఎత్తు లో ఉండటం వలన  సాగుబడి కష్టం .As a major part of the cultivable area in Telangana is situated at an elevation of 100-600 m above mean sea level, any reservoir will serve only a limited ayacut under gravity flow. To serve large tracts in Telangana, water is to be lifted to a considerable height.

దీనికొక్కటే మార్గం జలయజ్ఞం లో ప్రతిపాదించిన పెద్ద,చిన్నా ప్రాజెక్ట్ లన్నింటినీ పూర్తీ చేయాలి .
దాని కోస మైనా రాష్ట్రం సమైఖ్యం గా ఉండాలి .
Jalayagnam will bring 139.51 lakh acres under irrigation at a cost of Rs 1,07,871 crore in Telangana, 123.01 lakh acres (Rs 44,465 crore) in Coastal Andhra, and 52.52 lakh acres (Rs 2,637 crore) in Rayalaseema.it is advisable and desirable to complete all the balance works in a united state, or else it would be difficult for each of the future individual states to complete such projects with large outlays.


కోస్తా లో ఎకరా భూమికి సాగు నీరు అందించ దానికి లక్ష ఖర్చు ఐతే , అదే తెలంగాణా లో 3 లక్షలు కావాలి .అంతే కాదు ఎత్తిపోతల పధకాలకు నిరంతరం కరెంటు ఖర్చు ఉంటుంది .

తెలంగాణా కి భూగర్భ ఖనిజ సంపద ,కోస్తాకి డెల్టా , సాగర తీరం , సీమకి ఇనుము  గనులు సహజ సంపదలు .
వీటన్నింటి నీ కల బోసుకొని అభివృద్ధి దిశ గా సాగాలి . అంతే గానీ ,విడిపోతే నీటి యుద్దాలు ,సరిహద్దు తగాదాల వలన సామాన్య మానవుడు తీవ్రం గా నష్ట పోతాడు .పెద్ద ఆనకట్టలు కట్ట లేము .  లోక్  సభ సభ్యులు , తక్కువ మంది  ఉండటం వలన  , కేంద్రం నుం డి  ఏ పనీ సాధించ లేరు .

తెలంగాణా సస్య శామలమ్ కావాలి .ప్రజలు బాగా చదవాలి.
  అప్పుడు .ప్రపంచీకరణ కాలం లో ఎక్కడైనా ఉద్యోగాలు పొంద వచ్చు . 
రాష్ట్రం చిన్నదైతే సరిపోదు . మంచి దార్సినికులు నాయకులు గా ఉండాలి . ప్రజలు విలువలతో కూడిన విద్యా వంతులై సదా జాగా రూకులై ఉండాలి . అప్పుడు రాష్ట్రం చిన్న దైనా ,పెద్ద దైనా అభివృద్ధి చెందుతుంది .
తెలంగాణాయే కాదు, నేటి పరిస్థితులలో ఏ  రాష్ట్రమూ ముక్కలు కాకూడదు .
రాష్ట్రం చిన్న దైతే, ఆ ప్రభుత్వం బలహీన మవుతుంది .బలహీన ప్రభుత్వాలు ప్రజలను పాలించ  లేక అరాచకానికి దారి తీస్తాయి .

Sunday 20 January 2013

"దేశ మంటే మట్టి కాదు , దేశ మంటే ఓ ట్లోయ్ "

రాబోయే 2014 ఎన్నికల లో , సమైఖ్య ఆంద్ర లో కాంగ్రెస్స్ పార్టీకి విజయ అవకాశాలు తక్కువ.సీమాంధ్ర లో జగన్ పార్టీ కి ఉన్న సానుభూతి  , తెలంగాణా లో  ఉన్న ప్రత్యేక రాష్ట్ర  సెంటిమెంట్ వలన 2014 లో  కాంగ్రెస్స్ పార్టీ గెలిచే అవకాశాలు  లేవు.కనీసం ఆంధ్రా నుండి 25 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించు కోవాలంటే రాష్ట్రాన్ని చీల్చి తెలంగాణా ఇస్తే , కనీసం తెలంగాణా ప్రాంతం లో 20 సీట్లు సాధించు కోవచ్చనే వ్యూ హం తో కాంగ్రెస్స్ పార్టీ సిద్దంగా ఉంది .అలాగే ఇతర పార్టీలు కూడా  తెలంగాణా సెంటిమెంట్ కి తల ఒగ్గి వారి వారి విజయావ  కాశా లాను మెరుగు పరుస్తున్నారు - .-  ఇదీ రాజ కీయ పండితుల అంచనా .

వ్యవస్థ ఏ మైనా ఫరవా లేదు ,ఓట్లు రాబట్టు కొని అధికారం చెలాయించాలి. ప్రతి పార్టీ ఓట్ల గురించి ఆలోచిస్తుంది గాని, రాష్ట్ర విభజన వలన జరగ 
 బోయే కష్ట నష్టా లను ప్రజలకు తెలియ చేసి , విభజన తప్పని పరిస్థితి లో
 ఏ విధం గా సంపద , ఆదాయాల పంపిణీ  చేసు కోవాలి ? అనే దిశ గా ఆలోచించడం లేదు .
శ్రీ కృష్ణ కమిటీ సూచనల గురించి ఎవ్వరూ చర్చించడం లేదు .
విచిత్రం ఏమిటంటే , రాజకీయ నాయకులకున్న సమ కాలీన సామాజిక పరిజ్ఞానం మేధావులకు, నేడు లేదు .ఉన్నా ఎవ్వరూ ముందుకు రారు .
ప్రజలు కూడా మనోభావాల కన్నా రాష్ట్ర ఆర్ధిక ,జీవన అభివృద్ధి కి పెద్ద పీట వేయాలి .
మేధావులు విద్యార్ధులను చైతన్య పరిచి , సామాన్య మానవుడి వికాసానికి మనం ఏం చేయాలో భోధించాలి .
మత  సంస్థలు , వ్రుత్తి సంఘాలు , సేవా సంస్థ లు ,సంఘానికి దిశా నిర్దేశం చేయాలి . 
మేధావులే రాజ కీయ పార్టీల ఉచ్చు లో పడితే సంఘం దారి తప్పుతుంది .
దురదృష్ట వశాత్ ,ఒక్క రాజ కీయ పార్టీ లే చురుకుగా ఉన్నాయి . మిగతా సమాజం ఏమీ పట్ట నట్టు సోమరి గా ఉంది .
రాజ కీయ పార్టీలు ఓట్ల కోసం ఎన్నో అనుచిత సంక్షేమ పధకాలు , ప్రభుత్వ వ్యవస్థను ,సాంఘిక వ్యవస్థను బల హీన పరిచే  కార్య క్రమాలు చేస్తున్నారు . దానం మంచిదే .కానీ, అపాత్ర దానం మంచిది కాదు . ప్రజలను బిచ్చ గాళ్ళగా మార్చ కూడదు . చేపని దానం చేయడం కంటే ,చేపని పట్టు కొనే శక్తిని ,యుక్తిని నేర్పాలి .
ఒక విధంగా ప్రజలను సోమరులుగా మార్చి  తద్వారా సమాజాన్ని నిర్వీర్యం చేస్తే  , ఎంత కాలమైనా వారి అధికారానికి అడ్డు ఉండదు .
"దేశ మంటే మట్టి కాదు  , దేశ  మంటే ఓ ట్లోయ్ "
unfortunately we don't have statesman but we have "ote- bank -centric" politicians

Friday 18 January 2013

ఆంద్ర ప్రదేశ్ ని విడ గొడితే , అది చారిత్రిక తప్పిదమే . తెలుగు ప్రజల భవిష్యత్ అంధ కారమే.

ప్రజా స్వామ్య దేశం లో అన్ని వర్గాల ప్రజల అభీష్టాలకు విలువ ఇవ్వాలి . అలాగే తెలంగాణ నాయకుల ,ప్రజల మనోభావాలకు ,అదే సమయం లో వారితో ముడి పడి ఉన్న సీమాన్ద్రుల  మనోభావాల కు కూడ విలువ ఇవ్వాలి .
రెండు  విరుద్ద  భావనలను సంయమనం చేసే ముందు  , మానవతా విలువలకు ,మానవ అభివృద్దికి ,  కనీస ఆర్ధిక భద్రతకు పెద్ద పీట వేయాలి .అంతే గాని కొన్ని వర్గాల వారి  సెంటిమెంట్ లకు విలువ ఇస్తే సంఘ జీవనం చేస్తున్న మానవ సమూహాలకు హాని కలుగుతుంది . ప్రతి మనిషి  మనోభావాలను పరి రక్షించు కోవలసిన నైతిక భాద్యత ప్రభుత్వానిది ,ఆ సంఘ జనాలదీ .

3.5 కోట్ల జనం , విస్తార మైన అడవులు ( 45%  of A.P.) , భూగర్భ గనులు (బొగ్గు, బాక్సైట్ ,సున్నపు రాయి  , మైకా ) , మూసీ ,గోదావరి ,కృష్ణా నదులు పారాడే ఒక లక్ష చదరపు కిలోమీటర్ల  "తెలంగాణ "  పుట్టింది 1950 జనవరి 26.
అంతకు మునుపు ,హైదరాబాద్ రాష్ట్రం లో భాగం గా ఉండేది .

మహారాష్ట్ర ,కర్ణాటక ,తమిళనాడు ,ఆంధ్రా   లోని ఎన్నో ప్రాంతాల కలయిక తో హైదరాబాద్ రాష్ట్రం విశాలముగా  ఉండేది .నిజానికి బీదర్,ఔరంగాబాద్ నుండి తిరుచిరాపల్లి వరకు అనగా కోస్తా జిల్లాలు కూడ హైదరాబాద్ రాష్ట్రం లో భాగం గా ఉండేవి.తెలంగాణా ప్రాంతం సువిశాల హైదరాబాద్ రాష్ట్రం లో ఓ చిన్న ప్రాంతం . కాబట్టి చరిత్ర చూసినా హైదరాబాద్ రాష్ట్రం  పై తెలంగాణ వారికి ఎంత అనుబంధం ఉందో ,అంతే సంబంధం కోస్తావారికీ ఉంటుంది .

5 కోట్ల జనం , 1000 కిలోమీటర్ల సాగర తీరం , సహజ వాయు నిక్షేపాలు ,ఓడ రేవులు ,  గోదావరి ,కృష్ణా నదులు చివరి మజిలీ చేసే  1.5 లక్షల  చదరపు కిలోమీటర్ల "సీమాంధ్ర " పుట్టింది 1953 .
అంతకు మునుపు మద్రాస్ రాష్ట్రం లో భాగం గా ఉండేది .

20 February 1956 న ఇరు ప్రాంతాల పెద్దల మధ్య కుదిరిన ఒప్పందంతో  "తెలంగాణ , సీమాంధ్ర - రెండూ కలిసి ఆంద్ర ప్రదేశ్  గా పుట్టింది   నవంబర్ 1,1956.

"తెలంగాణ" నాయకులు  విడి పోతామని  ఎందుకు  అంటున్నారు ?
దేనికైనా అధికారం ,డబ్బే కారణం .

Selfish sentiment Leads to Financial calamity !
చాలా కొద్ది మంది సెంటిమెంట్ కోసం , కోట్లాది ప్రజల ఆర్ధిక భవిష్యత్ ను బుగ్గి చేయడం ఎంతవరకు సబబు ?
కాలం మారుతుంది .ప్రజలూ సర్దుబాటు చేసుకొని మరింత కష్ట పడి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసు కొంటారు . ఏదోవిధంగా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి .కానీ ఇది జరగటానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది .ఈ లోపు,కొన్ని తరాల ప్రజలు ఆర్ధికం గా , సాంస్కృతికం గా నలిగి పోతారు .  
రాజ ధా ని , పరిపాలనా భవనాలు  నిర్మించు కోవాలి .నీటి పారుదల ప్రాజక్ట్ లు , ధర్మల్ ప్రాజక్ట్ లు , SEZ లు , పరిశ్రమలు , యూ నివర్సిటీలు  ,హాస్పిటల్స్  ఇవన్నీ నిర్మించు కోవా లంటే నిధులు , దార్శినికులైన నాయకులు కావాలి .
ప్రశాంతం గా సాగిపోతున్న రాష్ట్రాన్ని రావణ కాష్టం గా మార్చు కోవాలనే ఆలోచన , ఈ గ్లోబలైజేషన్ కాలం లో అంత అవసరమా ?
 కొద్ది మంది రాజకీయ నాయకుల స్వార్ధానికి  కోట్లాది ప్రజలు , విద్యార్ధులు బలి కాక తప్పదా ?
ఇది మానవ జనిత ఉత్పాతం . ప్రపంచ మంతా ఆర్ధిక  మాంద్యం ఉన్న ఈ పరిస్థితి లో గోరు చుట్టు పై రోకటి పోటులా రాష్ట్ర విభజన , సామాన్యుడిని కుంగ దీయక మానదు . మన రాష్ట్రం ( రాష్ట్రాలు )50 ఏళ్ళు వెనుక బడి  పోక తప్పదు .
State revenue coming from different areas: రాష్ట్ర రెవిన్యూ  ఆదాయం లో    వివిధ ప్రాంతాల పాత్ర  (2011  ) :
హైదరాబాద్ మహా నగర  నుండి  : 40%
తెలంగాణ" నుండి  : 22%
సీమాంధ్ర  నుండి  : 18%
శిస్తుల లో కేంద్రం ఇచ్చే  వాటా : 20%
అనగా హైదరాబాద్ మహా నగరం  లేక పోతే సీమాంధ్ర , తెలంగాణా లు
 బతక  లేవు .
తెలంగాణ వెనుక బాటు కి కారణాలు :
  • 70% గోదావరి ,కృష్ణా నదుల పరీవాహక ప్రాంతం  తెలంగాణ లో నే ఉంది .అయినా భౌగోళిక ముగా,  నదు ల ప్రవాహం ,సాగు భూముల మధ్యన ఎంతో అంతరం ( huge difference in levels) ఉండటం  వల్ల ఎత్తిపోతల పధకాలు తప్ప వాలుని ఉపయోగించు కొనే కాలువలు ,ఆన కట్టలు నిర్మించ లేని పరిస్థితి .
  • విద్య కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వక పోవటం .అందుకే మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో తెలంగాణ ప్రాంతీయుల శాతం 25% మాత్రమే.
  • దొరల ,ర జాకార్ ల , దేశముఖ్  ల పాలనలో అణగారిన బానిస మనస్తత్వం ...
  • ఉద్వేగ పూరిత ఉద్యమ కార క మానసిక స్థితిని ఉపయోగించుకొనే రాజకీయ కామందులు 
ఇన్ని కారణాలు ఉన్నా ,కలిసి ఉండటం వలనే వారు వెనుక బడి పోతున్నారని తెలంగాణ మేధావులు కూడా ప్రచారం చేయడం భాధాకరం .
నిజంగా తెలంగాణ ప్రజలందరికీ విడి పోయి వేరే రాష్ట్రం కావాలనుకోన్నా అది ఎంతో  ఖర్చు , బాధ లతో కూడుకొన్న ఖరీదైన కోరిక .
వారి కోరికని  అందరూ గౌరవిద్దాం . కానీ ,కోరిక తీర్చు కోవాలని అనుకొనే వారే మూల్యం చెల్లించు కోవాలి .

Thursday 17 January 2013

తెలుగు తల్లి గుండె లో గునపాలు

నీటి పంపిణీ ,భూగర్భ సంపద (- బొగ్గు ,సున్నపు రాయి ,మొదలగు ), సాగర సంపద ,నౌకా యాన పరిశ్రమ , హైదరాబాద్  మహా నగరం  - ఆంద్ర ప్రదేశ్   రాష్ట్రాన్ని రెండు గా విభజించాలన్నప్పుడు , ఇవీ ముఖ్యం గా చర్చకు వచ్చే విషయాలు .

తెలం గాణా ప్రజా వాణి , వారి  ఉద్వేగ భరిత  మానసిక స్థితి ని అందరూ అర్ధం చేసు కోవాలి .
 చరిత్ర తిరగ దోడినప్పుడు , ముసల్మాన్ ర జా కార్ ల, గడీ దొరల ఏలుబడి లో    తెలం గాణా ప్రజల కష్ట నష్టాలు అందరికీ తెలిసిన వే . గత 150 ఏళ్ళుగా తెలెంగాణా ప్రజలు శారీరక ,మానసిక ,ఆర్ధిక దోపిడీ కి గురి అయ్యారు . ఎటొచ్చీ గత 40 ఏళ్ళు గా వారు ప్రశాంతంగా అభివృద్ధి పధం లో సాగుతున్నారు .

దోపిడీ కి కారణం కలిసి ఉండటం మాత్రం కాదు . కలిసి లేనప్పుడే వారు విపరీత మైన దోపిడీకి గురి అయ్యారు .వేరే కారణాల వల్ల  ఇబ్బందులు పాలై , కలిసి ఉండటం వల్లనే అభివృద్ధి చెంద  లేక పోతున్నామని అనుకోవటం ఆత్మ  వంచన . ఇది చారిత్రిక తప్పిదానికి దారి తీస్తుంది .

భౌగోళికంగా , నదీ ప్రవాహ జాలు  పరంగా , భూ గర్భ గనుల  మరియు సాగర తీర నౌకా వాణిజ్య పరంగా సీమాంధ్ర , తెలెంగాణ  ప్రాంతాలు కలిసి జీవనం  సాగిస్తూ అభివృద్ధి చెంద  వలసిన అవసరం ఉంది .

విడి పోవాలా ? వద్దా ?
 విడి పోవాలని కొందరు  రాజకీయ నాయకులు ,కొన్ని వర్గాల ప్రజలు ఎందుకు పోరాటం చేస్తున్నారు  ?
సమైఖ్యంగా నే ఉండాలని మరి కొందరు ఎందుకు   కోరుకొంటు న్నారు ?
విడి పోవటం అత్యవసరమా ?
అభివృద్ధి ని ఫ ణం గా  పెట్టి విడి పోవలసిన అగత్యం ఎందుకు ?
తెలంగాణా జిల్లాలలో ఉన్న 3.5 కోట్ల మందిలో ఎంత మంది విడి పోదామని అనుకొంటున్నారు ? ఎక్కువ లో ఎక్కువ , కోటి మంది అలా అనుకొన్నా , వారి సెంటిమెంట్ కోసం పచ్చగా అభివృద్ధి చెందుతున్న బల మైన  రాష్ట్రాన్ని ముక్కలు చేసి ,మిగతా 8 కోట్ల ప్రజల భవిష్యత్ ను బూడిద గా మార్చే కార్పణ్యం ఎందుకు ? 


ఆంద్ర ప్రదేశ్  సమైక్య విశాలాంధ్ర గా ఎందుకు ఉండాలి ?
చరిత్ర చెప్పినట్ట్లుగా నిజాం కాలం నాటి హైదరాబాద్ తెలంగాణాలోని ప్రాంతమే. అప్పటి నగరం వేరు . కానీ గత 50 సంవత్సరాల నుండి మనందరం కలిసి  ఆ నగరాన్ని అభివ్రుద్ది చేసుకొన్నాం . అలాంటి హైదరాబాద్ లేకుండా అటు తెలంగాణా కానీ , ఇటు ఆంధ్ర ప్రాంతం గానీ బ్రతుకు సాగించలేవు . మనందరమూ కలిసి ఒక చెట్టుని నాటి ,పెంచి పోషించి , పళ్ళు కాసే సమయానికి మీకు హక్కు లేదు- పొమ్మని పొగపెట్టడం  ఎంత వరకు న్యాయం ? మనందరి ఉనికిని , మనందరి ప్రగతిని కాపాడుకోవలసిన సమయం ఇది .కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలు  కలిసి కట్టుగా ఉండవలసిన తప్పని  పరిస్థితి నేడు ఉన్నది .
 
  హైదరాబాద్ కోసం మాత్రమే కొట్టుకొంటున్నారు . మీలో సమైక్యతా భావం లేదు - అని కొందరు విమర్శిస్తున్నారు . నిజం నిక్కచ్చిగాచెప్పుకోవాలంటే , మన బ్రతుకు బండికి ఆర్ధిక దన్ను ఉండాలి . .హైదరాబాద్ అందరికీ చెందాలనే మా కోరిక. అన్ని ప్రాంతాల వారు లబ్ది పొందాలనే మా ఆరాటం .ఒక ప్రాంతానికో , మరికొందరి ప్రజలకో పరిమితం కాదు .మనందరం కలిసి  గత 50 ఏళ్ళుగా మన రాజధాని నగరాన్ని పెంచి పోషించుకొన్నాం . మన వర్తమానాన్ని , భవిష్యత్ ని , మన కలలను ఆ నగరంతోనే ముడి వేసుకొన్నాం .హైదరాబాద్ నేడు అందరికీ అవసరం .

  అన్ని ప్రాంతాలవారూ  హైదరాబాద్ కోసం ఎందుకు  ఆరాటపడుతున్నారు ?
    దేశంలో 6 వ పెద్ద నగరం . 2000 చ.కి.మీ. వ్యాపించి ఉన్న హైదరాబాద్ అర్బన్ డెవ్లమెంట్ అధారిటీలో 70 లక్షల  పని చేసే జనాభా . అంతర్జాతీయ విమానాశ్రయం . దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపే రోడ్ - రైల్ నెట్ వర్క్  . ప్రసిద్ది గాంచిన 500  సాఫ్ట్ వేర్ కంపినీలు ,  ప్రపంచంలోనే అత్యధికమైన ఫార్మా కంపినీలు ,మెడికల్ -ఇంజనీరింగ్ - అంతర్జాతీయ బిజినెస్  కాలేజీలు , 30000 హాస్పిటల్ బెడ్స్ తో 40 అధునాతన కార్పొరేట్ హాస్పిటల్స్ , జాతీయ - అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు , బయోటెక్ ఇండష్ట్రీ , నానో ఇండష్ట్రీ , ఫాబ్ సిటి , దేశంలోని  ఐ. టి. ఎగుమతులలో 15 శాతం .
రాష్ట్ర మొత్తం శిస్తు వసూళ్ళలో దాదాపు 40 శాతం ఒక్క హైదరాబాద్ ద్వారానే వస్తుంది .
అన్నింటినీ మించి ఐ. టి. మల్టి ప్లైర్ ప్రభావంతో  అమెరికానే తలదన్నే రియల్ ఎస్టేట్ , ఆహార రెస్టారెంట్ లు , మాల్స్ , టూరిజం , క్రీడా స్టేడియం  -ఇంతగా అభివ్రుద్ది చెందిన సిటీ ,మీకు చెందదు అని అంటే ఎంత బాధ కలుగుతుంది ? ఇలాంటి నగరాన్ని మన అందరమూ కలిసి పంచుకోవాలంటే తప్పనిసరిగా  అన్ని ప్రాంతాల వారు కలిసి ఉండాలిసిందే .
వలస వచ్చినవారు , దోపిడీదారులని , ఒక వర్గం వారిని తిడుతూ, మీ ఆస్తులకు రక్షణ కల్పిస్తామని అంటున్నారు . ఎవరు ఎవరికి రక్షణ ఇస్తారు ? ఎ పుడైతే ఈ విధమైన హామీలు వచ్చాయో ,ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆ ధారపడవలసిన అగత్యం ఉందన్న మాట  అక్షరాల నిజం .

2. నీటి యుద్దాలు , విద్యుత్ శక్తి కొరత , ఆహార ధాన్యాల కొరత - వీటిని నివారించాలంటే మనం కలిసి ఉండ వలసిందే .

 3. చిన్న రాష్ట్రల  వనరులు , శిస్తులు , ఆ రాష్ట్ర  పరిపాలనా ఖర్చుకే సరిపోని పరిస్థితి వస్తుంది . పెద్ద సమైక్య రాష్ట్రం ఉంటే ఎన్నో ప్రాజెక్ట్ లు కట్టుకోవచ్చు . కేంద్ర ప్రభుత్వ నిధులు ,పెద్ద ప్రాజెక్ట్లు సాధించు కోవాలన్నా పెద్ద రాష్ట్రం గా ఉంటే నే సాధ్య పడుతుంది .

4. ఒక ప్రాంతంలో లేని వనరులు మిగతా ప్రాంతాల వారితో పంచుకోవటం వలన అభివ్రుద్ది అందరికీ అందే అవకాశం. ఉదాహరణకు - తెలంగాణా లో విస్తారమైన బొగ్గు , బెరైటిస్ , సున్నపురాయి గనులు ఉంటే , అదే విధంగా ఓడ రేవులు ,  గాస్ - ఆయిల్ నిక్షేపాలు ఆంధ్ర ప్రాంతంలో , ఐరన్ తదితర గనులు సీమలో  ఉన్నాయి . వీటన్నింటినీ సమంగా అందరము వాడుకోవటం వలన అందరము అభివ్రుద్ది చెందవచ్చు .

5. హక్కులకోసం పోరాడితే బాధ్యతలు కూడ మోయాలి - ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి . మారిన పరిస్థితులలో ఆంధ్రా అంటే హైదరాబాద్ . హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ . ఇది అందరూ గుర్తుంచుకోవలసిన విషయం.

ఆంధ్ర  ప్రదేశ్  ని  విభజిస్తే జరగ బోయే పరిణామాలు  :

 క్రీస్తు శకం 2018 . క్రిష్ణా జిల్లాలో ఓ మారుమూల గ్రామం . ఏరువాక ఎల్లిపోయి నెల గడిచింది . పొలాలలో సడి లేదు . నారుమళ్ళ పోత లేదు . నల్ల భూముల్లో కసింతలు . కుక్క బెండలు విరగ కాసాయి . ఒకప్పుడు పచ్చని మాగాణులైన ఆ  భూముల్లో నాగలి కర్రు దిగి రెండేళ్ళయింది . రైతు గుండెల్లో గునపాలు దిగి ఒకప్పటి అన్నపూర్ణ ఆకలితో అలమటిస్తోంది . కాలువల్లో నీరు లేక లవణ జలం ఎగదన్ని భూములన్నీ చౌడుబారి సముద్ర తీర మైదానాలన్నీ సరుగుడు  , సుబాబుల్ చెట్లు పెంచాలసిన పరిస్థితి .దీనికి కారణం ఎగువ తెలెంగాణ ప్రభుత్వం క్రుష్ణా నది కి అడ్డు కట్ట లేసి కరెంటు మోటార్లతో ఎత్తిపోతల పధకాలు విరివిగా అమలు చేయడం ..

రాయల సీమలో ఓ కుగ్రామం . ఫాక్షన్ తగాదాలతో అట్టుడుతున్న వందలాది గ్రామాలలో అది ఒకటి .  గనుల డబ్బుతో , పారిశ్రామికంగా ఎదిగిన కొన్ని ప్రాంతాలు మినహాయించి చాలావరకు సీమ ప్రాంతం  కరువు కొరల్లో వేలాడుతుంది . కరెంటు లేదు . జల ఘోష లేదు . ఎర్ర భూముల్లో వాన చుక్క బడి ఏదాది వెళ్ళింది . శనగ మొక్క బతికి గింజ కట్టే పరిస్థితి లేదు . తిండి లేకపోవటంతో తగాదాల్లో ఇరుక్కున్న జనం . మగ దిక్కు లేక  తల్లీ -బిడ్డా తల్లడిల్లే  గ్రామాలు  పెరిగి పోతున్నాయి . దీనికి కారణం తెలంగాణా ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ని ఆపివేయడం .

తెలంగాణా లో ఓ చిన్న గ్రామం . అన్ని ఆహార పదర్ధాలు , యంత్ర సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి . సముద్ర ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నాయి .సిమెంటు , ఉక్కు ధరలు పెరుగుతున్నాయి . నక్షలైట్ల బెడద పెరుగుతూంది
రాజ కీయ నాయకులు ఏంతో కష్ట పడి ఎన్నో పధకాలు రచించి విడ దీసి చేతులు దులుపు కొన్నారు .కొత్తగా వచ్చిన అధికారం తో  కాలు నిలవక ఎన్నో వాగ్దానాలు అమాయక ప్రజల పై విర జిమ్ముతూ న్నారు .
 ఎత్తి పోతల పధకాలు , నదులకు ఎగువ గా ఆన కట్టలు కట్టాలని దోపిడీ రాజ్యానికి తెర  దీసారు .
పేద వారు ఇంకా పేదరికం లో ధన వంతులు మరింత సంపద లో కూరుకు పోతున్నారు .
రాజ కీయ పార్టీలు  మాత్రం రెండు రాష్ట్రాలలో  ఎలా అధికారం సాధించాలా ? అని మల్ల గుల్లాలు పడుతున్నాయ్  .
   భారత కేంద్ర ప్రభుత్వం ఎప్పటి లాగానే సమస్యలను సాగ దీస్తూ .... కొత్త సమస్యలను సృష్టిస్తుంది .                                                                                 

 సుత్తి లేకుండా సూటిగా చెప్పా లంటే , విడి పోవాలా ? వద్దా ? అనేది కొశ్చన్ కాదు . ఎలా,ఏవిధంగా విడి పోయి ఆస్తుల ,సంపదల పంపిణీ జరపాలి అన్నదే పాయింటు .
                                                                                                                                                                                           



Tuesday 8 January 2013

భూమి , బంగారం ,పిల్లల చదువు ,సొంత ఇల్లు ? What is Real Return and How Inflation eats your money

image

మన దేశం లో ప్రజలు  భూమి , బంగారం ,పిల్లల చదువు  ,సొంత ఇల్లు - ఈ  క్రమం లో తమ డబ్బు ని మదుపు చేస్తారు .కొత్త తరం వారు పొదుపు ని తగ్గించి తమ విలాసాలకు ఎక్కువ గా ఖర్చు చేస్తున్నారు .
 చార్ట్ ని గమనిస్తే , పది సంవత్సరాల చక్ర పరిధిలో   బంగారం ధర లో విపరీత మైన పెరుగుదల లేదా చాలా కొద్ది పెరుగుదల ను గమనిస్తాము. 

1970- 80 దశాబ్దం లో 700% పెరుగుదల ఉంటే , 1980- 2000   అనగా 20 సంవత్సరాల  లో  చాల కొద్ది పెరుగుదల 100% మాత్రమే ఉంది . మళ్ళీ 2000 -2010 దశాబ్దం లో 400 %  పెరుగుదల ఉంది . ఈ  పట్టిక గమనాన్ని బట్టి రాబోయే కాలం లో బంగారం పెరుగుదల మరీ ఎక్కువ ఉండదు .
ఏతా వాతా 1970 లో 10గ్రాముల బంగారం ధర 200/- ఉంటే , 2010 లో       10గ్రాముల బంగారం ధర 20000/- ఉంది.
అనగా 40 ఏళ్ళ లో 100 రెట్లు పెరిగింది .

అలాగే భూముల ధరలు చూస్తే - ఉదాహరణకు కృష్ణా డెల్టా లో ఎకరా భూమి ధర 1980 లో 15000/- ఉంటే  అదే భూమి 2010 లో 10 లక్షలు పలుకుతుంది .అనగా 30 ఏళ్ళ లో 70 రెట్లు పెరిగింది .

కోస్తా లో పట్టణ ఇళ్ళ ధరలు పరిశీలిస్తే , 1990 లో గజం 500/- ఉంటే ,2010 లో 30000/- ధర ఉంది . అనగా 20 ఏళ్ళ లో 60 రెట్లు పెరిగింది .

అనగా  వీటి దిగుబడి  ( return) సరాసరి 12%. ద్రవ్యోల్పణం తీసి వేస్తే నికర 
దిగుబడి  ( return) తెలుస్తుంది .
అలాగే షేర్ లలో పెట్టుబడి పెట్టినా 15%  స్థూల  దిగుబడి  (gross return) కన్నా  ఎక్కువ రాదు .

గత 30 ఏళ్ళ లో ద్రవ్యోల్పణం 5 నుండి 10 శాతం ఉండి ,
సరాసరి తీసుకొంటే 8 %  గా నిర్ణయించ వచ్చు .

మన సంపద లేదా   పెట్టు బడి పై నిజమైన రాబడి ఎంత  అనేది  క్రింది సూత్రం తో లెక్క వేయ వచ్చు .
r = is the rate of return  and
 i = is the inflation rate.

బంగారం విషయం చూస్తే --- r = 12% ; ద్రవ్యోల్పణం = 8%.


Inflation in India

నికర దిగుబడి  ( return) = 4% మాత్రమే.
అలాగే షేర్లు ,భూమి ,ఇల్లు -వీటి పై నికర నిజమైన రాబడి  4% లోపే   ఉంటుంది .

మన భార తీయులు బంగారం పై ఎక్కువ పెట్టుబడి పెట్టటానికి కారణం - 
దాని ధర  ఎప్పుడూ పెరుగుతూ  ఉంటుంది .
దానితో  నగలు చేయించు కోవచ్చు .
అవసరానికి తాకట్టు పెట్టి డబ్బులు గా మార్చు కోవచ్చు .

నిజానికి , బంగారం ధర అంతర్జాతీయ విఫణి లో తగ్గి పోతుంది .
మనందరం డాలర్  -రూపాయ్ మారకం పై ఆధార పడి బంగారాన్ని దిగుమతి చేసు కోవడం వలన ,మనకు బంగారం ధర ఎప్పుడూ  పెరుగుతూ ఉన్నట్లుగాఉంటుంది .
కానీ, 1980- 2000 మధ్య , అంతర్జాతీయ విఫణి లో డాలర్ పరంగా బంగారం ధర దారుణంగా పడి పోయింది .
Gold lost its charm as a safety net and fell to about $250 an ounce in 2000 from 700$ in 1980 . 
డాలర్ -  రూపాయ్ మారకం విలువలు , ఆర్ధిక అనిశ్చితి  ,భారతీయుల మనస్తత్వం - ఇవన్నీ బంగారం ధరను వక్రీకరించి మనం ఎక్కువ ధరకు కొనే విధంగా చేస్తున్నాయి .

Sunday 6 January 2013

హిందూ వుల ఆవేదన

మానవులంతా ఒక్కటే ! నిజమేనా ?
మతాలన్నీ ఒక్కటే చెబుతాయి ! నిజమా ?
భారతీయులంతా ఒక్కటే ! ఇదీ నిజమేనా ?
మతం పేరుతో ,కులం పేరుతో ,జనాభా ప్రాతిపదిక (మైనారిటీ )పేరిట ,దేశాన్ని చీల్చి చెండా డుతుం ది ఎవరు ?

ముస్లిం లకు 60 సొంత దేశాలున్నాయి . క్రైస్తవులకు   150 సొంత దేశాలున్నాయి .  అలాగే భౌద్దులకు 20  సొంత దేశాలున్నాయి .
100 కోట్ల హిందువుల కు తమ సొంత దేశం ఒక్కటైనా  ఉందా ?
ప్రపంచం లో 15 శాతం మందికి ఎలాంటి మతమూ  లేదు .
ప్రపంచ జనాభా లో 32 శాతం క్రీస్తు మతాన్ని (157 దేశాలు ) , 25 శాతం ముస్లిం మతాన్ని( 50 దేశాలు  ) , 15 శాతం హిందూ మతాన్ని   ( 2 దేశాలు  )నమ్ముతున్నారు .
ఆశ్చర్యం ఏమిటంటే ,చైనా లో ,జపాన్ లో సగం జనాభా ఏ మతాన్నీ నమ్మటం లేదు .
ప్రతి మతానికి తమ సొంత దేశం ఉండాలా ?
అక్కర లేదు .  ఎందు కంటే  తమ సొంత దేశమని చెప్పుకోక పోయినా ముస్లిమ్స్ దేశాలలో లేని సౌకర్యాలు ,సంక్షేమ కార్య క్రమాలు ,రాజ్యంగా బద్ద   మైన రాయితీలు ముస్లిమ్స్  కి ఒక్క భారత దేశం లో మాత్రమే లభిస్తున్నాయి .
ఎంత ఉదార దేశం ! ఎంత సెక్యులర్ దేశం !
కానీ  కొన్ని విషయాలు పరిశీలిస్తే  భారత దేశం నిజమైన సెక్యులర్ దేశం అని చెప్పు కోవటానికి సిగ్గు పడ  వలసి వస్తుంది .
సెక్యులర్ అంటే అన్ని మతాలను ఎలాంటి వివక్ష లేకుండా సమానంగా ఆదరించాలి . అసలు మతం పేరు ఎక్కడా ఎత్తకూడదు . మత  ప్రాతి పధిక అనేది ఏ  విషయం లో కూడా ఉండరాదు .
సహాయం చేయాలీ అనుకొంటే ఆర్ధిక అసమానత లను   ప్రాతి పధిక గా తీసు కోవాలి .
తీర్ధ యాత్రలకు (హాజ్ ,మక్కా ) ఉచితంగా డబ్బులు ఒక్క ముస్లిమ్స్ కి ఇస్తారు . హిందువులకు మాత్రం  మరింతగా శిస్తులు వసూల్ చేస్తారు .
మదరసాలకు ,మసీదులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది .
కానీ,హిందూ గుళ్ల ఆస్తులను ,ఆదాయాలను  లా క్కొం టుంది .
అందరికీ సమాన హక్కులు ,భాద్యతలు  ఉండాలి . కానీ మన భారత దేశంలో సరి సమాన పౌర చట్టం లేదు .
భాద్యతలు సమానంగా  లేక పోవుట వలన మతాల మధ్య సమ తుల్యత పోతుంది .
జనాభా పెరుగుదల అరి కట్టే విషయం లో కొన్ని మతాలకు మినా హాయింపు ఇచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా  ఉన్న మన  ప్రభుత్వ విధానాలు మరే దేశం లో లేవు .

కానీ మన దేశం గోప్పతనమనాలో లేక మత అసమానత అనాలో ,క్రింది విషయాలు చూడండి .
ముస్లిమ్స్ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ముస్లిం పార్టీలే అధికారం చలా యిస్తాయి .
అలాగే  హిందూ మతస్తులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు కూడ  ముస్లిం పార్టీలే అధికారం చలా యిస్తాయి .
కానీ ముస్లిం మెజారిటీ ఉన్న ఏ  రాష్ట్రానికీ , హిందూ మతస్తులు  ఎన్నడూ ముఖ్య మంత్రి కాలేదు
ఇలాంటి పర మత  సహనం ఏ  ఇతర అన్య మత  దేశంలో లేదు .
మజీదులకు హిందూ మత  స్తుడు  ఎప్పుడూ ట్రస్ట్ చైర్మన్ కాక పోయినా ,గుళ్ళకు మాత్రం ముస్లిం ట్రస్ట్ చైర్మన్ అయ్యే అవకాశం ఒక్క భారత దేశం లోనే సాధ్యం .
మన దేశం లోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ జనాభా ఎదుగుదల తగ్గుతుంది ,
కానీ,ముస్లిం జనాభా గత 50 ఏ ళ్ళలో 40 % పెరిగింది .
అన్య మత దేశాలైన పాకిస్తాన్ ,బంగ్లా లలో హిందూ జనాభా పూర్తిగా తగ్గి పోయింది .

అలాగని అన్య మత దేశాలతో మన భారత
దేశాన్ని పోల్చటం సరి కాదు .
భారత దేశం  నిజమైన సెక్యులర్ దేశం గా ఉండాలి .
అన్ని మతాలకు సరి సమాన ఆదరణ ఉండాలి . మత  ప్రాతి పధిక మనుషులను చీల్చ కూడదు . అన్ని మతాల వారు కలిసి మెలిసి సోదర భావంతో ఉండే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి . ఓట్ల కోసం మైనారిటీలకు ,నిమ్న కులాలకు తాయిలాలు ఎర  వేసి కుల మతాల పరంగా సమాజాన్ని చీల్చి వర్గ పోరాటాలను ప్రోత్స హించ కూడదు .
ఆర్ధిక స్థితి ని కొలతగా తీసుకొని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి.
పేదవాడు , ఏ మతానికి కులానికి చెందినా రాయితీలు ఇవ్వాలి .
ఇది అత్యధిక  హిందూ వుల ఆవేదన 

Tuesday 1 January 2013

గుడి -బడి -చెరువు -ఇంకుడు గుంతలు



ప్రతి గ్రామానికి కోవెల ,ఊర చెరువు, బడి అవసరం .

దేవాలయాలు మానవ  పురోగతి లో  ఒక మేలి మలుపు .
వ్యక్తీ వికాస కేంద్రం గా ,సాంఘిక, సాంస్కృతిక  కూ డలి గా గుళ్ళు మానవుడికి సాయం  చేస్తున్నాయి .
కష్టాలకు ఓర్చు కొనే మనో దైర్యాన్ని గుడి ఇస్తుంది .

ఎంతో ఉపయోగ పడుతున్న
 అలాంటి గుళ్ళు ఎలా కట్టాలి , 
మండపం , గర్భాలయం ఏ కొలత ల్లో ఉండాలి , 
ధ్వజ స్తంభం ,బ లి పీటం  ఏ విధం గా అమర్చాలి , 
4 రకాల విగ్రహాలు ఎలా ఎక్కడ ఉండాలి  -
ఇలాంటి విషయాలను చెప్పే శాస్త్రం ఆగమ శాస్త్రం .

కానీ ,ఇప్పుడు ప్రతి పేట లో 4 గుళ్ళు కట్టి
 వాటితో
 వ్యాపారం చేస్తున్నారు . ఇది నేరం మాత్రం కాదు . 
ఇదీ ఒక రకమైన సేవే .
కానీ, ఆగమ నియమాలను కాదని గుడి కడితే ఫలితాలు రావు .
గుడి చుట్టూ ఎలాంటి కట్టడాలు ,ఇళ్ళు ఉండ కూడదు . 
ప్రతి గుడి కీ పుష్కరిణి ,బ లి పీటం  ,ధ్వజ స్థంబం
 ఉండి గర్భాలయం పిరమిడ్  లేదా
 శంఖు ఆకారం లో ఉండాలి .
గుడి నిర్మాణం , గర్భాలయ కొలతలు , విగ్రహ ప్రాణ ప్రతిష్ట  ,
మంత్రోచ్చారణ ఇవన్నీ  వాస్తు మరియు
 శబ్ద శాస్త్రానికి  చెందిన  విషయాలు .


బడి ఎలా ఉండాలి ?
విలువలతో కూడిన విద్య నేర్పే గురువులున్న బడి ఉండాలి .
ఎవరు సత్ గురువు?
చెప్పేది ఆచరిస్తూ విద్యార్ధులకు భోధించే వారు సత్ గురువులు.
విద్యార్ధి శారీరక ,మానసిక ,ఆత్మిక ఎదుగుదలకు బడి సాయ పడాలి .
ఆట పాటలు శరీరాన్ని , చదువు విజ్ఞాన వివేక విచక్షణలను , విలువలు వ్యక్తీ త్వాన్ని  అనగా ఆలోచన సరళిని ,వినయ విధేయతలను సాన పెట్టాలి . 
ప్రతి విద్యార్ధి నెలకు మూడు  రోజులు సమాజ సేవ లో పాల్గొనాలి . అనగా చిన్న పరిశ్రమ ,పంట  పొలం , బ్యాంక్ ,పోస్ట్ ఆపీస్ ,రైతు మార్కెట్ ,గ్రంధాలయం ,ఆసుపత్రి ,పోలీస్ స్టేషన్ ,ప్రార్ధనా మందిరం  లో పని చేయాలి .అభాగ్యులకు ,వృద్దులకు వారి దిన చర్యలో సాయ పడాలి .
ప్రతి విద్యార్ధి ఏదో ఒక లలిత  కళ లలో తగు మాత్రం ప్రావీణ్యం సంపాదించాలి .

చెరువు ఎలా ఉండాలి ? 
 
 గట్టుచుట్టూ పచ్చనిచెట్లు , పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. గట్టుచుట్టూ మనుషులు నడిచే బాట ఉండాలి. చక్కని పరిసరాలు ,నీరు వచ్చి వెళ్లి పోవడానికి ఏర్పాటు .

అలాగే ప్రతి ఇంటి వాకిలి లో  వాన నీరు తీసు కొనే ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకోవాలి .



who is kshatriya ? క్షత్రియు డంటే ఎవరు ?

who is kshatriya ?  క్షత్రియు డంటే   ఎవరు ?



దైర్యం , పట్టుదల , ఓర్పు , క్షమ , తల వంచని 

ధీరత్వం , అంకిత భావం , ఇచ్చా శక్తి  , 

ధర్మ కర్మా చరణ , బలహీనుల రక్షణ ,

 నాయకత్వ  లక్షణాలు  -ఇవన్నీ ఉన్న వారిని 

మాత్రమే క్షత్రియు లంటారు .

జన్మత క్షత్రియులు కాలేరు .

క్షత్రియు డంటే  శారీరక ,మానసిక  ,

ఆధ్యాత్మిక యుద్ద వీరుడు .