Tuesday, 2 August 2016

అందరూ ఆలోచించండి ....ముఖ్యంగా మోడీ గారు కొంచెం మనస్సు పెట్టాలి

గాడ్గిల్ -ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందే  అర్హత లేదని తెలిసీ , రాష్ట్రాన్ని చీల్చి పడేసే హడావిడిలో ,ఆంధ్ర ప్రాంత ప్రజలను బుజ్జగించ డానికి కాంగ్రెస్ ,భాజాపా రెండూ కూడా రాజ్యసభలో హామీలు గుప్పించాయి . అంతే కాదు ,ఎన్నికల వేళ మోదీ కూడా ఆంధ్రుల కు అరిటాకులో వడ్డనచేస్తా నని  ఆశలు రేపాడు .

14 వ ప్రణాళికా సంఘాన్ని వేసి ,నీతిఆయోగ్ అనే అభివృద్ధి సంఘాన్ని కూర్చి ,  పన్నుల్లో రాష్ట్రాలవాటా ను 32 % నుండి 42% పెంచామని ,కాబట్టి ఆంధ్రాకి వేరే సాయం అనవసరం అని నేడు బల్లగుద్ది ఉభయసభల్లో చెబుతున్నారు.  .
కేంద్రం,  రాష్ట్రాలకు సాయం చేయడం అనేది రాజ్యాంగ నియమం . అది 30% ఉచిత సాయం రూపం లో ,70% అప్పు రూపం లో ఉంటుంది . కానీ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రం ,90% ఉచిత సాయం ,10% అప్పు రూపం లోనూ ఉంటుంది . అంతే కాదు ,ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల లో  కార్పోరేట్ పన్ను , ఆదాయం పన్ను ,తయారీ
పన్ను ,అమ్మకం పన్ను మొదలగు ప్రత్యక్ష, పరోక్ష పనులలో రాయితీలు ఉండటం వలన పరిశ్రమలు ,కంపెనీలు ,సేవారంగపు సంస్థలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో స్థాపించ డానికి  మొగ్గు చూ పుతారు . దీని  వలన నిరుద్యోగం పోయి, రాష్ట్ర GDP పెరిగి,  ప్రజల కొనుగోలు సామర్ధ్యం పెరగడం వలన వినియీగా దారుల మార్కెట్ కూడా ఇబ్బడి ముబ్బడి గా పెరిగి పోతుంది .

రాష్ట్రాలకు కేంద్రం అందించే సాయం ఒక పద్ధతిలో ,ఒక ఫార్ములా ప్రకారమే ఉంటుంది గానీ ,ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు దోచి పెటేయడం జరగదు .
ఉదాహరణకు ,  రాష్ట్రాలకు అందించడానికి కేంద్రం దగ్గర 100 రూపాయలు ఉన్నాయి . ఇందులో కేవలం 30 రూపాయలు (30%) మాత్రమే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలన్నింటికీ సర్దాలి . ఇప్పటికే 11 ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి . వీటి మధ్యన ఈ 30% ని సర్దాలి గదా . ఏది ఎలా పంచుతారంటే , ఆయా రాష్ట్ర ప్రణాళిక మరియు ఖర్చు ని ఆధారం చేసుకొని పంచుతారు . ఇప్పుడు ప్రత్యేక హోదా  ఇస్తే గిస్తే ఆంధ్ర 12 వ రాష్ట్రం  అవుతుంది .

మిగతా 70 రూపాయలను ( 70% ) ని మిగతా రాష్ట్రాలకు అందిస్తుంది .
ఆంధ్రా ఎందుకు డిమాండ్ చేస్తోంది ?
5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకు వ్యతిరేకం గా విభజన చేశారు .
వారి జీవనాడి ,ఆర్ధిక నాడీ కేంద్రమైన రాజధాని నుండి బలవంతం గా గెంటేశారు .
 హైదరా బాద్ నుండి వచ్ఛే రెవెన్యూ లో భాగం ఇవ్వకుండా కేవలం 10ఏళ్లపాటు తెలంగాణకి వివిధ పన్నుల రూపం లో అద్దె చెల్లించు కొంటూ  ఉండటానికి ఒప్పుకోవడం పుండుమీద కారం చెల్లినట్లే !
గత 60ఏళ్లలో మూడు మౌలిక రంగాల లో ఒక్క వ్యవసాయం తప్ప రాష్ట్ర GDP  ని శాసించే సేవా ,తయారీ రంగాలకు చెందిన సంస్థలన్నీ పోగొట్టుకొని ఒక రకం గా నడివీధిన పడ్డారు .
కృష్ణా , గోదావరి నదులకు చిట్ట చివరి అట్టడుగు రాష్ట్రమైన ఆంధ్రాకి న్యాయం గా అందవలసిన హక్కులను కాపాడటానికి "నదీ పరిరక్షణ కమిటీ ని" కేంద్ర పరిధిలో వేస్తేనే ఆంధ్రాకి అన్యాయం జరగకుండా కాపాడు కోవచ్చుఁ .
కానీ అదీ జరగలేదు . అంతే కాదు, నదీ దిగువ ప్రాంతం గా గుర్తింపు హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విభజించడం వలన ఆంధ్రా పూర్తిగా అన్యాయం అయిపోయింది .

అఖండ సాగరం చుట్టూ ఉన్నా తాగడానికి చుక్కనీరు లేదనే సామెత లెక్క 1000 కి . ఎం . సముద్ర తీరం ఉన్నా సరైన ఓడరేవులు లేవు .
పెరట్లో కాచిన కూరలన్నీ ఇరుగు పొరుగు పట్టుకు పోయిన చందం గా , మన తీరంలో ఉన్న గ్యాస్ ని మనకి ఇవ్వకుండా దోచు కెళుతున్నారు .
డబ్బు పోతే మళ్ళీ సంపాదించు కోవచ్చుఁ . విద్య లేకపోతే ఎట్లా ? ఒ క  విద్యా సంస్థని స్థాపించాలంటే కనీసం 5ఏళ్ళు పడుతుంది . ఎంతమంది ఆంధ్రా విద్యార్థులు ఇబ్బందులు పడతారో ఆలోచించండి .
చదువు ,తెలివి ఉన్నా  సరైన ఉద్యోగాలు  లేకపోతే ఎలా ? ఉద్యోగాలు ఇచ్ఛే సంస్థలన్నీ హైదరాబాద్ లో ఉంటే ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అంటూ తెలంగాణ వాళ్ళు తరుముతుంటే ,స్థానికత పేరుతొ అవకాశాలు లేక ఆంధ్రా విద్యార్థులు  మల మల మాడాలసిందేనా ?
ఇప్పుడు ఆంధ్రాకి కావలసింది నిధుల సాయం కాదు . ఉద్యోగాలిచ్ఛే పరిశ్రమలు ,సంస్థలు కావాలి . యువత పక్కదారిపట్టి సమాజం ఛిద్రం కాకూడదు అంటే ఇది వెంటనే జరగాలి .
ఒక పక్క కేంద్రం 3.9 % లోటుతో కుంగి పోతుందని అంటున్నారు . అలాంటప్పుడు ప్రత్యేక పాకేజీ మాత్రం  ఎలా ఇవ్వగలరు ?
 జీవాధారాలైన నీటిని , జీవనా ధారా లైన రాజధానిని ,ఆర్ధిక పరిపుష్టిని కోల్పోయి  ... ఇలా మూడు విధాలుగా చెడ గొట్ట బడ్డ ఆంధ్రులు ఇంకా ఇలా ఉన్నారంటే అప్పుడు ఎం టి రామారావు ,ఇపుడు చంద్రబాబు చలవ , ఆంధ్రుల కార్య శురత్వం తప్ప మరోటి కానే కాదు .
స్వాతంత్రం వఛ్చిన తర్వాత ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాలు, ఇతరుల కెవ్వరికీ  జరగలేదు .
మరీ ఇంత  అన్యాయం ఏ రాష్ట్రానికి జరగలేదు . జరగకూడదు కూడా !
ఎందుకంటే ,అప్పుడు కాంగ్రెస్ ,ఇప్పుడు భాజపా పై ఆక్రోశం ,ఆవేశం ఉండటం పెద్ద విషయం ఏమీ కాదు . కానీ అసలైన అత్యంత  విషమ మైన  మార్పు ... భారతదేశ సార్వభౌమత్వం పైన ,రాజ్యాంగం పైన ఏహ్యత , ఆంధ్రా ప్రజలలో వస్తే అది దేశానికే , దేశ సమగ్రతకే  ప్రమాదం !

Tuesday, 28 June 2016

ఆంధ్రా ఆఫీసులు ... ఇప్పుడు మీకు మరింత చేరువలో ...

హైదరాబాద్ నుండి సుమారు 40 ప్రభుత్వ శాఖలు రాజధాని ప్రాంతం లో ఆఫీసులు ప్రారం భించాయి . 
ప్రజల కు మరింత చేరువ అవుతున్న పాలన వలన అధికారులలో జవాబుదారీ తనం పెరగడమే కాక , ప్రజలకు కూడా సౌకర్యం వంత మైన పాలన అందుతుంది . 
ఏయే ఆఫీసులు  ఏ ప్రాంతం లో ఉన్నాయో అందరికీ తెలియాలన్న ఉద్దేశ్యం తో ....... clip

Sunday, 26 June 2016

water ... water...every where!

నీరు మనందరికీ జీవాధారం . వర్షాలు కురవడం ,కురిసిన నీటిని వడిసి పట్టి భూమాత పొత్తిళ్ళలో కి ఇంకే టట్లు చేయడం ,మనిషి కనీస బాధ్యత .
కిందటి  నెలలో ఒక యజ్ఞం మాదిరి  లక్షలాది ఇంకుడు గుంతలు తీయడం వలన సాధారణ వర్షాలు కురిసినా ,భూగర్భ జల మట్టం సుమారు గజం లెక్క పెరిగిందీ అంటే, ఇది ఈనాడు మరియు ప్రజల భాగస్వామ్యం యొక్క అంకిత భావం తప్ప మరోటి కాదు .

Saturday, 25 June 2016

రైతు ,చేనేత, ద్వాక్రా మహిళ ల కు ఋణ మాఫీ . - రెండవ కిస్తీ .

అందరూ  మరచి పోయి ఉంటారు . రైతన్న ల కష్టానికి ఏదో ఉడత సాయం లెక్క  మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాలలో అత్యంత ముఖ్యమైనది రైతు ,చేనేత, ద్వాక్రా మహిళ ల కు  ఋణ మాఫీ .
నేడు (25-6-2016), రెండవ కిస్తీ ని ప్రకటించి తగు పత్రాలను రైతులకిచ్చ్చి భుజం తట్టిన సందర్భం లో , ఒక్క సారి ఇది గమనించండి ...
AP Rythu Runa Mafi List Crop Loan and Gold Loan 1st and 2nd List Status

Friday, 24 June 2016

అమరావతి నగరం ఎలా ఉండ బోతుంది ?

గత దశాబ్దం లో మన దేశం లో ఏర్పడిన కొత్త రాష్ట్రాలు నిర్మించు కొన్న నూతన రాజధాని నగరాలు పెద్దగా ఎవ్వరినీ ఆకర్షించ లేక పోయాయి . కానీ ,ఆంధ్రుల రాజధాని  అమరావతి ' అని చంద్రబాబు ప్రకటించిన నాటి నుండి ఒక చారిత్రాత్మక ,సాంస్కృతిక హార్దిక భావన తెలుగు వారి లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా  ... ముఖ్యం గా బౌద్ధ మత ప్రాచుర్యమున్న జపాన్ ,చైనా ,మొదలగు ఆగ్నేయాసియా దేశాల హృదయాలలో మెదిలింది . 

ఇది కేవలం పరిపాలనా భవనాల కూడలి కాదు . ఆర్ధిక ,ఉద్యోగ ,విద్యా ,వైద్య ,సేవా ,పారిశ్రామిక వాడ లతో  , లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని కల్పించి , రాష్ట్ర ప్రగతికి చోదక శక్తి లా పనిచేసే అద్భుత నగరం గా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు తపన . 

33000 ఎకరాల రైతుల నుండి ,మరో 20 000 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించిన విధానం ,మనదేశం లో మును పెన్నడూ జరగని రీతిలో , రైతులను కూడా అభివృద్ధి పధకం లో ,నగర నిర్మాణం లో భా గ  స్వాములను  చేసిన తీరు  నభూతో ... న భవిష్యత్ . అందరూ బాగా స్వా ములు కావాలి . అందరూ అభివృద్ధి ఫలాలు పంచు కోవాలి ... ఇదే చంద్రబాబు నినాదం ! 

మనం ఓ చిన్న ఇల్లు  కట్టుకోవాలీ అంటే , ఎన్నో స్థలాలు పరిశీలించి ,వాస్తు ,ఇరుగు పొరుగు , పరిశుభ్రమైన వాతావరణం ,నీటి సదుపాయం ,దగ్గరలో విద్యా వైద్య సౌకర్యాలు , రవాణా సౌకర్యం ఇవన్నీ కూలం కుశం గా చూస్తాం కదా ? అదే విధం గా మన ప్రభుత్వం కూడా అనేక ప్రాంతాలను ,జిల్లాలను పరిశీలించి , అన్ని విధాలా ఈ అమరావతి ప్రాంతం ఒక రాజధానిగా మలచు కో వచ్చుఁ అనే ఒక శాస్త్రీయ మైన పరిశోధనా కార్యక్రమం పూర్తయిన తర్వాతే , అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు . 

ఒక చిన్న ఇంటిని కట్టు కోవడానికి ఎన్నో అనుమతులు , మౌలిక సౌకర్యాల కల్పన , డబ్బు ,  ప్రణాళిక , 
పనిచేసే  వాళ్ళు ,వీళ్ళంద రినీ పోగేసి నడుం వంచి పని మొదలు పెట్టడానికే ఎంతో సమయం పడుతుంది . 
కానీ ఏ ప్రభుత్వమూ చేయనంత వేగం గా ఇవన్నీ సాధించి అమలు చేయడం ఒక ఎత్తు అయితే , అమాయకపు కొండొకచో మూర్ఖపు  రైతులను , ఎలాంటి ఇంగిత జ్ఞానం లేని ప్రతిపక్షం వారిని ,గుంటకింద నక్క లా కాచు కొనే మీడియా వారిని , అనుమానం గా చూస్తూ అడ్డంకులు కల్పించ డా నికి సదా సిద్ధం గా ఉండే అధికార వర్గాలను , సోమరితనం తో వ్యవస్థ నంతా కుళ్లు ,కుతంత్రాలతో నింపేసిన ఉద్యోగులను , సాయం చేస్తామని మాట ఇఛ్చి వెన్ను పోటు పొడిచిన కేంద్రాన్ని తట్టుకొని చెప్పిన సమయానికి ప్రణాళిక  రచన పూర్తి చేయడమే కాదు , జరపవలసిన పనులన్నింటినీ సకాలం లో చేస్తూ ,ముఖ్యం గా రైతులకు ,చెప్పిన టైం కి  పట్టాలు ఇవ్వడం అనేది ఓ 
గొప్ప విషయం . చంద్ర బాబు ప్రభుత్వ పనితీరు ,ప్రవేటు సాఫ్ట్ వేర్ సంస్థల పనితీరుని మించి పోయింది . అమరావతి నగర పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లలోని 53000ఎకరాలలో నివాస ప్రాంతం మొత్తం 17వేల ఎకరాలు. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతించిన నిర్మాణ ప్రదేశం (ఎఫ్‌ఎస్ఐ) 2 నుంచి 2.8 వరకు ఉంది. అంటే సరాసరి 2.5 ఎఫ్‌ఎస్‌ఐ అనుకుంటే ఎకరాకు 1,09,125 చదరపు అడుగులు కట్టవచ్చు.
దీనిని సరాసరి వంద నివాస గృహాలుగా లెక్కించవచ్చు. అంటే,ఎకరానికి 100 ఇళ్ళు (అపార్టుమెంట్ లు ) వస్తాయి . 

ఈ లెక్కన 17 వేల ఎకరాల్లో 17 లక్షల గృహాలు నిర్మించడానికి అవకాశం వుంది. ఇంటికి సగటున 3.5 వ్యక్తులు అనుకుంటే 60లక్షల జనాభా అవుతుంది. 217చదరపు కిలోమీటర్లకు సరాసరిన చదరపు కిలో మీటర్ కి   26,650 జన సాంద్రత అవుతుంది.
ఇది చాలా ఎక్కువ .దీనివలన డ్రైనేజీ సమస్య ,మంచి నీటి కొరత , త దితర సమస్యలు ఎక్కువై తాయి . 
మొక్కల పెంపకం  ,హరిత వనాల విస్తరణ ఆగిపోయి ,నగరం విష పూరితమై పోతుంది . 
దీనిని ప్రభుత్వం నియంత్రిమ్చాలీ అంటే  FSI ని 1:1 గా తగ్గించాలి .  అక్రమ కట్టడా లను నియంత్రిమ్చే కఠిన మైన చట్టాన్ని తేవాలి . 
లేకుంటే , అమరావతి కూడా మామూలు కాలుష్య నగరాల వలె మారి పోతుంది . 
ఆదర్శ నగరం అంటే  చదరపు కిలో మీటర్ కి  10000 లోపు జనాభా ఉండాలి . 

Wednesday, 22 June 2016

crop loan waiver -2nd phase

రాష్ట్రంలో మొత్తం 55 లక్షల రుణ ఖాతాలకు మాఫీ వర్తింపచేయాలని గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.50వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... ఇరవై మూడున్నర లక్షల ఖాతాలకు ఒకేసారి పూర్తిగా రుణ ఉపశమనం కలిగింది. మిగిలిన ముప్పై ఒకటిన్నర లక్షల ఖాతాలకు ఇప్పుడు ఈ సర్టిఫికెట్లు అందచేస్తున్నారు. 

ఆ రైతుకు సంబంధించి ఇంకా ఎంత రుణం మాఫీ కావాల్సి ఉంది, ఇప్పుడు ఎంత అవుతోందన్నది దీనిపై ముద్రించారు. ఆ రైతు రుణం ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు, ఆ రైతు ఆధార్‌ నెంబర్‌ కూడా దానిపై ముద్రించారు. 

ఈ సర్టిఫికెట్లను రైతులు ఆయా బ్యాంకులకు తీసుకెళ్లి అందచేస్తే అక్కడి అధికారులు ఆ వివరాలు నమోదు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికార సంస్థకు పంపిస్తారు. వివరాలు వచ్చిన రెండు మూడు రోజుల్లో సంబంధిత బ్యాంక్‌ శాఖకు ప్రభుత్వం ఆ డబ్బు పంపిస్తుంది. ఆ విషయాన్ని రైతులకు ఒక ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియచేస్తారు